ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు
రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలు
చినజీయర్ స్వామి వెల్లడి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : వెయ్యేళ్ల క్రితమే సమతా-సమానతా సిద్ధాంతాన్ని శ్రీ రామానుజాచార్యులు భూమిపై విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేశారని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి చెప్పారు. సృష్టిలోని ప్రతీ జీవి భగవంతుడి సంతానమేనని రామానుజులు ఆనాడే ప్రకటించారని గుర్తు చేశారు. ముఖ్యంగా మనుషులను.. ఎక్కు వ-తక్కువ అన్న భావంతో చూడొద్దని గట్టిగా చెప్పారని తెలిపారు. సమాజంలో అందరూ సమానమేనని, ప్రతీ ఒక్కరికీ తగిన గౌరవంతో జీవించే అధికారం, హక్కు ఉందన్న విషయాన్ని ప్రపంచ చరిత్రలోనే మొదటిసారిగా రామానుజాచార్యులు చెప్పారని కొనియాడారు. ఫిబ్ర వరి 2 నుంచి 14 వరకు రామానుజచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలను శంషాబా ద్లోని ముచ్చింతల్ ఆశ్రమంలో నిర్వహించనున్నట్లు చిన్న జీయర్ స్వామి ప్రకటించారు. ఈ విషయమై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 5న ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ విగ్రహాన్ని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సమాజంలో సమానత కోసం శ్రీ రామానుజాచార్యులు చేసిన కృషిని వివరిస్తూ… సమాజంలో ఉండే ప్రజల జీవన విధానాన్ని గమనించి… ఆ రోజున సమాజంలోని మానవుల మధ్య ఉన్న అడ్డుగోడలను తొలగించేందుకు మాటలతో కాకుండా తన చేతలతో చేసి చూపించి నిరూపించిన ఆచార్యులు రామానుజాచార్యులు అని కొనియాడారు. సమాజంలో ప్రభువులు, పరిపాలకులు, విద్యావంతులు, సామా న్యులు అని నాలుగు వర్గాల వారు ఉంటారని, వీరిలో ఒకరు చెప్పింది మరొకరికి గిట్టదని, అయితే ఆనాడే రామా నుజాచార్యులు బోధించిన సమతా సిద్ధాంతాన్ని అన్ని వర్గాల వారు అంగీకరిం చారని గుర్తు చేశారు. రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నుంచి తమ ఆశ్రమంలో చాతుర్మాస దీక్ష ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు సమతామూర్తి పేరిట భగవత్ శ్రీరామానుజార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. రామానుజాచార్యలు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తా రన్నారు. ” 1017లో జన్మించిన రామానుజాచార్యులు 121 ఏళ్లపాటు భూమిపై జీవించారని తెలిపారు. చిన్న వయసులోనే ఆయనలో అద్భుత ప్రతిభాపాటవాలు ఉండేవన్నారు. తన 40వ ఏట సన్యాశ్రమాన్ని స్వీకరించిన రామానుజాచార్యులు … భారత ఉపఖండంలో దక్షిణాగ్రం నుంచి కశ్మీర్ వరకు తూర్పున నేపాల్ వరకు సంచరించారని చెప్పారు. రామానుజాచార్యులు కేవలం పండితులే కాదని, అద్భు తమైన ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. అదేవిధంగా… గోవధ, గోవుల అక్రమరవా ణాను నిరోధించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతీ ఒక్కరిపై ఉందని చిన జీయర్ స్వామి అన్నారు. చినజీయర్ స్వామి సహకారంతో గోవధ, గో అక్రమ రవాణాను అరి కట్టేందుకు ధ్యాన్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది.
ముచ్చింతల్లో ఫిబ్రవరి 5న ‘సమతామూర్తి’ విగ్రహావిష్కరణ
Advertisement
తాజా వార్తలు
Advertisement