Monday, November 25, 2024

రావణ కుంభకర్ణాది రాక్షసుల చరిత్ర

ఒకనాడు సుమాలి పాతాళం నుండి భూలోకానికి వచ్చా డు. పుష్పక విమానంలో వెళ్తున్న కుబేరుని యాదృచ్ఛి కంగా చూశాడు. కుబే రుడు తండ్రి విశ్రవసుని సేవించ డానికై వచ్చాడు. సర్వాలంకార భూషితుడై మహావిభవ సంప న్నుడైన కుబేరుని చూసి సుమాలి అసూయపడ్డాడు. పాతాళానికి తిరిగి వెళ్ళాడు.
కుబేరుని ఐశ్వర్యం, వైభవ ప్రాభవాలే సుమా లి మదిలో మాటిమాటికి మెదిలాయి. అలాంటి వైభవం రాక్షసులకు ఎలా కలుగుతుంది? అని పలు విధాలుగా ఆలోచించాడు. అతని మనస్సు అపూ ర్వ సౌందర్యరాశి అయిన తన కూతురు కైకసి వైపు మర లింది. కైకసిని విశ్రవసునికి భార్యను చేస్తే తన వాంఛ తీరుతుంది అనే ఊహ. అతనిని కర్తవ్యోన్ముఖుని చేసింది. వెంటనే కైవసిని పిలిచి ”అమ్మా! అపురూప లావణ్య రాశివయిన నిన్ను ఎవ్వడూ కన్నెత్తి చూడడానికి సాహసించడం లేదు. ఆడపిల్లను తగిన వరునికి ఇచ్చి పెండ్లి చేయడం తల్లిదండ్రుల కర్తవ్యం. పుట్టినింటికి మెట్టనింటికి వన్నె తేగలిగిన నీకు పులస్త్య బ్రహ్మ కొడుకు విశ్రవసుడు తగిన వరుడు అని నా అభిప్రాయం. అతనిని పెండ్లాడితే కుబేరుని వంటి మహోన్నతుడిని నీవు కుమారునిగా పొందగలవు” అన్నాడు.
కైకసి తండ్రి మాటను శిరసావహించి, విశ్రవసుని ఆశ్రమా నికి పయనమయ్యింది. అసుర సంధ్యవేళ, విశ్రవసుడు అగ్ని కార్యాలు తీరుస్తున్నప్పుడు అతనిని సమీపించింది. సిగ్గుతో తలవంచి కాలి బొటన వ్రేలితో నేలను రాస్తూ నిలిచింది. విశ్ర వసుడు ఆమె సిగ్గును, వినయాన్ని, చేష్టలను చూసి ఆంతర్యాన్ని ఊహించాడు. యథా లాపంగా ఆమె వివరాలను అడిగాడు. ఆమె తన పేరు కైకసి అని, తన తండ్రి సుమాలి ఆజ్ఞ ను అనుసరించి నిన్ను సేవించడానికి వచ్చానని తెలిపింది. ”మహాత్మా! మీకు తెలియనిది ఏమున్నది?” అని తన మదిలోని తమకాన్ని, కోరికను చెప్పకనే తెలిపింది.
విశ్రవసుడు ఆమె మనస్సు తెలుసుకున్నాడు. సంతానాన్ని కోరి, అసుర సంధ్యవేళ వచ్చావు. అందువల్ల నీకు క్రూరకర్ములు, మహా భయంకరులు, దుష్ట స్వభావులు పుడతారు అన్నాడు.
”దుష్టాత్ములైన కొడుకులను పొందలేను. నన్ను అనుగ్రహిం చండి” అని కోరింది కైకసి. విశ్రవసుడు దయతలచి, నీ చిన్న కుమా రుడు ధర్మపరుడు, సాధు స్వభావుడు అవుతాడు” అన్నాడు. తరు వాత కైకసి గర్భవతి అయ్యింది. నల్ల మబ్బు రంగు శరీరంతో, పది తలలతో, 20 చేతులతో, ఎర్రని పెదవులతో, భయంకరమైన కోర లతో భయంకర రూపుడైన రాక్షసుడు పుట్టాడు. అతడు పుట్టగానే భయంకరమైన ఉత్పా తాలు కలిగాయి. విశ్ర వసుడు అతనికి ‘దశ కంఠుడు’ అని నామ కరణం చేశాడు. తరువాత పర్వతాకారుడు, వికృత భయం కర ముఖుడు పుట్టాడు. అతనికి కుంభ కర్ణుడు అని నామకర ణం చేశాడు. తరు వాత కైకసికి వికృ త రూపిణి అయిన శూర్పణఖ పుట్టింది. చివరకు సాధు స్వభా వుడు, సద్గున సంపన్ను డు, ధార్మికుడు, బలపరాక్రమ సంపన్ను డైన విభీషణుడు జన్మిం చాడు. విభీషణుడు పుట్టగానే దివి నుండి
పూలవాన కురిసింది. దేవ దుందుభులు మ్రోగాయి.
దశకంఠ కుంభకర్ణులు సహజంగా దుష్ట స్వభావులు. వారు పావనమైన ప్రశాంతమైన, ఆశ్రమంలో పుట్టి పెరిగినా క్రూరాత్ము లయ్యారు. ఇతరులను పీడించడమే వారి నిత్యకృత్యం. ఇతరులను హింసించి, ఆనందించడం వారికి సరదా!
కుంభకర్ణుడు ఆకలితో ఆవురావురుమంటూ కనపడిన జంతు వులను, పక్షులను, నరులను, మునులను, భక్షించేవాడు.
పర్వత ప్రమాణ దేహుడై సర్వప్రాణి పీడాకరుడై ముల్లోకా లను అల్లకల్లోలం చేసేవాడు. విభీషణుడు సాధు స్వభావుడై చదువు సంధ్యలందు శ్రద్దాసక్తుడై గురువులను సేవించేవాడు. భూత దయ, పరోపకారం అతని సహజసిద్ధ గుణాలు.
ఒకరోజు కుబేరుడు తండ్రిని దర్శించ తలచి, పుష్పకంలో అత్యంత వైభవ సంపన్నుడై వచ్చాడు. సవతి కొడుకు వైభవ ప్రభా వాలను చూసి కైకసికి కన్ను కుట్టింది. మత్సరంలో అసూయతో రగి లిపోయింది. దశకంఠుని పిలిచి, అతనికి కుబేరుని చూపించిం ది. ”మీరు ఇద్దరు విశ్రవసుని కొడుకులే కదా! నీవు హీనంగా ఉం డడం సహింపలేకపోతున్నాను. నీవు కూడా అతని వలె వైభవోపే తుడైన తండ్రికి తగిన తనయుడవు అనిపించుకొనవద్దా!” అని ఈర్శ్యాసూ యలను నూరిపోసింది. దశ కంఠుడు తల్లి మాటలను విని, రోషగ్ర స్తుడై ”నేను అతనిని మించిపోగలను”చూడమన్నాడు.
దశకంఠుడు సోదరులతో కఠోర తపస్సు చేయాలనుకున్నా డు. తపశ్శక్తితో తాను కుబేరుని మించిపోవాలని దృఢంగా నిశ్చ యించుకున్నాడు. దశకంఠ కుంభకర్ణ విభీషణులు గోకర్ణం చేరుకు న్నారు. ముగ్గురూ జితేంద్రియులై, దృఢ వ్రత నియతులై ఏకాగ్ర చిత్తులై బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశారు. శూర్పణఖ వారికి సపర్యలు చేసింది. అన్నాడు అగస్య్తుడు.
– కె.ఓబులేశు, 9052847742

Advertisement

తాజా వార్తలు

Advertisement