Friday, November 22, 2024

రేపటి నుంచి శ్రీయాగం

నేడు పద్మావతీ అమ్మవారి ఆలయంలో అంకురార్పణ
తిరుచానూరు, ప్రభన్యూస్‌ : ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం లోకమాత తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 21నుంచి 27 వరకు శ్రీయాగం నిర్వహించనున్నారు. గురువారం అంకురార్పణ చేయనున్నారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో ఏకాంతంగా ఈ యాగం జరుగనున్నది. అర్చకులు పి.శ్రీనివాసన్‌ ఈ యాగానికి ప్రధానాచా ర్యులుగా వ్యవహరిస్తారు. 21న మొదటి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు యాగశాల హోమాలు, చతుష్టానార్చన, అగ్ని ప్రతిష్ట, నిత్యపూర్ణాహుతి, నివేదన, వేద విన్నపం, మహామంగళహారతి నిర్వహిస్తారు. 27న చివరి రోజు ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు చతుష్టానార్చన, హోమాలు, మహాప్రాయశ్చిత్త హోమం, మహాశాంతి హోమం నిర్వహిస్తారు. ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు మహాపూర్ణాహుతి నిర్వహించనున్నారు.
ఆర్జిత సేవలు రద్దు
శ్రీయాగం కారణంగా ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊం జల్‌సేవను టీటీడీ రద్దు చేసింది. 20, 21, 27 తేదీల్లో బ్రేక్‌ దర్శనం రద్దు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement