హైదరాబాద్, ఆంధ్రప్రభ: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించేందుకు వాహనాల్లో వచ్చే భక్తుల పార్కింగ్ ఫీజు నిబంధనల్లో దేవస్థానం అధికారులు మార్పులు చేశారు. పార్కింగ్‌కు వచ్చే వాహనాల నుంచి మొదట రూ.500 వసూలు చేసి ఆ తర్వాత ప్రతి గంటకు రూ.100 తీసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే అదనపు గంటగా నిర్ణయించిన రూ.100 రుసుమును రద్దు చేస్తున్నట్టు దేవస్థానం అధికారులు ప్రకటించారు. యాదాద్రి కొండపైకి వచ్చే నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్ ఫీజు యధాతథంగా రూ.500 వసూలు చేయాలని నిర్ణయించారు. యాదాద్రి కొండపైకి వచ్చే వాహనాల నుంచి పార్కింగ్ రుసుమును వసూలు చేయాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. మే 1 నుంచి ఈ కొత్త ఫీజులు అమల్లోకి వచ్చాయి. ప్రతి గంటకు రూ.100 పార్కింగ్ ఫీజును వసూలు చేయాలన్న నిర్ణయంపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో దేవస్థానం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement