Saturday, November 23, 2024

రాజా అలంకరణలో సింహాద్రినాథుడు

మాడవీధుల్లో ఘనంగా తిరువీధి
విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో రాపత్‌ ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతీ ఏటా ముక్కోటి ఏకాదశి పర్వదినం నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్స వాలు ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతీరోజు సింహాద్రినాధుడిని ఒక్కొ అలంకరణలో అందంగా తీర్చి దిద్దుతున్నారు. ఈ నేపధ్యంలోనే బుధవారం తెల్లవారు జామున సింహాద్రినాధు డిని సుప్రభాతసేవతో మేల్కొలిపి ఆరాధన గావించారు. అనంతరం సర్వాభర ణాలుతో చూడముచ్చటగా రాజ అలంకరణ గావించారు. ఆ తరువాత వేద, దివ్య ప్రబంధ పారాయణల నడుమ మాడవీధుల్లో స్వామి తిరువీధి నిర్వహించారు. వేద మంత్రోశ్చరణలు, మృదుమధుర మంగళవాయి ద్యాల నడుమ సాగిన ఈ తిరువీధిలో ఆ సిరిలొలికిం చే సింహాద్రినాధుడిని పలువురు భక్తులు దర్శించుకొని తరించారు. అంతకు ముందు ఆలయ ఆస్థాన మండపంలో స్వామిని ఉభయ దేవేరులతో ఆశీనులను చేసి దివ్యప్రబంధపారా యణ విన్నపాలు గావించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌ పర్యవేక్షణలో ప్రధాన పురోహితుడు, అలంకార్‌ కరి సీతారామాచార్యులు, సాతులూరి సూర్యనారాయణచార్యులు, పవన్‌, అప్పాజీ తదితరులంతా ఉత్సవంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement