Tuesday, November 26, 2024

వారసత్వము (ఆడియోతో…)

భగవంతుడి సమానంగా కావడానికి మన చేసే కృషిని చూసి భగవంతుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఒక వేళ మనం ఆ కృషి చేస్తుండకపోతే, అది వారికి అస్సలు నచ్చదు. ఎందుకంటే వారు కేవలం మన తల్లి, తండ్రి మాత్రమే కాదు, వారు మన శిక్షకుడు కూడా. విద్యార్థులు సరిగ్గా చదవకపోతే టీచరు సంతృప్తిగా ఉండడు.

భగవంతుడు మనకు అవగహనను ఇచ్చారు, తనవారిగా చేసుకున్నారు, వారిలా కావడానికి పాలన కూడా ఇస్తున్నారు. పరమాత్మకు, ఆత్మలకు ఎంతో తేడా ఉందనుకోండి, అయినప్పటికీ, వారిలా కావడము కష్టమేమీ కాదు. ఎంత ఎక్కువగా భగవంతుడిలా అయి సేవ చేస్తామో, అంత ఎక్కువగా మనం వరి దివ్య కర్తవ్యానికి నిమిత్తమాత్రులవుతాము. భగవంతుడు మనల్ని తన సమానంగా చూడాలని ఆశిస్తున్నారు, కనుక ఇద్దరి కోరిక తీరుతుంది.

తండ్రిలా కావడము అంటే వారిలో ఏ గుణాలు, శక్తులు ఉన్నాయో, వాటిని మనకు ఇస్తారు. మనం యోగ్యులము అని వారు భావించి వాటిని మనకు వారసత్వంగా ఇస్తారు. వారు ఇచ్చే గుణాలు, శక్తులు మనం వారిలా కావడానికి దోహదపడతాయి. మనం వారిలా అయినప్పుడు, భగవంతుడు ఏమి చేయదలుచుకున్నా దానిని మన ద్వారా చేయిస్తారు. మరి భగవంతుడు ఇచ్చే వారసత్వాన్ని మనం ఎందుకు తీసుకోకూడదు? వారు భగవంతుడే కాదు, మన తండ్రి కూడా.

-బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement