Saturday, November 23, 2024

మహిమాన్విత శక్తి పీఠాలు

ఇవి 108, 54, 51 అని భావిస్తున్నా, శ్రీ ఆదిశంకరులు సూచించిన 18 శక్తిపీఠాలు ప్రామాణికంగా నిలి చాయి. ప్రజాపతులలో ఒకరైన దక్షుని కుమార్తె అయిన సతీదేవి తండ్రిని కాదని శివుని వివాహం చేసుకుంది. భోళా శంకరు డంటే ఇష్టంలేని దక్షుడు తాను చేస్తున్న యజ్ఞానికి ఆహ్వానించ లేదు. కానీ తండ్రి చేస్తున్న మహా యజ్ఞానికి సతీదేవి పిలవక పోయినా వెళ్ళింది. కుమార్తె అని కూడా చూడకుండా ఘోర అవమానానికి గురి చేస్తాడు దక్షుడు. భక్త శంకరుని నానా మాటలు అంటాడు. ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి యోగాగ్నిలో పడి భస్మరూపం ధరి స్తుంది. విషయం తెలుసుకున్న లయకారుడు దక్షుని యజ్ఞా న్ని కాలభైరవునితో ధ్వంసం చేయిస్తాడు. భస్మ రూపి అయిన సతీదేవి దేహాన్ని భుజాలపై మోస్తూ ప్రళయ తాండవం చేస్తాడు శివుడు.
సృష్టి ధర్మమే గాడి తప్పుతుందని గ్రహించిన స్థితికారు డు శ్రీ మహావిష్ణువు తన సుదర్శనంతో సతీదేవి దేహాన్ని ఖండిస్తాడు. ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలు.
”లంకాయాం శాంకరీదేవి” సతీదేవి తొడ భాగం పడిన ప్రదేశంగా భావిస్తున్నారు. ఇది శ్రీ లంకలోని ట్రింకోమలీ పట్టణంలో ఉంది. కానీ ఇప్పుడది శిథిలమై కనబడుట లేదు. ఒకప్పుడు శ్రీ లంక కూడా అఖండ భారతావనిలోనిదని అభిప్రాయం.
” కామాక్షి కాంచికాపురీ”. ఇక్కడ దేవీవీపు భాగం పడిన దని ప్రతీతి. చెన్నైకి దగ్గరగా ఉన్నది. కంచి మోక్ష నగరం. చాలా సుందరమైన ఈ శక్తి పీఠంలోని కామాక్షి కన్నులతో ముక్తిని ప్రసాదిస్తుంది. ఇక్కడి సంతాన స్థంభం చుట్టూ ప్రదక్షిణ చేస్తే తప్పక సంతానం కలుగుతుంది. కంచికామాక్షి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తుంది. జైనులు, బౌద్ధులు కూడా అమ్మవారిని పూజించేవారు. శ్రీ ఆదిశంకరుల శ్రీ చక్రం మహి మాన్వితమైనది.
”ప్రద్యుమ్నే శృంఖలాదేవి” దేవి ఉదర భాగం పడిన ప్రవేశం. ఇది పశ్చిమ బెంగాల్‌లోని సుందరబన్‌లోని ఒక ద్వీపంలో ఉందని నమ్మకం. గంగానది సముద్రంలో కలిసే ఒకచోటు ఇది. దీనిని గంగాసాగర్‌ అని అంటారు. ఇక్కడ మకర సంక్రమణ స్నానం చాలా పుణ్యం కలిగిస్తుంది. అక్కడ ఉన్న కపిల మందిర ప్రాంతమే ఒకనాటి శృంఖలా దేవి శక్తిపీఠ మని నమ్మకం. అక్కడ ఉన్న గంగామాత మూర్తినే శృంఖలా దేవీగా పూజిస్తారు.
”చాముండా క్రౌంచ పట్టణ”. దేవీ కురులు పడిన ప్రదేశం. ఇది కర్నాటకలోని మైసూరులో చాముండే పర్వతం మీద వెలిసిన దేవి. అత్యంత సుందరమైన పీఠం. చాముం డేశ్వరి మహిషాసురుణ్ణి సంహరించింది. ఈ దేవీ వడయార్‌ రాజు లకు ఇలవేల్పు. సకల సౌభాగ్యా లను కలిగి స్తుందని నమ్మకం.
