Tuesday, November 26, 2024

వాక్కే ప్రధానం

‘కేయూరాణి న భూషయన్తి పురుషం హరా న చంద్రోజ్వలా:
న స్నానం న విలేపనం న కుసుమం నాలం కృతామూర?జా: !
వాణ్యౖకా సమలంకరోతి పురుషం మా సంస్మృతా ధార్యతే
క్రియన్తే, ఖిల భూషణాని సతతం వాగ్బూషణం భూషణమ్‌ !!
చంద్రకాంతిలా ప్రకాశించే రత్నాల హారాలు, స్నాన లేపనాదులు, పువ్వులు, కేశాలంకరణాలు, ఇవేవి మనిషికి నిజమైన సౌందర్యాన్ని చేకూర్చలేవు. చక్కగా సంస్కరించ బడిన వాక్కు ఒక్కటే మనిషికి నిజమైన అలంకారం. మిగిలిన భూషణాలన్నీ నశించినా శరీరం నశించినా వాక్కు నిలిచి ఉం టుందని భర్తృహరి నీతి శతకం చెబుతోంది.
ఏ శుభకార్యం మొదలుపెడుతున్నా త్రికరణ శుద్ధిగా అని ప్రమాణంచేయడం పరిపాటి. ఎందుకంటే త్రికరశుద్ధిగా చేసే పనులే విజయవంతమవుతాయి. మనస్సులోను, మాటలోను చేతలలోను పవిత్రత ఏకరూపం కలిగి ఉండడమే త్రికరణశుద్ధి, మనస్సులో మెదిలిన ఆలోచనలను మాటలతో వ్యక్తపరచడం మాటలతో వెల్లడి చేసిన విషయాన్ని ఆచరణ లో చూపుతూ త్రి కరశుద్దిగా చేసిన పనులనే భగవంతుడు మెచ్చుకుంటాడు. ఎవ రికి వాగ్దానం చేసినా మాట, చేత ఆచరణ ఒకేలా ఉండాలి అలా చేయలేకపోవడం ఆత్మవంచన!
మనస్సు కల్మషంగా ఉంటే శరీరం నిర్మలంగా ఉండలే దు. అందుకనే త్రికరణశుద్ధితోనే ఈ రెండింటిని కల్పష ర#హ తంగా ఉంచుకోవచ్చు. మనస్సు నిశ్చలంగా లేకపోతే ఏపనీ సక్ర మంగా సాగదు. వీటిని కల్మషర#హతంగా ఉంచుకోవడానికి నిత్యసాధన అవసరం. మన మనస్సు భగవంతుని మీద లగ్న మైతే అతనే మన మనో కామలను పూర్తిచేసే ఓర్పును కలిగి స్తాడు. కామ,క్రోధ,మద, మాత్సర్యాలు మనిషిని బంధించి మంచి పనులు చేయకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వీటిని త్యజించాలి. అప్పుడు మనస్సు స్ఫటికంలా ఉంటుంది. ఇందు కు కావలసినది సాత్విక గుణం. వాగ్నిరోధం, అసత్య భాషణం, పరుష భాషణం, చాడీలు చెప్పడంలాంటి దుష్టకర్మలకు దూరంగా ఉండాలి. ఈ గుణాలు జన్మత: వచ్చేవి కావు. అందు కు దైవ దర్శనం, పూజలు అవసరం. అంతకన్నా ముఖ్యమైనది సజ్జన సాంగత్యం. మనసును వాక్కును ఏకం చేయడమంటే కపటం లేకుండా ఉండడం అని శ్రీరామకృష్ణ పరమ#హంస బోధించేవారు. ”మహాత్ముల మాటలకు అమోఘమైన శక్తి ఉం టుంది. వారినోట పలికిన ప్రతిమాటా జరిగి తీరుతుంది.” అం టారు స్వామి వివేకానంద. ”ఎవడైతే తన బాధ్యతలన్నీ నెరవే ర్చాక భగవంతుడిని స్మరించాలనుకుంటాడో, వాడు సముద్రం లో అలలన్నీ పోయిన తరువాత స్నానం చేయాలనుకునే లాంటి వాడు. సత్కర్మలు చేయడానికి సమయంలేదు. అనడం ఆత్మ వంచన. మనిషికి పశువుకు వాక్కులో తేడా ఉంది. కనుక వాక్కు ప్రసాదించిన భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
– గుమ్మాకళ్యాణమ్మ, 97551 10398

Advertisement

తాజా వార్తలు

Advertisement