ఒకరోజు యశోద ఇంటి ముంగిట పిల్లలందరు ఆడుకుంటున్నారు. యశోద ఇంటి పనులలో వుంది. ఇంత లో బలరాముడు యశోద వద్దకు వచ్చి”అమ్మా అమ్మా కృష్ణుడు గుప్పెడు మన్ను తింటున్నా డు” అన్నాడు.. కృష్ణుడు ”నేను మన్ను తిన లేదు” అన్నాడు. యశోద కృష్ణుని ” ఏదీ నీ నోరు చూపించు” అంది. పరమ దైవమైన నారాయ ణుడు మానవ శ్రేయస్సుకై నర రూపము దాల్చి కృష్ణుడు శుద్ద సత్యమైన పరమాత్మను నాలుగు వేద రీతిలలో యజ్ఞ యాగాదులు చేసేవారు ఇంద్రుడని ఉపనిషత్తులు (వేదాంత శాస్త్రము) బ్రహ్మమని యోగులు పరమాత్మ అని పిలుస్తా రు. ఆ పరమాత్మయే యశోద కుమారుడు.
తల్లి చూడటానికి తన నోరు విప్పాడు. యశోద పుత్రుడు నోరు విప్పగానే లోపల కనిపించిన దృశ్యాలను చూసి దిగ్బ్రాంతి చెందిం ది. ఆ బాలుని నోటి లోపల యశోద ఈ లోకము అంతా చూసింది.
బుల్లికృష్ణుని నోటిలో చరా చరములన్ని వున్నాయి. ఆమె స్వర్గ లోకాన్ని, అష్టదిక్కులు, పర్వతాలు, ద్వీపాలు, సప్త సముద్రాలను చూసింది. వాయుదేవుడు, దేవతలకు నివాస మైన స్వర్గాన్ని, చంద్రుని, నక్షత్రాలను, పంచ భూతాలను చూసింది. ఆమె మనస్సును, మహత్వత్వమును, తన్మాత్రలను, సత్య రాజ స్తమో గుణాలు చూసింది. ప్రకృతి యందు త్రిగుణముల సమత్వమెట్లుండునో ఆమె కను లారా చూసింది.
పరమాత్మ జీవాత్మ కలిసి ఉన్నప్పుడు త్రిగుణముల సమత్వము చెదరక ఉంటుంది. జీవాత్మ ఉపాధులతో చేరి పరమాత్మకు దూర మైనప్పుడు, త్రిగుణముల సమత్వము తప్పు తుంది. కాల ప్రభావము చేత ఇలా జరుగు తుంది. కాలము సమీపించినప్పుడు జీవాత్మ స్వభావము చేత ఆత్మ భౌతిక ప్రపంచంతో అను బంధ ఏర్పరచుకుంటుంది. విశ్వం ఆవిర్భవించ టానికి త్రిగుణముల సమత్వము తప్పుటయే కారణము.
యశోద దానిని అంతా చూసింది. అంతే కాదు, ఆమె గోకులాన్ని, అందు తాను. ఇలా మన్ను తిన్న కుమారుని దండించడానికి నోరు తెరవమన్న యశోద కుమారుని నోట్లో అద్భుత దృశ్యాన్ని తిలకించింది. ఆమె తన చుట్టూ పరి కించి చూచి, ఎవరూ లేరని తనలో తానిట్లను కుంది. ”ఇది స్వప్నము కాదు. నేను మేలుకుని యున్నాను. ఇది తప్పక నారాయణుని మాయ అయి ఉండవచ్చు. అట్లయినచో ప్రతి ఒక్కరూ దీనిని చూచి యుండవచ్చును. ఇది అద్దములో కనుపించు ప్రతిబింబము వంటి ప్రతి బింబ మా? కాని ఈ దృశ్యమున నా పుత్రుడు కృష్ణుడు కూడ నాకు ఎలా కనిపిస్తున్నాడు?” అని ఆశ్చ ర్యంలో మునిగిపోయింది యశోద.
ఇంకా ఆమె ఇలా అనుకుంది. ”మనో వాక్కాయ కర్మలకు అతీతమైన స్థితి మహా గొప్పది. అదే ఈ లోకానికి ఆధారము. మూల ము, ఆ స్థితియే ఈ లోకము. అన్నిలోకములు చైతన్యవంతమై ప్రకాశించుటకు కారణమవు తున్నాయి. అదే జీవుల చైతన్యానికి కార్య కారణ ములకు మూలము. ఈ లోక మావిర్భవించు టకు అదూ మూల కారణం దానికి నా వందనా లు. భగవంతుడు తన మాయ చేత నా కొక వ్యక్తిత్వము కల్పించి నేను యశోదను నా కొక భర్త నందుడు, ఇతడు నా కుమారుడు, గోకుల మునకు నేను రాణిని గోకులములోని ప్రజలకు ఆప్తురాలను అని భావించినట్లుగా చేస్తున్నాడు.
నన్ను కమ్మిన మాయ నాకిప్పుడు స్పష్టముగా గోచరించుచున్నది. ఈ మాయకు కారకుడైన భగవంతునికి నా నమస్కారము”
ఈ స్థితిలో ఉన్న తల్లిని జూచి కృష్ణుడు తన విష్ణు మాయచేత ఆమెలో పుత్ర వాత్సల్యము తిరిగి రేకెత్తించగా యశోద వెంటనే ఇంత వరకు పొందిన అనుభవం, ఆడిన మాటలు, బ్రహ్మ ము గురించి తెలుసుకున్న సత్యము, అన్నిటిని మరచిపోయింది.
మైకము నుండి తెలివి వచ్చినట్లు లేచి తిరిగి ఈ మాయా ప్రపంచములో పడెను. ఇదం తా ఒక స్వప్నంలా భావించి మరచిపోయింది.
యశోదానందులు యెంత పుణ్యాత్ములో గదా! పరమాత్మకు తల్లిదండ్రులు కాగల మహా భాగ్యము వారికి లభించింది. సాక్షాత్తు శ్రీ మన్నారాయణునకు పాలిచ్చే భాగ్యం పొందిన యశోద యెంతటి అదృష్టవంతురాలు!
– కోసూరు హయగ్రీవరావు
9949514583