”ఆలంపురే జోగులాంబా” దేవి దంతాలు, దవడ భాగం పడిన ప్రదేశం. తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో మహబూ బ్‌నగర్‌ జిల్లాలో ఉంది. కర్నూలుకు 30 కిలో మీటర్ల దూరం లో ఉంది. జోగులాంబాదేవి యాెెగీశ్వరిగా సిద్ధ ప్రదాయిని గా ప్రసిద్ధి చెందింది. శ్రీ కృష్ణ దేవరాయలు ఈ శక్తి పీఠాన్ని
పునర్నిర్మించాడు. ఉగ్ర రూపంలోనున్న దేవిని శాంత రూపిణిగా ప్రసన్నం చేసుకున్నారు శ్రీ ఆదిశంకరులు.
”శ్రీ శైలే భ్రమరాంబికా” దేవి మెడ భాగం పడిన పుణ్య క్షేత్రం. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలుకు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగ రూపుడైన శ్రీ మల్లిఖార్జున స్వామితో కలసి శ్రీ భ్రమరాంబిక శక్తిపీఠం భక్తులను కటాక్షిస్తుంది. భ్రమర గీతాలు వినపడే అ పీఠ దర్శ నం పునర్జన్మ లేకుండా చేస్తుంది.
”కొల్హాపురే మహాలక్ష్మీ” దేవి నేత్రాలు పడిన ప్రదేశం. ఈ పీఠం మహరాష్ట్రలో ఉంది. పూనే నుండి ఎనిమిది గంటలు ప్రయాణం. ఏడు దీప స్తంభాలు ప్రత్యేక ఆకర్షణ. చత్రపతి శివాజీ మహరాజు. స్వామి వి వేకానందుడు తరచూ ఈ పీఠా న్ని సందర్శించి అమ్మవారిని కొలిచేవారు. అమ్మవారు వజ్ర, వై ఢూర్య సకల రత్న భరణాలతో దర్శనమిస్తుంది. కోరిన కోరికలు తీరుస్తుంది.
”మాహుర్యే ఏక వీరికా” కుడిచేయి పడిన ప్రదేశం. ఈ పీఠం మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో ఉంది. ఇక్కడి అమ్మ వారు రేణుకాదేవి రూపంలో దర్శనమిస్తారు. దత్తాత్రేయుని జన్మ స్థలం. అత్రి, అనసూయా పుత్రుడు దత్తాత్రేయుని పాదు కలు ఇక్కడ కొలువై ఉన్నాయి.
”ఉజ్జయిన్యాం మహకాళీ” పై పెదవి, మోచేయి భాగాలు పడిన ప్రదేశం. ఇది జ్యోతిర్లింగ క్షేత్రము కూడా. మోక్ష నగరమయిన ఉజ్జయిని మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఉంది. మహంకాళి ఉగ్ర రూపిణి. మహా కాళేశ్వర సహిత మహాకాళీ దర్శనం అభ యాన్ని కల్గిస్తుంది.
”పీఠికాయాం పురుహుతికా” దేవి పీఠ భాగం పడిన శక్తిపీఠం. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోనున్నది. ఇది పాదగయ క్షేత్రం కూడా. ఇక్కడ దత్తాత్రేయుడు శ్రీపాద శ్రీవల్లభునిగా జన్మిం చాడు. కుక్కుటేశ్వరుడు పురుహూతికాదేవి సహితంగా అనుగ్రహిస్తాడు.
ఓఢ్యానే గిరిజాదేవి”. దేవి నాభి స్థానం పడిన పుణ్య భూమి. ఇది ఒరిస్సా రాష్ట్రంలోని బీజాపూర్‌లో నున్నది. భువనేశ్వర్‌కు సుమారు నూరు కిలో మీటర్ల దూరంలో నున్నది. వైతరణీ నదికి దగ్గరగానున్న శక్తి పీఠం. అమ్మవారు గిరిజాదేవిగా దర్శనమిస్తారు. దీనిని నాభి క్షేత్రమని కూడా అంటారు.
”మాణిక్యా దక్ష వాటికా”. దేవి ఎడమ చెక్కిలి పడిన పుణ్యక్షేత్రం. తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఉంది. భీమేశ్వర సహిత మాణిక్యాంబ భక్తులను కటాక్షిస్తుంది.
”హరిక్షేత్రే కామ రూపా” దేవి యోని భాగం పడిన శక్తి క్షేత్రం. ఇది కామాఖ్య శక్తి పీఠముగా ప్రసిద్ధం. ఇది అస్సాం రాష్ట్రంలోని గౌహతి నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవిని యోని రూపంలో పూజిస్తారు. సంతానము కటాక్షించే దేవిగా పేరు పొందింది. అత్యంత రమణీయమైన ప్రకృతిలో కామాఖ్యాదేవి భస్మాభలేశ్వరుని సహితంగా అనుగ్రహిస్తుంది.
”ప్రయాగే మాధవేశ్వరీ:” దేవి చేతి వేళ్ళు పడిన ప్రదే శం. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగలో ఉంది. యుగ యుగాలు గా అనేకమంది రుషులు యాగాలు చేసిన పుణ్యక్షేత్రం. త్రివేణిసంగమ స్నానంచేసి మాధవేశ్వరుని దర్శించుకుం టారు.
”జ్వాలాయాం వైష్ణవీ దేవీ:” సతీదేవి నాలుక పడిన ప్రదే శం. ఇది హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉంది. నవ జ్వాలా రూపంలో వైష్ణవీదేవి దర్శనమిస్తుంది. సృష్టి మొద లు ఈ జ్వాలలు వెలుగుతూ ఉన్నాయి. ఇక్కడ శివుడు ఉన్మత్త భైరవునిగా దర్శనమిస్తాడు.
”గయా మాంగల్య గౌరికా” దేవీ వక్ష స్థలం పడిన పవిత్ర శక్తిపీఠం. ఇది బీహారు రాష్ట్రంలో పాట్నాకు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాశీకి రెండు వందల కిలోమీటర్ల దూరం లో ఉంది. మంగళగౌరిని మాంగళ్యరూపంలో కొలుస్తారు. దేవీ శక్తిత్రయ రూపిణి. సంతానమును ప్రసాదించే దేవి. సౌభాగ్యదాయిని.
”వారణస్యాం విశాలాక్షీ” సతీదేవి కర్ణములు పడిన ప్రదేశము. ఇది ఉత్తరప్రదేశ్‌లోని అతి ప్రాచీన నగరం కాశీలో ఉంది. ఈ శక్తి పీఠంలోని అమ్మవారు క ాశీ విశాలాక్షిగా అంద రికీ పరిచితము. కాశీవిశ్వేశ్వరుని సహితంగా ముక్తిని ప్రసాది స్తుంది. ఈ భూగోళంపై అత్యంత ప్రాచీన నగరం కాశీ. ప్రళ యాంతములో కూడా నిలిచి ఉంటుందని ప్రతీతి. మానవ జన్మనెత్తిన ప్రతి ఒక్కరూ దర్శించి గంగలో స్నానమాచ రించాలని సనాతనం తెలియజేస్తుంది.
”కాశ్మీరేషు సరస్వతీ”. సతీదేవి కుడి చెంప పడిన పుణ్య పీఠం. ఈ శక్తి పీఠ ంలోని అమ్మవారు సరస్వతీ దేవి. ఇది జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలోని శ్రీ నగర్‌లో ఉంది. దీనినే కీర్‌ భవానీ క్షేత్రమని కూడ అంటారు. అయితే శ్రీ శంకరాచార్యు లు ఈ పీఠాన్ని కర్నాటకలోని శృంగేరికి తరలించారని భావిస్తారు. జ్ఞాన ప్రదాయిని సరస్వతిదేవి.
కృతయుగము నుండి నిలిచి ఉన్న ఈ శక్తి పీఠాల సంద ర్శన మానవులకు సకల సౌభాగ్యాలను ఇచ్చి తుదకు ముక్తిని ప్రసాదిస్తాయి.

– వారణాశి వెంకట
సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement