లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్భ్ర##హ్మంద్ర గంగాధరాం
త్వాం త్క్రెలోక్య కుటుంబినీం సరసిజాం
వందే ముకుంద ప్రియాం!!
దివ్య తేజోవంతమైన కాంతి కిరణాలతో భూమిని పరిపాలిస్తు న్న శ్రీమహావిష్ణువు అర్థాంగి లక్ష్మీదేవి. అవనిపై అడుగడుగునా దర్శనమిచ్చే ఆమె మరో రూపం మనం చలామణిలో నిత్యం మన అవసరాలు తీర్చుకుంటున్న ధనం.
ఆ ధనలక్ష్మిని ప్రత్యేక విధానంలో సేవించుకునే పర్వదినం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ శుక్రవారం. ఈ రోజు మహిళలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీవ్రతం చేసుకుంటారు. శ్రావణ మాసం పూర్తి విష్ణు సంబం ధ మాసం. కలియుగంలో వెలసిన తిరుమలేశుని జన్మ నక్షత్రమైన శ్రవణం అనుసరించి వచ్చిన మాసం శ్రావణమాసం. ఇది ద్వారకా నాథుని జన్మతిథి మొదలగు ప్రత్యేక విశేషాంశాలు కలిసిన మాసం. సాక్షాత్తు లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసం. గౌరీ సంబంధ వ్రతము లు చేపట్టి నిత్య సుమంగళిగా జీవితాన్ని ప్రసాదించమని ఆ పార్వ తీదేవిని అభ్యర్థించే మాసం. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం సముద్రరాజు కుమార్తె, శ్రీరంగుని అర్థాంగిగా విష్ణువు మనసులో ప్రతిష్టింపబడిన లక్ష్మీదేవిని వరలక్ష్మీగా సమస్త దేవత లు, మానవులు కొలుస్తారు.
ఈ వ్రతం చేయ సంకల్పించుకునేవారు ముందురోజు ఇల్లూ, వాకిలీ శుభ్రం చేసుకొని, గడపలకు పసుపు కుంకుమలు అద్ది, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి సిద్ధం చేసుకోవాలి. సూర్యోద యానికి ముందే మహాలక్ష్మీ ప్రతీ ఇంటికి తిరుగుతూ, ఏ ఇంటి ముంగిట అలికి, ముగ్గులతో అలంకరించి వుంటుందో, ఆ ఇంటి లోనికి ప్రవేశిస్తుందని విష్ణుపురాణంలో చెప్పినట్లు తెలుస్తోంది. అంతులేని ఐశ్వర్యానికి, సిరిసంపదలకు, పుత్రపౌత్రాభివృద్ధికి, కీర్తి ప్రతిష్టలకు, విద్యావ్యాపారాభివృద్ధికి తోట్పాటునందించే మ#హత్త ర వ్రతము వరలక్ష్మీ వ్రతము.
సర్వార్థ సాధనకరీ ధానుర్ధారణీ కామలా
కరుణాధార సంభూతా కమలాక్ష శశిప్రియా !!
భూలోకంలో ప్రతీ #హందవ స్త్రీ తప్పక ఆచరించదగినది, అమ్మ ఆశీస్సులు అందుకొను అవకాశం కలిగినది, శ్రావణ శుక్రవా రము వ్రతము. అయితే విధివిధానాలు పాటిస్తూ ఈ శ్రావణమాస శుక్రవారాలు మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ప్రత్యేకించి పౌర్ణ మికి ముందు వచ్చే శుక్రవారము జరుపుకునే వరలక్ష్మీ వ్రతము అత్యంత ఫలదాయకమైనది.
ఈ వ్రతమును ఆచరించు స్త్రీలు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలకు నువ్వులనూనె రాసుకొని మంగళ సూత్రములకు, ముఖమునకు, కాళ్లకు పసుపు రాసుకొని స్నానాదికాలు ముగించు కొని, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి పూజ ప్రారంభం చేయాలి. ఈ పూజ చేయు మ#హళలు వ్రతము పూర్తియగువరకు నిరాహారంగా వుండి పూజ చేసుకోవాలి.
చక్కటి కలశను ఏర్పాటు చేసుకోవలెను. ఒక కొబ్బరి కాయను తీసుకొని, పసుపురాసి, కుంకుమతో అలంకరించి, రాగి, వెండి, ఇత్తడి, బంగారంతో చేసిన ఏదో ఒక పాత్రను తీసుకుని పవిత్రమైన నీటితో కాని, బియ్యంతో కాని నింపి, దానికి సిద్ధం చేసుకున్న కొబ్బరి కాయను అమర్చి, ఆ కొబ్బరిపై క్రొత్త వస్త్రం చుట్టవలెను. కలశము నకు చీర కట్టే అలవాటు ఉన్నట్లయితే, కొంచెం పెద్ద కలశ తీసుకుని, దానిని అలంకరించుకోవచ్చును. మనం గుర్తుంచుకోవలసినది భక్తిప్రదానము. పూజకు సిద్ధం చేసుకొన్న స్థలంలో వరలక్ష్మిని నిలి పి, యధావిధిని, ఆ రోజువున్న మంచి సమయంలో పూజ చేయాలి.
లక్ష్మీ స్తుష్టిర్మహాధీరా శాంతిరాపూరణనవా
అనుగ్రహా శక్తిరాద్యా జగజ్జ్యేష్టా జగద్విధి: !!
శక్తిని అనుసరించి అష్టోత్తరంతో కాని, స#హస్రంతో గాని పూజ చేసుకొనవచ్చును. షోషశ పూజ మాత్రం విధిపూర్వకంగా చేయాలి. లభ్యతను అనుసరించి తొమ్మిది రంగుల పువ్వులు, నవధాన్యాలు ఉపయోగించటం శ్రేష్టము.
అనంతా వైష్ణవీవ్యక్తా విశ్వానందా వికాసినీ !
శక్తిర్విభిన్న సర్వార్తి: సముద్ర పరితోషిణీ
పూజకు సిద్ధం చేసిన స్థలంలో తమలపాకులోగాని, వెండి పళ్ళెంలో గాని, రాగిపళ్ళెంలోగాని పసుపు గణపతిని పెట్టి, పూజ ప్రారంభించాలి.
”శుక్లాంభరం ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే” అని ఆదిదేవుని ప్రార్థిం చి, అనంతరం మహాలక్ష్మిని వ్రతనియమానుసారంగా పూజించి, నైవేద్య, చందన తాంబూలాది సత్కార్య విధులను చేయవలెను. మనకు అందుబాటులోవున్న నైవేద్యాన్ని భక్తితో సమర్పించవచ్చు. ఫలములు, పాయసము, పాలు, తేనె మొదలైనవి సమర్పించ వచ్చు. అలాగే పూజావిధిలో వస్త్రం సమర్పించేటప్పుడు పట్టు వస్త్రాన్నే సమర్పించనవసరం లేదు. అందుబాటులోని కొత్త వస్త్రం ఏదైనా సమర్పించవచ్చును. ఆభరణ సమర్పణ విషయంలో కూడా స్వర్ణాభరణముల అవసరం లేదు. వాటి స్థానంలో మంచి పుష్పాలు సమర్పించవచ్చును. విధివిధానం ప్రకారం, భక్తితో, వర లక్ష్మిని పూజించినట్లయితే, సంపదలు, సౌభాగ్యము సిద్ధిస్తాయి.
నవ తోర గ్రంధి పూజ
పూజలో నవతోరం గ్రంధి పూజ చేయాలి. ఇందులో తొమ్మిది పోగులు, తొమ్మిది ముడులు ప్రధానము. ఏదైనా ఒక రకం పువ్వు లను ఉపయోగించవచ్చు. లేదా తొమ్మిది రకములు పుష్పములతో చేసుకొనవచ్చు. తోర గ్రంధికి ప్రత్యేక మంత్రంతో అర్చించి ధరిం చాలి. వ్రత ఫలము సంపూర్ణంగా లభించుటకు, ఆ వరలక్ష్మి అను గ్ర#హం సిద్ధించుటకు మూడు తోరములను తయారుచేసుకోవాలి. సాక్షాత్తు అమ్మవారిగా భావించే పుణ్యస్త్రీకి ఒకటి, వరలక్ష్మికి ఒకటి, తాను ఒకటి ధరించవలెను. తోరం ధరించేటప్పుడు పఠించ వల సిన మంత్రము
”బధ్నామి దక్షిణ #హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభి వృద్ధించ దే#హమే రమే”.
పూజానంతరము సూత పౌరాణికుడు, శౌనకాది మ#హర్షుల ద్వారా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన చారుమతిదేవి కథను చదువవలెను. కథను చదివేటప్పుడు అక్షతలు చేతిలో నుంచుకొన వలెను. తరువాత అక్షతలు అమ్మవారి పాదాలవద్దనుంచి, వాటిని శిరస్సుపై ధరించవలెను.
ఆ వరలక్ష్మీదేవికి నవవిధ ప్రదక్షిణలు చేసినట్లయితే, ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క ఫలితము సంప్రాప్తి సుంది. మహాలక్ష్మి అనుగ్ర#హం కోసం ముత్తయిదువులకు వాయ నం ఇవ్వవలెను. ఈ క్రింది శ్లోకం చదివిన మంచిది.
వాయన విధి: ఏవం సంపూజ్య కల్యాణీం వరలక్ష్మీం స్వశక్తత: దాతవ్యం ద్వాదశాపూపం వాయనం పి ద్విజాతయే !!
వాయనదాన మంత్రము: ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వైదదాతిచ, ఇందిరా తారకోభాభ్య మిందిరాయై నమో నమ:
ఈ వాయనంలో పరావర్తనము చెందిన అనగా నానబెట్టిన శనగలు, రెండు పళ్ళు, అరటి పళ్ళు లేక నారికేళం, 5 తమలపా కులు, 2 వక్కలు, పదకొండు రూపాయల దక్షిణ, 5 లవంగాలు, 5 ఏలకులు, గాజులు, కాటుక, పసుపు, కుంకుమలు, కలిగినచో చీర లేక జాకెట్టు, సిద్ధం చేసిన తోరంగ్రంధి, పుష్పములు వాయనముగా దానమిచ్చి, వారి పాదాలకు నమస్కరించి, అక్షతలు వేయించు కొని, వారి నుంచి అమ్మవారి తరపున ఆశీర్వచనం పొందాలి.
అనంతా వైష్ణవీ వ్యక్తా విశ్వానందా వికాసినీ
శక్తిర్విభిన్న సర్వార్తి: సముద్ర పరితోషిణీ
సర్వం సన్మాంగళాని భవన్తు.
సర్వం వరలక్ష్మీదేవతార్పణమస్తు.
– డా. దేవులపల్లి పద్మజ
98496 92414