అమరావతి, ఆంధ్రప్రభ: భారతీయ రైల్వే, ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో నడుపుతున్న రామాయణ సర్క్యూట్ తీర్థయాత్ర స్పెషల్ రైలుకు భద్రాచలం రైల్వే స్టేషన్‌లో హాల్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. కోవిడ్ పాండమిక్ తర్వాత పర్యాటకుల సందడి, తీర్థయాత్రలకు వెళ్లేవారి సంఖ్య పెరగడంతో రామాయణ సర్క్యూట్‌లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని అధికారులు తెలిపారు. అందులో భాగంగా శ్రీరాముడు నడయాడిన ముఖ్య ప్రాంతాల మీదుగా ఈ రైళ్లు నడుస్తున్నాయన్నారు. అందులో భాగంగా మొదటి రైలు ఈ నెల ఏడున న్యూఢిల్లిd నుంచి రామేశ్వరానికి నడుస్తోందని, ప్రయాణంలో శ్రీరాముడు సంచరించినట్లు చెప్పుకొనే ప్రాంతాల్లో ఆగుతుందని వివరించారు. గోదావరి నది ఒడ్డున వెలసిన భద్రాచలం క్షేత్రం శ్రీరాముడి జీవితంలో అనేక ముఖ్య ఘట్టాలకు నెలవైన నేపథ్యంలో తీర్థయాత్ర స్పెషల్ రైలుకు ఇక్కడ హాల్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement