Saturday, November 23, 2024

రామకార్య దురంధరా!

రామ రసాయన తుమ్హరే పాసా|
సదా రహో రఘుపతి కే దాసా||
శ్రీ రామ రసాయనమనే సత్య, ధర్మ, వీర, పరాక్రమాలు హనుమయందు ఉన్నయ్‌. ఇవన్నీ తన యందే ఉన్నా, హనుమ మాత్రం సర్వదా, సర్వథా శ్రీ రామునికి దాసుడిగానే ఉంటాడు. ఇదొక దివ్య లక్షణం.
బుద్ధి జలము, చాతుర్యము, మంచి కంఠస్వరము, తేజస్సు రామనామ జపం వలన కలుగుతయ్‌, సాధారణ మానవుడికి జీవన సాఫల్య సాధనలో ఇవన్నీ ఎంతో అవసరం.
సద్భుద్ధి, సదాచారం, కార్య నిర్వహణా చాతుర్యం, సుస్వర మాధురి, చక్కని వర్చస్సుతో మనిషి తన జీవితాన్ని ఆనందనం దనం చేసుకోగలుగుతాడు. తద్వారా తన చుట్టూ ఉన్న సమాజాన్ని సన్మార్గం వైపు నడిపించగల ధీశక్తిని సంపాదించుకుంటాడు.
రామ రసాయనం వల్లనే హనుమ, తన ప్రజ్ఞకు పదునుపెట్టి, స్వామి కార్యక్రమాన్ని నిర్దుష్టంగా, లోపరహితంగా నిర్వర్తించాడు. ఎంతటి విజయ పరంపరను అందుకున్నా, అంతా రామానుగ్రహం వల్లనే సాధ్యమైందని నమ్మి, రామ చంద్రుడికి బంటుగా, అనునూయిగా అన్నివేళలా ఉండాలని నిశ్చిత బుద్ధితో నిలకడ చెందాడు.
హనుమది జీవప్రజ్ఞ! రాముడిది దైవ ప్రజ్ఞ!!
ఈ ప్రజ్ఞల కలయికే లోక రక్షంకరియై, జగదానంద కారకమై, జగత్తును నడిపిస్తున్నది.
రామనామస్మరణ, హనుమదుపాసన ఒక బలీయశక్తి.!
జాతి, కుల, వర్గ, వర్ణాలకు అతీతంగా మానవీయంగా సాగించాల్సిన ఆధ్యాత్మిక సాధనా మార్గమిది!

– వి.యస్‌.ఆర్‌.మూర్తి
9440603499

Advertisement

తాజా వార్తలు

Advertisement