Saturday, November 23, 2024

మేఘనాదుడు వరాలు పొందుట

రావణుడు ”మేఘనాదుడెక్కడ?” అని విచారించాడు. ”అతడు నికుంభిలావనంలో యాగదీక్షితుడై యజ్ఞాలు నిర్వహిస్తున్నాడు ” అని తెలిపారు. రావణుడు నికుంభిలావనంలో ప్రవేశించాడు ”ఇదేమీ? మన శత్రువులైన దేవతలను ఆహ్వానిస్తూ యజ్ఞాలు చేస్తున్నావేమి? నాకు ఏ మాత్రం నచ్చలేదు” అన్నాడు. శుక్రాచార్యుడు, ”రాజా! నీ కొడుకు అనితర సాధ్యాలైన యజ్ఞా లు ఏడింటిని సంకల్పించాడు. అగ్నిష్టోమం, అశ్వమేధం, బహు సువర్ణకం, రాజ సూయం, గోమేధం, వైష్ణవం అనే యజ్ఞాలను నిర్వి ఘ్నంగా సుసంపన్నం చేశాడు. అపూర్వమైన మహేశ్వర యజ్ఞాన్ని పూర్తి చేశాడు. శివుని అనుగ్రహంతో మేఘనాదుడు అపూర్వమైన వరాలను పొందాడు. తన ఇచ్చ వచ్చినట్లు ప్రయాణింపగల విమా నాన్ని సాధించాడు. ”తామసి” అనే మాయా విద్యను పొందాడు. దాని ప్రభావంతో దేవ దానవాదులు ఎవ్వరి కంటపడకుండా యుద్ధం చేయగలడు. మాయా యుద్ధ విశారదుడయ్యాడు. అక్షయ తూణీరాలు, అక్షయమైన ధనస్సు శత్రు విధ్వంస కారిణి అయిన దివ్యాస్త్రాన్ని సంపాదించాడు. నీ రాక కోసం ఎదురుచూస్తున్నాడు. యజ్ఞ నిర్వహణ ద్వారా ఇంద్రాది దేవతలను పూజించాడు అనే విషయం మరచిపో! పొందిన లాభాలను చూసి మురిసిపో” అన్నా డు. రావణుడు కొడుకును కౌగిలించుకుని మనసారా అభినందిం చాడు. సగౌరవంగా ఇంటికి కొని వచ్చాడు. రావణుడు తాను చెరపట్టిన స్త్రీలను పుష్పకం నుండి దింపిం చాడు. ఆ దుష్కృత్యాన్ని చూసి విభీషణుడు ఏవగించుకున్నాడు. అతని కాముకత్వాన్ని పరస్త్రీ వ్యామోహాన్ని దూషించాడు. ”నీవే మో పరస్త్రీలను చెరపట్టి తెచ్చావు. ఇక్కడేమో మధుడు మన చెల్లెలు కుంభీనసిని అపహరించుకునిపోయాడు. నేను నీటిలో ఉండి తప స్సు చేస్తున్నాను. మేఘనాదుడు యాగదీక్షితుడై ఉన్నాడు. ఆ సమ యంలో మధుడు కుంభీనసిని అపహరించాడు. నీవు పరదారాపహ రణకు పాల్పడ్డావు. ఆ పాప కృత్యం ఫలితంగా మన చెల్లెల్ని ఆ దుర్మార్గుడు అపహరించాడు” అన్నాడు విభీషణుడు. రావణుడు మధుని తెంపరితనానికి, విభీషణుని వక్రపు మాట లకు రోష పూరితుడయ్యాడు. వెంటనే సేనా సమేతుడై మధుపురం పై దాడి చేశాడు. కుంభీనపి వచ్చి రావణుని పాదాలపై పడి ”అన్నా, జరగాల్సిన తతంగమంతా జరిగిపోయింది. ఇప్పుడు మధుడు నా భర్త. అతనిని చంపి నన్ను విధవను చేయవద్దు. పతిభిక్ష పెట్టు” మని ప్రాధేయపడింది. రావణుడు శాంతించాడు. సోదరి విన్నపాన్ని మన్నించి మధుని క్షమించాడు. కుంభీనపి, నిద్రిస్తున్న భర్తను మేల్కొలిపింది. ”మా అన్న నా ప్రార్థన మన్నించి నిన్ను క్షమిం చాడు. మా అన్న స్వర్గలోకంపై దాడి చేయబోతున్నాడు. నీవు నీ బలంతో యధాశక్తి సాయం చేసి, అతనిని ప్రసన్నం చేసుకొమ్మని సల హా ఇచ్చింది. కుంభీనపి వర్తనానికి మధుడు సంతోషించాడు. రావ ణుడు మధుని ఇంట ఒక రాత్రి గడిపాడు. మరుసటి రోజు చతురంగ బల సమేతుడై కుబే రుని నివాసమైన కైలాసగిరిని చేరి, విడిది చేశాడు.
నల కూబరుని శాపం
రావణుని సేన అలసిపోయి ఆదమరచి నిద్రపోయింది. వెన్నెల రాత్రి కైలాసగిరి అందాలను తిలకిస్తూ రావణుడు హాయిగా విహరి స్తున్నాడు. వెన్నెల చల్లదనం, మెల్లని పిల్లగాలులు, ఆ గాలులు మోసుకొస్తున్న పూల సువాసనల గుబాళింపులు, ఆహ్లాదకరమైన వాతావరణం అతనిలో కాముకత్వాన్ని ప్రకోపింప జేసింది. కామో ద్రేక పరవశుడైన రావణుడు, సర్వాలంకార భూషితురాలై అభిసారి కయై పోతున్న రంభను చూశాడు. రంభ తన భర్త నలకూబరునితో రతిక్రీడాసక్తితో తల నిండా పైట కప్పుకుని, రావణసేన మధ్య నుండి ఒదిగిఒదిగి నడుస్తూ సాగిపోతున్నది.
అప్సరో శిరోమణి అయిన రంభ సౌందర్యాన్ని చూసి రావణు డు తమకంతో మెల్లగా వెళ్ళి ఆమె చేయి పట్టుకున్నాడు. కామ భావనచే ప్రేరితుడై నవ్వి, అందాల రాశి! రసికజన హృదయ మనో హరంగా అలంకరించుకుని ఎక్కడికి పోతున్నావు? నీ సర్వాంగ సౌందర్యం నా మదిలో ఆశను రేపుతుంది. నీ అందాన్ని జుర్రుకోవా లని నా మనస్సు తహతహలాడుతున్నది. నిరుపమాన సుందరాం గుడను, ఐశ్వర్య సంపన్నుడైన నన్ను కాదని ఎవని వద్దకు వెళ తావు? నన్ను సుఖ పెట్టమని చేతులు జోడించి వేడుకొన్నాడు.
రంభ గజగజ వణికిపోతూ ”కోరకూడని దానిని కోరుతున్నా వు. కాముకుడవై వావి వరసలను కాలదన్నడంఉచిత కార్యమా? నేను నీకు కోడలిని కదా! నన్ను నీవు కోరదగునా? అని అతని కామ పారవ శ్యానికి అడ్డుకట్ట వేయడానికి సవినయంగా ప్రయత్నించిం ది. రావణుడు పకపక నవ్వి ”ఇదెక్కడి వరుస? నువ్వు నా కొడుకు భార్య వా ఏమి?” అని అడిగాడు రావణుడు. ”నేను నీ సోదరుడు కుబేరుని కొడుకు నలకూబరుని భార్య రంభను. కుబేరుడూ నీవు విశ్రవసుని కొడుకులే కదా! సోదరుని కొడుకు కొడుకే కదా! మరి కొడుకు భార్య కోడలు కాదా?” అని నచ్చచెప్పాలని ప్రయత్నించింది. రంభ నలకూ బరుని పరాక్రమాన్ని, అతని క్రోధావేశ పరత్వా న్ని తెలిపి రావణుని హెచ్చరించింది. రక్షించాల్సిన నీవే అనుచితంగా ప్రవర్తించడం ఉచితంకాదని, నీతిని ధర్మాన్ని ఏకరువు పెట్టింది. కామంతో గ్రుడ్డి వాడై జ్ఞానం నశించి, బలత్కారంగా కోరికను తీర్చుకున్నాడు. రాక్షసుని చర్యకు నలిగిపోయి దీనమూర్తియై, తత్తరపడుతూ వెళ్ళి రంభ నలకూబరుని పాదాలపై వాలిపోయింది. ఇదేమి? అని ఆశ్చర్యపోయిన భర్తకు, రావణుడు చేసిన అత్యాచారాన్ని గూర్చి తెలిపింది. నలకూబరుడు కోపోద్రిక్తుడయ్యాడు. ”నీ ఇష్టాఇష్టాలను లెక్కచేయకుండా అత్యాచారం చేసి, రావణుడు అధర్మ వర్తనుడ య్యాడు. ఇకమీద తిరస్కరించిన స్త్రీపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తే అతని తల ఏడు వక్కలవుతుంది” అని నలకూబరుడు శపించాడు. రావణుడు చెరపట్టిన స్త్రీలకు, నలకూబరుని శాపం వరమైంది. వారందరూ నల కూబరుని మనస్సులోనే కృతజ్ఞత తెలిపారు. వారు అత్యంత ఆనంద భరితులయ్యారు.

– కె.ఓబులేశు
9052847742

Advertisement

తాజా వార్తలు

Advertisement