ఓ రాజ్యంలో ఒక బిచ్చగాడు రాజభవనం దగ్గరలో ఉంటూ రోజూ, ఆ భవ నం లోని రాజుగారిని దూరం నుండి చూస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజుగారు అందరికీ విందు ఇస్తున్నారు అనేవార్త విన్నాడు. బిచ్చగాడికి ఒక ఆశ పుట్టింది. తన దుస్తులు చూసుకున్నాడు అన్నీ చిరిగిపోయాయి.ఎలాగైనా రాజుగారి నుండి మంచి దుస్తులు సంపాదించాలని అనుకున్నాడు. రాజభవనము దగ్గరికి వెళ్లి కాపలా వారిని బతిమి లాడి, ఎంతో ధైర్యం కూడగట్టు-కొని, వినయంగా రాజు దర్భారులోకి ప్రవేశించాడు.
అతన్ని చూడగానే రాజు… ”నీకేమి కావాలి” అని అడిగాడు.
దానికి ఆ బిచ్చగాడు రాజుగారికి వంగివంగి దండాలు పెడుతూ ”రాజా! నాకు మీరు ఇస్తున్న విందుకు రావాలని వుంది. దయచేసి తమ పాత దుస్తులు ఇప్పిస్తే అవి ధరించి విందుకు వస్తాను. నా దగ్గర చినిగిన బట్టలు మాత్రమే ఉన్నాయి.” అన్నాడు. రాజుగారు వెంటనే తన పాత దుస్తులను తెప్పించి బిచ్చగాడికిస్తూ- ”ఈ దుస్తు లు చినిగిపోవు, మాసిపోవు వాటిపై దుమ్ము పడదు, ఎందుకంటే ఇవి ఎంతో ప్రత్యెెక మైనవి. నీవు ఎప్పటికి వీటిని ధరించవచ్చు” అన్నాడు.
బిచ్చగాడి కళ్ళ వెంట నీరురాగా రాజుగారికి ధన్యవాదములు చెప్పాడు. ఆ దుస్తు లు తన గదికి తెచ్చుకొని ధరించి- అద్దములో చూచుకొని మురిసిపోయాడు. అయితే రాజుగారు ఎంత చెప్పినా, బిచ్చగాడికి ఆ రాజుగారి దుస్తులు చినిగిపోతే ఎట్లా అనే భయం పట్టు-కొంది. ఎందు-కై-నా మంచిదని పాతదుస్తులన్నీ ఒక మూట కట్టి తన వెంట తెచ్చుకునేవాడు. రాజుగారిచ్చిన విందు భోంచేస్తున్నంతసేపూ ఆనందంగా లేదు. బైట ఎక్కడో దాచిన తన పాత దుస్తుల మూట ఎవరన్నా ఎక్కడన్నా పారేస్తారేమో అని భయం. క్రమంగా రాజుగారి మాటలలోని సత్యం తెలిసివచ్చింది. ఎన్ని రోజులు ధరించినా దుమ్ము పడలేదు. కొత్తవిగానే వున్నాయి. కానీ తన పాత దుస్తులపై మమకారం తో ఆ మూట వదిలేవాడుకాదు. తోటివారు అతన్ని చూసి, హేళన చేస్తూ, పీీలిక గుడ్డల మనిషి అని పేరుపెట్టారు. చివరకు చనిపోవడానికి సిద్ధంగా ఉండి మంచంపై నుండి లేవలేక పోయేవాడు. పక్కనున్న జనాలు పాత బట్టల మూటపై వ్యామోహం పోలేదు. వాటి సంరక్షణ కోసమే జీవితం అంతా గడిపి, ఏ రోజూ సంతోషమును పొందలేదు గదా! అని బాధపడ్డారు.
ఇది ఒక బిచ్చగాడి కథ మాత్రమే కాదు! మనం అందరమూ కూడా ఈ అనుభవాల మూటలను పట్టు-కొని, వదలకుండా మోస్తూ ఉంటాము. ఎన్నో జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ జీవితంలోని అందమైన, సంతోషమైన వాటిని అనుభ వించలేము, ఆజ్ఞాపకాల బరువును మోస్తూ ఉండటమే అనేక బాధలకు, అశాంతికి కారణము. అందుకే ఉన్నంతలో సంతోషంగా ఉంటూ… పాతబడ్డ చెడు జ్ణాపకాలు విడిచిపెడితే జీవితం ఆనందంగా ఉంటు-ంది. నువ్వు ఎప్పుడూ, నిరుపేదవని అనుకో వద్దు, ధనం ఒక్కటే నిజమైన శక్తికాదు. మన మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి.
మానవ వ్యావెూహం!
Advertisement
తాజా వార్తలు
Advertisement