Friday, November 22, 2024

లక్ష్మీదేవికి అత్యంత ప్రియం కోజాగరి వ్రతం

అశ్వనీ నక్షత్రానికి చంద్రుడు మిక్కిలి దగ్గరగా ఉండే రోజు ఆశ్వీయుజ శుద్ధ పూర్ణిమ. ఆ రోజు విశేష ప్రాధాన్యతను కలిగి ఉంది. లక్ష్మీదేవికి, శ్రీరామునికి ప్రియమైనదైన, ఆశ్వీయుజ మాస వ్రతాలలో విశేష భాగ్య దాయిని అయిన కోజాగరీ వ్రతాన్ని దసరా తర్వాత వచ్చే పౌర్ణమినాడు జరుపుకోవడం హిందువుల సంప్రదాయం.
హిందువులు పూజించే స్త్రీ దేవతలలో లక్ష్మీదేవిని మొట్ట మొదట పేర్కొంటారు. అందరితో నిత్య పూజలందుకునే లక్ష్మీ దేవి పేరున ఒక వారము పిలుబడగా, ఏడాదికి ఒకసారి వచ్చే కోజాగరి పూర్ణిమ రోజున విష్ణుపత్నికి విశేష అర్చనలు చేయ డం సనాతన ఆచారం. క్షీర సాగరంలో జన్మించిన లక్ష్మీదేవిని విష్ణుమూర్తి భార్యగా స్వీకరించగా, విష్ణువును పురుషునిగా, లక్ష్మిని ప్రకృతిగా భావించి పూజిస్తారు. ఆశ్వీయుజ పూర్ణిమ నాడు లక్ష్మీదేవి భూమి అంతా కలయ తిరుగుతూ ప్రతి ఇంటి వద్ద నిలిచి, అర్ధరాత్రి ఎవరు మేలుకుని ఉన్నారని అడుగుతుం దిట. ఎవరూ పలకకపోతే వెళ్ళిపోతుందని పురాణ కథనం. అందుకే రాత్రంతా జాగరణ చేస్తూ, క్షీరాభిజాతయైన లక్ష్మికి ప్రీతి పాత్రమైన పంచదార, ఏలకపొడి, కుంకుమ పువ్వు వేసి క్షీరాన్నం వండి, లక్ష్మీ దేవతకు వెన్నెలలో ఉంచి నివేదిస్తారు. ఇలా ఉంచడం వల్ల చంద్ర కిరణాల ద్వారా వచ్చిన అమృతం అందులో పడుతుందని విశ్వాసం. ఆహ్వానించిన అతిథులకు బంధుమిత్రులకు పాలు పంచుతారు. ఇలా లక్ష్మీదేవిని అర్చిం చి, జాగరణ చేస్తే లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందుతారని నమ్మకం. ఈరోజు చుట్టాలతో స్నేహితులతో రాత్రి యక్షక్రీడ ఆడుతూ, అర్ధరాత్రి వరకు మేలుకొని ఉండడం పుణ్యప్రదమని శాస్త్ర వచనం. దీనిని భాగ్యవర్తకంగా భావిస్తారు.
ఆశ్వీయుజ మాసంలో విశేష పుణ్యాన్ని కలిగించే వ్రతం ఏదని వాలఖిల్య రుషిని, రుషులు ప్రశ్నించగా, ”కోజాగరీ” వ్రతమని పేర్కొన్నట్లు కథనం. మగధ దేశ విప్రుడైన వలితు డు, భార్య చండిని సంపద కోసం పెట్టే బాధలు భరించలేక, ఇల్లు వదిలి అడవి బాట పట్టాడు. అలా వెళుతుండగా, నదీ తీరాన రాత్రి ముగ్గురు నాగకన్యలు వచ్చి, లక్ష్మీ పూజ చేసి, యక్షక్రీడ ఆడేందుకు గాను నాలుగవ మనిషి కోసం వెతకగా, వలితుడు కన్పిస్తాడు. వారు ఆయనను యక్షక్రీడకు రమ్మని పిలుస్తారు. దానివల్ల భాగ్యం కలుగగలదని చెపుతారు. జూదం వ్యసమని వలితుడు చెప్పగా, ఆనాడు యక్షక్రీడకు శాస్త్రీయమైన అనుమతి ఉందని, ఒప్పించి, ఆట ప్రారంభి స్తారు. వలితుడు మూడుసార్లు ఓడి, ఉన్నదంతా పోగొట్టు కోగా, పంచె, కౌపీనం, యజ్ఞోపవీతం మాత్రమే మిగులుతా యి. అర్ధరాత్రి లక్ష్మీనారాయణులు భూలోక సంచారం చేస్తూ, నిద్రపోకుండా ఉన్న పేద బ్రాహ్మణుని, నాగకన్యలను గాంచి, సదరు బ్రాహ్మణుని వివాహ మాడాలని వారికి చెపుతారు. తమతో జూదంలో గెలిస్తే, అట్లేయని వారు అంగీకరించగా, ఆ ద్విజుడు ద్విగుణీకృత ఉత్సాహవంతుడై, విజయుడవుతాడు. వారిని గాంధర్వ వివాహమాడి, నాగకన్యలతో, భాగ్యవంతు డై ఇంటికి తరలగా, చండిని స్వాగతించగా, చీకుచింతా రహ తులవుతారు. కోజాగిరి పూర్ణిమనాడు ద్వార బంధాల ముంగి ళ్ళలో గోడల మీద లక్ష్మీదేవి పాద చిహ్నాలు, వరి, శంఖాల, పైడికంటి పిట్టల, ఆకుల బొమ్మలను వేసే పద్ధతి మహారాష్ట్రలో ఉంది. అలంకృత గృహాలలో గవ్వలు లేదా పాచికలు ఆడు తూ మేలుకొని ఉండడం సర్వత్రా ఆచరణలో ఉంది. అలాగే తొలి చూలు బిడ్డకు తల్లి కొత్త బట్టలు వేసి, అక్షతలు చల్లి దీర్ఘా యురస్తు అని దీవించడం, దేవ వైద్యులైన అశ్వినీ దేవతల రక్ష ణలో తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కొన్నిచోట్ల ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు.
(నేడు కోజాగరీ పౌర్ణమి సందర్భంగా…)

– రామ కిష్టయ్య సంగనభట్ల
9440595494

Advertisement

తాజా వార్తలు

Advertisement