Friday, November 22, 2024

మార్గమధ్యలోని ఆటంకాలు (ఆడియోతో…)

ఆటంకాలు అనివార్యము, కావున కలత చెందకు. ఏ విధమైన చింత అయినా నీలోని శక్తిని హరింపచేస్తుంది.
ఎప్పుడూ పరిస్థితిని కఠినమైనదిగా చూడకు, ఎప్పుడూ ”ఇది ఎందుకు జరిగింది” అని ప్రశ్నించకు. ఎప్పుడూ నీవు ఒంటరివాడివని భావించకు.
గుర్తుంచుకో- భగవంతుడు ఎల్లప్పుడూ నీయందు ఉన్నారు, భగవంతుడు నీకు ఆధారాన్ని ఇస్తున్నారు మౌనంలో ఉండేందుకు సమయాన్ని కేటాయించు, మౌనం కలవరాన్ని సమాప్తం చేస్తుంది. నీ శక్తి తిరిగి సంతరిస్తుంది. నీవు చేసిన పొరపాట్ల కారణంగా నీవు ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవలసి వస్తుంది. నీవు చేసిన పొరపాటు కారణంగా నీవు ఇతరులకు ఆటంకంగా నిలవకు.

-బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement