ఇంద్రజిత్తు మాయను పన్ని, మాయమాటు-న లంక చేరుకొన్నాడు. వెంటనే అతనికి ఒక దురాలోచన కలిగింది. మాయాసీతను సృష్టించాడు. మాయా సీతను రథమునందు ఉంచుకొని యుద్ధరం గానికి వచ్చాడు. శత్రువులను భ్రమలో ముంచతలచు కొన్నాడు. వారి ముందు మాయాసీతను చంపాలను కొన్నాడు. అతని పాచిక పారింది. హనుమంతుడు ఇంద్రజిత్తు రథమునందు ఉన్న సీతను చూశాడు. దిగ్రాంతి చెందాడు. ఇంద్రజిత్తు ఒరనుండి ఖడ్గాన్ని సర్రున లాగాడు. మాయాసీత జుట్టు- పట్టు-కొన్నాడు. ఆమెను చిత్రహింస పెట్టాడు. మాయాసీత దురవస్థను చూసి నిజమని భ్రమించి, హనుమంతుడు అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ఇంద్రజిత్తును చూసి, ”ఇంతటి నీచకార్యం చేయడానికి నీకు సిగ్గులేదా?” అని అధిక్షేపించాడు.
వానరులందరు చూస్తుండగా ఇంద్రజిత్తు ఖడ్గాన్ని ఝళిపించి, ఒక్క వేటు-తో మాయాసీత తల నరికాడు. హనుమంతుని చూసి, ”మీ రాముని భార్యను నరికాను. నీ ప్రయత్నం వ్యర్థమయింది” అని పలికి పగలబడి నవ్వాడు. వానరులు దీనాతి దీనులై తిరిగి వెళ్ళిపోయారు. హనుమంతుడు రాముని వద్దకు పోవడం గమనించి ఇంద్రజిత్తు యజ్ఞం చేయతలచి, నికుంభిలా చైత్యానికి వెళ్ళాడు.
హనుమంతుడు కన్నీరు విడుస్తూ రాముని వద్దకు చేరాడు. ”రామా! నేను చూస్తుండగా ఇంద్ర జిత్తు సీత తల నరికాడు’ అని తెలిపి ఏడ్చాడు. రాముడు ఏడుస్తూ లక్ష్మణుని ఒడిలో ఒరిగి పోయాడు. విభీషణుడు వచ్చాడు. మూగబోయిన వానరులను, వారి దీనముఖాలను, భయంకరమైన నిశ్శబ్దాన్ని చూసి, ఇదేమి? అని అడిగాడు. ”ఇంద్రజిత్తు సీత తల నరకడం హనుమంతుడు చూసి వచ్చాడు” అని లక్ష్మణుడు చెప్పాడు. విభీష ణుడు రామలక్ష్మణులను చూసి, ”ఇది ఇంద్రజిత్తు ప్రయోగించిన మాయ మాత్రమే! ఇది యథార్థం కాదు. రావణుడు ప్రాణాలతో ఉండగా సీతను వదలుకొనడు. ఇక సీతను చంపనిస్తాడా? సీతను రావణుడు తప్ప మరెవ్వరూ మాయోపాయం చేత కూడా కన్నెత్తి చూడలేరు. ఇంద్రజిత్త్తు అందరిని భ్రమలో ముంచి అభిచారహోమం చేయతలచి, నికుంభిలా చైత్యం చేరుకొన్నాడు” అన్నాడు.
అభిచార హోమం భగ్నం
అంతేకాదు ”ఇంద్ర జిత్తు నికుంభిలా చైత్యంలో అభిచార హోమం ఆరంభిం చాడు. యజ్ఞం పరి సమాప్తమయితే అతడు అజేయుడవుతాడు. అతడు పూర్వం బ్రహ్మను గురించి తనస్సు చేసి బ్రహ్మ శిరం అనే ది వ్యాస్త్రాన్ని, దివ్య రథాన్ని పొందాడు. తన్ను అజేయుని చేయమని వరం కోరాడు. బ్ర హ్మ ఒక పరతు విధించాడు. నీవు నికుంభిలా చైత్యమందు హోమం చేయ గలిగితే అజేయుడవే! పూర్తి చేయ డానికి మునుపే నిన్ను చంప దలచిన వాడు అక్కడికి చేరితే, అతని చేతిలో నీవు మరణిస్తావు అని బ్రహ్మ వాక్కు. కాబట్టి త్వరపడుము. ఇంద్ర జిత్తును చంప డానికి లక్ష్మణుని ఆజ్ఞాపింపుము” అన్నాడు విభీషణుడు.
ల క్ష్మణుడు రామాజ్ఞను తలదాల్చి ధనుర్ధారియై నడిచాడు. విభీషణుడు, అతడి మంత్రులు, హను మంతుడు, జాంబ వంతుడు, మున్నగు వానర శ్రేష్ఠులు అతనిని అనుసరించారు. వారు నికుంభిలా చైత్యం సమీపించారు. అపారమైన రాక్షస సేనా వాహిని కనిపించింది. ”ల క్ష్మణా! ఈ సేనావాహినికి ఆవలివైపు ఇంద్రజిత్తు అభిచార హోమం చేసు ్తన్నాడు. ఈ సైన్యాన్ని చంపితే తప్ప శత్రువు మనకు కనిపించడు. ఇంద్రజిత్తు తన్ను శత్రువు చేరకుండ అపారమైన సైన్యాన్ని వ్యూహాత్మకంగా అడ్డు నిలిపాడు. వెంటనే ఈ సైనిక వ్యూహం చెల్లాచెదరు కావాలి, లేదా చావాలి. ఇంద్రజిత్తు నీ కంటపడాలి. నీ కంట పడితే అతనికి చావు మూడినట్లే!” అని విభీషణుడు కర్తవ్యాన్ని గుర్తు చేశాడు.
లక్ష్మణుడు ధనుష్టంకారం కావించి, శరవర్షాన్ని కురిపించాడు. వానరులు రాక్షస సేనపై దాడి చేశారు. హనుమంతుడు ప్రళయకాల రుద్రుడై రాక్షస సంహారం చేశాడు. తన వ్యూహం విఫలమైందని ఇంద్రజిత్తు మండిపడ్డాడు. దివ్య రథారూఢుడై యుద్ధ రంగంలో ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రజిత్త్తు హనుమంతుని వైపునకు రథం నడిపించాడు. ఇంద్రజిత్తును వెంటనే చంపుమని విభీషణుడు లక్ష్మణుని తొందరపెట్టాడు.
విభీషణుడు నికుంభిల అనే పేరుగల మర్రిచెట్టును లక్ష్మణునికి చూపాడు. ఇంద్రజిత్తు అభిచార హోమాన్ని అక్కడే నిర్వహిస్తున్నాడు. ”ఇంద్రజిత్తు మరల ఆ చెట్టును చేరకముందే సారథిని, రథాశ్వాలను, రథాన్ని ధ్వంసం చేసి అతనిని వధించాలి” అన్నాడు. లక్ష్మణుడు గొంతెత్తి ఇంద్రజిత్తును యుద్ధానికి ఆహ్వానించాడు. లక్ష్మణు ని పురికొల్పుతున్న విభీషణుణ్ణి చూసి నీవు ఇంటి గుట్టు రట్టు చేశావు. రాక్షసజాతి చేటుకు కారణ మయ్యావు.
”నీవు పౌలస్త్య వంశంలో పుట్టినవాడవే కదా! నీ అన్న కొడుకు మర్మాన్ని శత్రువుకు తెలిపి రాజ ద్రోహానికి, జాతి ద్రోహానికి పాల్పడ్డావు. నీకు సిగ్గులేదా? ల క్ష్మణుని ఈ మర్రి చెట్ట్టు వద్దకు కొనిరావడాన్ని బట్టి నీ ద్రోహ బుద్ధి తెలుస్తున్నది” అని ఇంద్రజిత్తు దూషించాడు.
దానికి విభీషణుడు బదులిచ్చాడు ”నేను రాక్షస కులంలో పట్టాను నిజమే. కాని నాది రాక్షస స్వభావం కాదు. నేను సాధుస్వభావుడను. పరదారాపహరణ తగదని, సీతను రామునికి అప్పగింపుమని నీ తండ్రికి హిత బోధ చేశాను. నా ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అయింది. నా హితవు వినలేదు సరికదా నీ తండ్రీ, నీవూ నోటికి వచ్చినట్లు దూషించారు. నన్ను రాజ్యం నుంచి వెళ్లగొట్టారు. హితవు చెప్పిన తమ్ముని వెళ్లగొట్ట్టడం ధర్మమా? ఇప్పుడు నీవు నాకు బుద్ధులు చెబు తున్నావా? ఈ నీతి వాక్యాలు ఆ రోజు నీ నోట రాలేదేమి? చావు ముంచుకుని వచ్చిందని, పిన తండ్రి అని వరుస కలిపి మాట్లాడుతున్నావు. నీకు సిగ్గు లేదా? ఇప్పుడు మృత్యువు లక్ష్మణుని రూపం లో నీ ఎదుటే నిలచి ఉంది. ఇక నీవు నికుంభిలా చైత్యాన్ని చేరడం కల్ల! అని విభీషణుడు ఇంద్రజిత్తును హెచ్చరించాడు.
– కె. ఓబులేశు
90528 47742