Saturday, November 23, 2024

యోగుల బ్రహ్మ లోక యాత్ర

అణువు నుండి అనంతము ఏర్పడినది. సమస్త లోకముల సృష్టికి మూలము ‘ఆత్మ’. ఆదిగానున్న పరబ్రహ్మ తన ఏక త్వము నుండి అనేకం కావాలని కాంక్షించింది. అద్వితీయమైన పర మాత్మ అనేక లోకాలను సృష్టించి జీవాత్మగా రూపొందింది. మర ణానంతరం లేక ప్రళయానంతరం జీవాత్మ పరమాత్మలో లయ మైపోతుంది. బ్రహ్మమే పరమాత్మ. అదే ఆత్మ.
ఆత్మ నుండి ప్రాణం జనించింది. ఆత్మ ప్రాణమనే విస్తరణలో ఉంది. ప్రాణం ఒక నీడలాంటిది. ప్రాణం స్థితి ఆత్మ మీద ఆధారపడి ఉంది. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన ఆత్మ నుండి అనేక రూపాలు, ఇంద్రియాలు. అంత:కరణ చతుష్టయము సర్వమూ సృజించబడ్డాయి. అవి తిరిగి ఆత్మలోనే లయమవుతున్నాయి. ఈ సత్యమును బ్రహ్మ సూత్రాల్లోని ఐదో సూత్రం విశదపరుస్తున్నది.
”ఈక్షతేర్నా శబ్దమ్‌”
ఈక్షతే:, న, అశబ్దమ్‌. చైతన్యమైన బ్రహ్మ వల్లనే సమస్త విశ్వ సృష్టి జరిగింది. ”ఈక్షణ” అను పదానికి కర్త జడమయిన ప్రకృతి కాదు. ఈ క్షణానికి కర్త చైతన్య బ్రహ్మము. బ్రహ్మము యొక్క చూపు నుండే ఆత్మ ఈ విశ్వరూపాన్ని సృష్టించింది. ఇంద్రియాలు, వివిధ రూపాల్లోనున్న అన్నమును సృష్టించింది. ఇంద్రియా లతో కూడిన మానవ ఉపాధిలో బ్రహ్మ రంధ్రము గుండా ఆత్మ ప్రవేశించింది. ఏకం అనేకమైనది. పంచత్వమును ఆపాదించుకుం ది. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుం డి జలము, జలము నుండి భూమి ఏర్పడినాయి. వాటి నుండి పర బ్రహ్మ స్వరూపమైన అన్నం జనించింది. అన్నం నుండి జీవాత్మ జనించిం ది. ఈ అద్భుత లీలను చైతన్యవంతమైన ఆత్మశక్తి ప్రాణంపై ఆధార పడిన ఇంద్రియాల ద్వారా వీక్షించనున్నట్లు భ్రమిస్తున్నది. నిజానికి నీలోని చైతన్యమున్నంత వరకు మాత్రమే జడమయిన సృష్టిని చూడగలవు. జీవాత్మ ఆత్మలో లీనమవగానే నీవీక్ష ణ ఒక కలగా ముగుస్తున్న భ్రమ మాత్రమే!!
చైతన్యవంతంగానున్న ఇంద్రియాలు ప్రకృతిలోనున్న గుణా లను అనుభవిస్తున్నట్లు భావించి అవియే శాశ్వతమని భ్రమిస్తున్నా యి.. నిజానికి గాఢమైన నిద్రలో ఇవి ఏవియూ లేవు. సుషుప్తి లో ఈ జగము ఒక కల్పన. మనం చూస్తున్నంత వరకు ఈ కల్పన ఒక శాశ్వత పదార్థము. కనులు మూసిన కల్పన మిథ్య. కావున ”బ్రహ్మ, సత్యం, జగం మిథ్య” అని శ్రీ శంకరులు చెప్పినది పరమ సత్యం.
మరి ”మిథ్య” అయిన జగత్తునందు ఈ సంసార బాధలెందు కు? అను ప్రశ్న ఉదయించుట సహజము. ఏకముగా ఉన్న ”ఆత్మ” అనేకమై ప్రాణములతో కలిసి త్రిగుణాత్మకమైన ప్రకృతిలో ఆడు కొనుచున్నది. ఆడించినంతవరకు ఆడుట తప్పదు. అయితే నిర్దే శించిన ఈ విశ్వక్రీడలో జన్మరాహిత్యానికి అవకాశంఇచ్చాడు. జీవా త్మకు ఆత్మశోధన, ఆత్మ సాక్షాత్కార సాధన, ఆత్మార్పణలను లక్ష్యం గా చేసుకుని పరమాత్మను చేరుటకు మార్గం చూపాడు. కాని దురదృష్టం,, ప్రారబ్దము ఆత్మ గురించి ఆలోచననే చేయ నివ్వదు.
గురువు చెప్పిన ”బహ్మ సత్యం, జగం మిథ్య”ను మననం చేసుకుంటూ ఒక శిష్యుడు మావటితో కలిసి ఎదురుగా వస్తున్న ఒక ఏనుగుకు దారినివ్వకుండా ”జగము మిథ్య కావున ఈ గజము కూడా మిథ్యయే!” అని భావించి, తనను ఏమియూ చేయలేదని తలచి ఏనుగుకు అడ్డు నిలిచాడు.
అంతట అది తొండముతో అతనిని పక్కకు విసిరి వేయగా గాయాలపాలై దాదాపు మృత్యువును దర్శించినాడు. గాయపడిన శిష్యుని సందర్శించిన గురువు ”అడ్డు తొలగమని పలుమార్లు హెచ్చరించిన మావటి రూపంలో నున్న బ్రహ్మను గుర్తించలేదా?” అని పలికి ”సత్యమయిన బ్రహ్మ హెచ్చరికను మిథ్యగా భావించ వలదు” అని గురువు శిష్యునకు జ్ఞానోపదేశం చేసినాడు. కావున జీవన నాటక రంగమున బ్రహ్మ నిర్దేశించిన శ్రేయో పథమున నడవవలెను తప్ప అజ్ఞానముతో ప్రవర్తించిన ”బ్రహ్మ” శిక్షించక మానడు. సదా జ్ఞానముతో ”పరమాత్మ”ను ధ్యానిస్తూ ఈ జీవ నౌకను మహా సంద్రమును దాటించి ముక్తిని పొందవలెనని మన సనాతము హెచ్చరిస్తున్నది. పంచ భూతములు ఏవిధంగా ఒక దాని నుండి ఒకటి ఉత్పత్తి అయినట్లే తిరిగి ఒక దానినొకటి లయ మగుచున్నవి. ఈ విషయాన్ని బ్రహ్మ సూత్రాల్లోని విపర్వ యాది కరణము విశదీకరించినది.
విపర్యయేణ తుక్ర మోడిత ఉపపద్యతేచ
విపర్య యేణ, తు, క్రమ:, అత:, చ, ఉపపద్యతే భూమి జలమునందు, జలము అగ్నియందు, అగ్ని వాయువునందు, వాయువు ఆకాశమందు, ఆకాశం పరబ్రహ్మ యందు, లీనమై పోతుంది. ఇది విపర్యముగా జరుగుట గమనించవచ్చును.
మరు జన్మ లేకుండా మోక్షమునకు అర్హులైనవారు అర్చిరాది మార్గము గుండా బ్రహ్మ లోకానికి చేరుతారని బ్రహ్మ సూత్రము లలోని అర్చిరాధ్యధికరణము తెలియజేసింది. బ్రహ్మ లోకమే అంతిమ గమ్యం. మోక్షార్హులకు సృష్టి, లయములతో పనిలేదు.
అర్చిరాదినా తత్ప్రధితే:
అర్చిరాదినా, తత్పధితే, మానవులు మరణించిన తరువాత అర్చిరాది మార్గము గుండా జీవాత్మలు బ్రహ్మలోకాన్ని చేరతాయి. అయితే దానికి యోగ్యత అత్యంత అవశ్యము. అది మానవులు చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది.
ఫలాపేక్ష రహిత కర్మలనాచరించిన వారు. ఆత్మానుభవం పొందిన యోగులు వెలుగుబాటలో ప్రయాణం చేస్తారు. జ్యోతి రూపములో దేవయానము చేస్తారు. పునర్జన్మ రహితంగా ఆనంద రూపములో బ్రహ్మ లోకమున స్థిరపడిపోతారు. సత్యమునకు వీరంతా ఉపాసకులై ఉంటారు. బ్రహ్మ స్వయం ప్రకాశకుడు.
నక్షత్ర మండలముల ప్రకాశము కన్నా బ్రహ్మ లోక ప్రకాశము ప్రత్యేకమైనది. అది వర్ణించ వీలు కానిది. శ్రీ భగవద్గీత ధ్యాన యోగమున శ్రీ కృష్ణ భగవానుడు నుడి విన విధమున
ప్రయత్నాద్యత మానస్తు యోగీ సంశుద్ధ కిల్బిష:
అనేక జన్మ సంసిద్ధ: తతోయాంతి పరాంగతిమ్‌
జన్మ జన్మాంతరముల తీవ్ర సాధన చేయు యోగి తుదకు తన ప్రయత్నము వలన దోష రహితుడై యోగ సిద్దిని పొందును. ఇక అదియే చివరి జన్మగా బ్రహ్మ లోకమున పరమ పదవిని అధి ష్టించును. ఏ జన్మకైనా ఆ యోగ్యత సాధించుటకు సాధన చేయు వారు యోగులు.
ఈ కలియుగమున భగవన్నామ కీర్తనలో సాధన చేసి జన్మరా హిత్యమునకు దగ్గర కావచ్చునని గ్రహించుట వివేకవంతుల లక్షణము.
– వారణాశి వెంకట
సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement