తల్లి గర్భంలో ఉండగానే జ్ఞానాన్ని పొందినవారు మనకు నలుగురు గోచరిస్తారు. ప్రహ్లాదుడు, అభిమన్యుడు, దీర్ఘ తముడు అనే ఋషి, అష్టావక్రుడనే మహర్షి. అష్టావ క్రుడు తన తల్లి గర్భంలో ఉండగానే తన తండ్రితో ”నీవు నీ శిష్యులకు పగలనక, రాత్రనక ఎడతెరిపి లేని విధ్యాభ్యాసం చేయించటం వల్ల, విశ్రాంతి లేకపోవడంవల్ల, వేదం తప్పుగా చదువుతున్నారు. మీ స్వరం కూడా తప్పుతోంది. ఇది ధర్మం కాదు కదా!” అని పలి కాడు. ఈ మాటలు విన్న తన తండ్రి కోపంతో
”నీవు గర్భంలో ఉండగానే, వేదాధ్యయనం చేయకుండానే, తండ్రినే విమర్శించావు. తప్పుబట్టావు. కాబట్టి నువ్వు అష్ట వంక రలతో జన్మించుగాక” అని శపించాడు.
ఏకపాదుడనే వేదపండితుడుకి సౌశీల్యవతి, మహాపతివ్రత అయిన సుజాతతో వివాహం జరిగింది. ఏకపాదుడు తన భార్యతో ఆశ్రమ జీవితం గడుపుతూ, ఎంతోమందికి వేదవిద్యను బోధిం చాడు. క్రోధావేశంతో శపించినా, స్థిమితపడి, తర్వాత ఆలోచించి తనకు పుట్టబోయే బిడ్డ మహాజ్ఞాని, దివ్య సంపన్నుడు కాగలడని గ్ర#హంచాడు. కొద్దిరోజుల పిమ్మట, ఒక రోజు సుజాత భర్తను సమీ పించి,”నాథా! ప్రసవ సమయం సమీపిస్తోంది. నెయ్యి, నూనె, ఆహారధాన్యాలు సమకూర్చుకోవాలి కదా! మనవద్ద ధనం ఏమీ లదు. ఈ ప్రసవభారంనుండి ఎలా విముక్తిని పొందగలను?” అంది.
ఏకపాదుడు ధనం సంపాదించే నిమిత్తం జనక మహారాజు ఆస్థానానికి వెళ్ళాడు. ఆ సమయంలో రాజు ఆస్థానంలో వేద భాష్యం మీద పందెం జరుగుతోంది. వరుణుని కుమారుడు ”వంది” అనే పండితునితో వాదము చేసి గెలిచిన వారికి, సర్వము ఇస్తానని, ఓడిపోయినవారు జలనిమజ్జితులై ఉండాలనే షరతు పెట్టారు. అపుడు ఏకపాదుడు వందితో వాదానికి తలపడి, ఓడి పోయాడు. షరతు ప్రకారం, నీళ్ళలో మునిగి ఇక్కడే ఉండి పోవడంవల్ల, ఇంటికి వెళ్ళలేదు. అక్కడ సుజాత భర్త రాక కోసం ఎదురుచూసి, ఆఖరికి ప్రసవించింది. పుట్టిన శిశువు అష్టవం కరలతో జన్మించాడు. అదే సమయంలో సుజాత తల్లి కూడా ఒక పుత్రుడికి జన్మనిచ్చింది. ఆమె ఉద్దాలక మహర్షి భార్య. ఉద్దాలక మ#హర్షి తన బిడ్డకు ”శ్వేత కేతువు” అని నామకరణం చేసాడు. చిన్న ప్పటి నుండి ఉద్దాలక మహర్షి వద్దే అష్టావక్రుడు, తన మేనమామ శ్వేతకేతువుతో కలసి పన్నెండు సంవత్సరాలు వేదాధ్యయనం చేసారు. అష్టావక్రుడు చిన్నప్పటి నుండి ఉద్దాలక మ#హర్షి వద్దనే ఉండడం, శ్వేతకేతు తన తండ్రిని సంబోధించడం, చూసి, తాతనే తండ్రిగాను, శ్వేతకేతును సోదరుడుగా భావించేవాడు. ఒకరోజు అష్టావక్రుడు తాత ఉద్దాలక మ#హర్షి తొడపై కూర్చుండడం చూసి, శ్వేతకేతు ఈర్ష్యతో అతని చేయి పట్టుకొని బలంగా లాగుతూ ”మా నాన్న ఒడిలో ఎందుకు కూర్చొన్నావు? వెళ్ళి మీ నాన్న ఒళ్ళో
కూర్చో” అంటాడు.
అష్టావక్రుడు ఏడుస్తూ, తల్లి వద్దకు వెళ్ళి విషయం తెలుసు కొన్నాడు. అప్పుడు తన తండ్రిని తీసుకొని రావాలని, మేనమామ శ్వేతకేతువుతో కలసి తాత, తల్లి ఆశీర్వాదం పొంది, జనక మహా రాజు ఆస్థానానికి వెళతాడు. అక్కడి ద్వారపాలకులు ఈ ఇద్దర్నీ లోపలికి పోనీకుండా అడ్డగించారు. అప్పుడు అష్టావక్రుడు ” ఈ ద్వారం గుండానే మూగవాళ్ళు, గ్రుడ్డివాళ్ళ సహతం అందరూ ప్రవేశిస్తున్నారు కదా! మరి మమ్మల్ని మాత్రమే ఎందుకు అడ్డగిస్తున్నారు?” అంటాడు.
ఏ వరం కావాలో? అనగానే తన తండ్రి ఏకపాదుడుతోపాటు జల నిమజ్జితులైన పండితులందర్నీ విడుదల చేసి, ఓడిపోయిన ఈ పండితులను జల నిమజ్జితం చేయించండి” అని అష్టావక్రుడు కోరాడు. ఇంటికి చేరుకొని, తల్లి తండ్రుల సేవ చేస్తూ, తన తండ్రి వద్ద ఎన్నో వేదాంత విషయ జ్ఞానా ల్ని పొందాడు. కొంత కాలానికి వదాన్య అనే మహర్షి తన కుమార్తె ”సుప్రభ”ను ఇచ్చి వివాహం చేసాడు. జనక మహారాజుతో చేసిన వేదాంత చర్చయే ”అష్టావక్ర గీత”గా ప్రసిద్ధి పొందింది.
శుభం భూయాత్.
(మహాభారతం నుండి)
– అనంతాత్మకుల రంగారావు
7989462679