Wednesday, November 27, 2024

రాజశ్యామల అనుగ్రహంతో దేశరక్షణ

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: దేశ రక్షణ కోసం జగన్మాత రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం పొందాలని రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి సంస్థ( డీఆర్‌డీఓ) ఛైర్మన్‌ సతీష్‌రెడ్డికి విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి సూచించారు. పూర్వకాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళే ముందు రాజశ్యామల అమ్మవారికి పూజలు చేసి సత్ఫలితాలను సాధించేవారని స్వామీజీ వివరిం చారు. లోకాలను పాలించే రాజమాతంగిగా అమ్మవా రు పూజలందుకుంటు-న్నారని స్వామీజీ తెలిపారు. బుధవారం ఢిల్లీలో స్వాత్మానందేంద్ర స్వామి డీఆర్‌ డీఓ ఛైర్మన్‌ సతీష్‌ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ దేశంతో పాటు- దేశ ప్రజల రక్షణకు సైతం డీఆర్‌డీఓ కట్టు-బడి ఉందన్నారు. కరోనా విప త్తులో ఇమ్యూనిటీ- పెంచే 2-డీ పౌడరును తయారు చేసామని, దేశవ్యాప్తంగా వేయి(1000) ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలను అందుబాటు-లోకి తీసుకొస్తున్నా మని సతీష్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే పదివేల ఆక్సిజన్‌ పడకలను ఏర్పాటు- చేసి సేవలందించామని స్వామీ జీకి వివరించారు. తన హయాంలో రాడార్‌, క్షిపణి వ్యవస్థలను అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు- తెలిపా రు. రాజశ్యామల అనుగ్రహంతో మరింత పటిష్టంగా రక్షణ శాఖను తీర్చిదిద్దాలని ఛైర్మన్‌ సతీష్‌ రెడ్డికి స్వాత్మానందేంద్ర స్వామి ఆశీస్సులు అందించారు. జాతీయ ఎస్సీ కమీషన్‌ వైస్‌ ఛైర్మన్‌ అరుణ్‌ హల్దర్‌, రాజ్యసభ సభ్యులు సుధాంశు త్రివేదిలు బుధవారం ఢిల్లీలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మా నందేంద్ర సరస్వతీ స్వామిని కలిసి ఆశీస్సులు అందు
కున్నారు. పలు ధార్మిక అంశాలపై వీరు చర్చించారు. దళిత వాడలు, గిరిజనవాడల్లో ఆలయాల నిర్మాణం చేపట్టాలని వారికి స్వామీజీ సూచించారు. అలాగే దళిత గోవిందం, గిరిజన గోవిందం తరహా కార్యక్ర మాలను చేపట్టాలని విశాఖ శ్రీ శారదాపీఠం టీటీడీకి ప్రతిపాదించిందని స్వాత్మానందేంద్ర చెప్పారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి సూచిం చిన వెంటనే సర్వ దర్శనాన్ని టీ-టీ-డీ పున: ప్రారంభించిందన్నారు. భగవంతుడిని భక్తులకు చేరువ చేసే విషయంలో విశాఖ శ్రీ శారదాపీఠం నిరంతరం వారధిగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement