రాక్షసుల బెడద భరించలేక దేవతలు పరమ శివుని శరణు వేడారు. పరమ శివునికి సుకేషునిపై అభిమానం మెండు. అందువల్ల మాల్యవంతాదులను చంపడానికి అతని మనస్సు అంగీకరించలేదు. తన నిస్సహాయతను శివుడు దేవతలకు తెలిపాడు. ఇప్పుడు మిమ్మల్ని శోక సముద్రం నుండి ఉద్ధరింపగలవాడు మహా విష్ణువు ఒక్కడే. మీరు ఆ మహాత్ముని శర ణు కోరండి అని వారి కార్యం నెరవేరే దారి చూపించాడు శివుడు.
దేవతలు శ్రీమహా విష్ణువును ఆశ్రయించారు. తమ గోడు వెళ్ళబోసుకున్నారు. దీన బాంధవా, ఆర్తత్రాణ పరాయణా, నీవే మాకు దిక్కు. మాకు గత్యంతరం లేదు. మమ్మల్ని అనుగ్రహింపు ము. పరమ కర్కోటకులయిన రాక్షసుల నుండి మమ్ము కాపాడు మని మొరపెట్టుకున్నారు. విష్ణువు దయార్ధ్ర హృదయుడై వారి దీనాలాపాలను విని, అభయం ఇచ్చాడు.
దేవతలు నిశ్చింతులై తిరిగి తమతమ నెలవులకు వెళ్ళారు. మాల్యవంతుడు సోదరులతో కొడుకులతో సమావేశమయ్యాడు. వారికి ఇలా తెలిపాడు.
”దేవతల మొరను శివుడు తిరస్కరించాడట. వారిని విష్ణువు వద్దకు పంపాడట! విష్ణువు వారికి అభయం ఇచ్చాడట. మహా విష్ణువు చేతిలో వీరాధివీరులు, శత్రుభీకరులు, సింహ పరాక్రమ ములు, లోకైక వీరులు, ఉద్దండ చండ పరాక్రములు అయిన రాక్ష సులు అనేకులు చచ్చారు. ఓడారు. కానీ ఏనాడు విష్ణువు ఓడి పోలేదు. ముల్లోకాలను గడగడలాడించిన రాక్షస వీరులు విష్ణువు ను ఏమాత్రం చెనకలేకపోయారు. పూర్వపు అనుభవాలు ఇలా ఉన్నాయి. ఈ పరిస్థితులలో మన కర్తవ్యం ఏమి? ఆలోచించండి” అన్నాడు మాల్యవంతుడు.
సుమాలి, మాలి ఇద్దరూ- ”మనం అసహాయ శూరులం! వీరాధి వీరులం! వేద వేదాంగ పారంగతులం! ధనుర్విద్యా నిపు ణులం! యజ్ఞ యాగాలు, దానాలు చేశాం. విష్ణువుకు మనపై ప్రత్యే కంగా ఏ ద్వేషమూ లేదు. కేవలం దేవతలు శరణు కోరడం వల్లనే మనల్ని సాధించాలి అనుకొంటున్నాడు. అతడు మనపై దాడి చేయకముందే , మనం దేవతల నివాసాలను ముట్టడిస్తే మంచిది కదా! వారిని మట్టుపెడదాం” అని చెప్పి మాల్యవంతుని ప్రోత్స హించారు. రాక్షసులందరూ చతురంగబలాలతో సర్వాయుధ సంపన్ను లై దేవతలపై దాడి చేశారు. అపశకునాలు రాక్షసుల వినాశనాన్ని సూచించాయి. వారు చావు మూడిన వారై దుశ్శకు నాలను లెక్క చేయక రణరంగంలో అరవీర భయంకరంగా విజృం భించారు. దేవతలు రాక్షసుల పరాక్రమ ధాటికి నిలువలేక కాళ్ళకు బుద్ది చెప్పా రు. వేల కొలది సూర్య ప్రభా సమానుడై శ్రీ మహా విష్ణువు గరుడ వాహనుడై యుద్ధ రంగంలో ప్రత్యక్షమయ్యాడు.
పారిపోతున్న దేవతలు విష్ణువును చూసి ఉత్సాహ పూరితులై రాక్షసులను మార్కొన్నారు. దేవ దానవ సంగ్రామం భీకరం అయ్యింది. రాక్షసులు శ్రీ మహా విష్ణువును చుట్టుముట్టారు. విష్ణువు చండ్ర ప్రచండునుడై మిట్ట మధ్యాహ్నపు సూర్యుని వలె తీక్షణంగా ప్రకాశిస్తూ, రాక్షసులను ఊచకోత కోశాడు. రణ రంగం పీనుగుల పెంట అయ్యింది. యుద్ధ రంగ భయాన్ని, రోతను కలిగించాయి. నెత్తురు టేరు పారింది. నెత్తురు నదిలో ఏనుగులు, గుర్రాల శరీర భాగాలు, రాక్షసుల తలలు, మొండెములు తేలియాడుతున్నాయి. రాక్షసులు మహా విష్ణువును ఎదుర్కొనలేకపోయారు. వి ష్ణువు మాల్యవంతుని, సుమాలిని దారుణంగా దెబ్బ తీశాడు. మాలి అగ్నిజ్వాలను సమీపించే మిడుతవలె విష్ణువును సమీపించాడు. విష్ణువు ప్రళయకాల రుద్రమూర్తియై చక్రాన్ని ప్రయోగించి మాలి తల నరికాడు.
మాలిని యుద్ద రంగానికి బలి ఇవ్వగానే రాక్షసులు హతాశులై నిరుత్సాహులై నిర్వీర్యులై కాళ్ళకు బుద్ది చెప్పారు.
విష్ణువు వారిని వెంబడించారు. రాక్షసులను తరుముతున్న విష్ణువును చూసి మాల్యవంతుడు పారిపోతున్న వారిని వెంటాడ డం యుద్ధ ధర్మం కాదు నీవు చేవ ఉంటే , పౌరుషవంతుడైతే ఎదు రుగా ఉన్నాను కదా! నాతో పోరాడుము. పిరికి పందలపై పరాక్ర మం చూపడం వీర లక్షణమా! నీ పరాక్రమాన్ని నాపై ప్రదర్శిం పుము అని అధిక్షేపించాడు. విష్ణువు హుంకరించి నేనుదేవతలకు అభయం ఇచ్చాను. మీ అంతు చూడనిదే నేను విరమించను అం టూ, మాల్యవంతుడు తేరుకుని శూలాన్ని విష్ణువుపై ప్రయోగిం చాడు. మాల్యవంతుడు పిడికిలి బిగించి, విష్ణువును, గరుత్మం తుని దెబ్బతీశాడు. గరుత్మంతుడు కోపించి రెక్కలను గట్టిగా విదిలించాడు. ఆ గాలికి మాల్యవంతుడు కొట్టుకుపోయాడు. అన్న దురవస్తను చూసి సుమాలి భయపడిపారిపోయాడు. మాల్యవం తుడు సుమాలి భయపడి పారిపోయాడు. మాల్యవంతుడు, సుమాలి ఇద్దరూ రసతలానికి పారిపోవడం చూసి రాక్షసులంద రూ బ్రతుకు జీవుడా! అని పారిపోయి ప్రాణాలు నిలుపుకున్నారు.
రామా, శరణాగతవత్సలా! ఆర్త త్రాణ పరాయణా! దుష్ట శిక్షణ, శిష్ణ రక్షణ దక్షుడా ఇంత వరకూ రావణునికి పూర్వం లంకను పాలించిన రాక్షస వీరుల గాథను తెలిపాను. ఇక రావణ కుంభ కర్ణాది రాక్షస వంశ చరిత్రను తెలుపుతాను వినుము.
– కె.ఓబులేశు, 9052847742
రాక్షస వీరుల పలాయనం
Advertisement
తాజా వార్తలు
Advertisement