మరణించిన తల్లి/తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, ముత్తాతలను /తల్లి నానమ్మ బామ్మలను తలచుకుని పితృయఙ్ఞాన్ని నిర్వహి స్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమిటి? వారి గతి అథోగ తేనా? అంటే.. ‘కాదు’ అంటు-ంది శాస్త్రం.
మన కుటు-ంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర, సోద రీలు మరణించి ఉండవచ్చు. లేదా.. పెళ్లయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణిం చిన చిన్నపిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల (వరదలు, భూకంపాలు) ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటు-వంటివారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్థ్వలోకా లకు పంపడం కోసం ఈ ‘మహాలయ పక్షాలు’ నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాలవారికి (తండ్రి, తాత,ముత్తాత/తల్లి, నానమ్మ, తాతమ్మ) మాత్రమే తిలోదకాలతో, పిండ ప్రదానం యివ్వబడుతుంది. కానీ ఈ ‘మహాలయ పక్షాలు’ పదునైదు రోజులు మన వంశంలో మరణించిన వారందరికీ మాత్రమేకాక, పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో, పిండప్రదానం ఇచ్చే అర్హత, అధికారం మనకు ఉంది. దీనినే ‘సర్వ కారుణ్య తర్పణ విధి’ అంటారు.
ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం పెట్టకపోతే.., ఆ తద్దినం పెట్టని దోషం ‘మహాలయం’ పెట్టడం వలన పోతుంది. మహాలయ పక్షాలు పదునైదు రోజులు మన పితృదేవ తలు ‘మా వారసుడు పితృయఙ్ఞం చేయకపోతాడా.., మా ఆకలి తీర్చకపోతాడా’ అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు. పితృయఙ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ… పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు. పితృయఙ్ఞం చేయ ని వారసుని వంశం.. నిర్వంశం కావాలని శపించి కోపంగా వెళ్ళిపో తారు. వంశం నిర్వంశం కావడం అంటే… సంతానం కలుగకపో వ డమే కదా. సంతానంలేనివారిగతి ఎలా ఉంటుందో తెలుసుకున్నా ం కదా. అందుచేత తప్పకుండా ‘మహాలయ పక్షాలు’ పెట్టి తీరాలి.
పితృదేవతలు అంటే ఎవరు?
పితృదేవతలు అంటే గతించిన మన పితరులు కాదు. మనందరి (జీవు) రాకపోకలను, వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ పితృదేవతా వ్యవస్థ. వసువులు, రుద్రులు, ఆదిత్యులు.. మొదలుగా గల దేవతలను పితృదేవతలు అంటారు. కర్మ క్షయం కాని జీవుడు మరణించిన తరువాత పుడతాడు అనేది నిజం. కానీ వెంటనే అని ఖచ్చితంగా చెప్పలేము. ఒక లెక్క ప్రకారం పునర్జన్మకు 300 సంవత్సరాలు పడుతుంది. వెంటనే పుట్టిన సందర్భాలు కూడా లేకపొలేదు. అది ఆ జీవుని సంకల్ప బలం, తనకి గల ప్రారబ్ధ ఆగామి, సంచితం అనే కర్మలపైన ఆధారపడి ఉంటుది.
ఒకవేళ వెంటనే పుట్టినాసరే మనం చేసే పితృకర్మల ఫలితం వారికి అందుతుంది. వారు ఏ రూపంలో పుట్టినా సరే మనం పెట్టినది వారికి ఏది ఆహారమో ఆ రూపంలో అందుతుంది. ఇలా చేయడానికి ఒక వ్యవస్థని పితృదేవతలు ఏర్పాటు- చేసేరు. ఉదాహరణకు.. ఆ జీవుడు ఆవుగా పుడితే గడ్డి మొదలైన రూపంగా మారి మనం పెట్టిన ఆహారం అందుతుంది. వారిని ఉద్దేశించి అలా చేసినందుకు పితృదేవతలు కూడా సంతోషించి మనకి మంచి కలుగజేస్తారు. ఒకవేళ గతించినవారు ముక్తిని పొంది లేదా ఉత్తమ గతులలో ఉండి మనం చేసినవి అవసరంలేని స్థితిలో ఉంటే మనం చేసిన పితృకర్మల ఫలితం మనకే మన కోరికలు తీరేవిధంగా వస్తుంది. ఉదాహరణకు మనం మనీ ఆర్డరు చేసిన అడ్రసులో ఎవరూ లేకపొతే మనకే తిరిగి వస్తుంది కదా. కానీ గతించిన వారి స్థితి మనకు తెలియదు కనుక మనం జీవించి ఉన్నంత కాలం పితృకర్మలు చేయవలసినదే. ఈ జన్మతో బంధం తెంచుకున్న జీవన్ముక్తులకి తప్ప మిగతావారికి గతించిన తరువాత కూడా తన పూర్వీకులతోనూ, తన తరువాతి తరం వారితోనూ సంబంధం ఉంటు-ంది. మనం పెట్టే ఆహారం స్వీకరిస్తారు.
సంప్రదాయ బద్ధంగా పెళ్ళి జరుగనప్పుదు ఇరువైపుల పితరులు (ముందు తరాలు, తరువాతి తరాలు) అధోగతి చెందుతారన్నది నిజం. వారు వ్యక్తిగతంగా పుణ్యచరిత్రులైనప్పటికీ ఈ బాధ తప్పదు. అందుకే మనవారు పెళ్ళిళ్ళలో సంప్రదాయానికి అంత విలువనిస్తారు. గతించిన వారి పుణ్య సాంద్రత మరీ ఎక్కువగా ఉంటే ఏ మహర్షి వలననో ఉత్తమగతులు మళ్ళీ పొందే అవకాశం ఉంది కానీ ఖచ్ఛితంగా చెప్పలేము. అందుకే ఇదివరకు ఎవరైనా సంప్రదాయానికి విరుద్ధంగా పెళ్ళి చేసుకుంటే వారితో తల్లిదండ్రులు, బంధువులు సంబంధాన్ని త్రెంచుకునేవాళ్ళు. అది అభిమానం లేక కాదు. వారు, వారి పితరులు అధోగతిపాలు
కాకూడదని మనసులో బాధపడ్డా అలా చేసేవాళ్ళు.
ఆ పైన పిల్లలు కలిగి, వారు పితృకర్మలు సరిగా చేస్తే పున్నామ నరక బాధలు తప్పుతాయనేది వాస్తవం. అందుకే మనవారు వంశం కొనసాగాలని అనుకునేవారు. కానీ మన ప్రయత్న లోపం లేకుండా సంతానం కలగనప్పుడు అంతగా విచారించనక్కర్లేదు. దానికి ప్రత్యామ్నాయంగా… దేవతల కళ్యాణాలు, మరికొన్ని వ్రతాలు ఉన్నాయి. వాటిని ఆచరించడం వలన ఇదివరకు జన్మలలో చేసిన ఏ పాపం వలన పిల్లలు లేరో ఆ పాపాలని నాశనం చేసి, వారిని, వారి పితరులను కూడా తరింపజేసుకోవచ్చు.
తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలామంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడితో చేసేవాళ్ళు లేరు అని, వంటవాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణాలతో తద్దినాలు పెట్టడం మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడపిల్లలే పుడతారు. మగపిల్లలు పుట్టరు. ఇది నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.
– సేకరణ: పుల్లాభొట్ల భాస్కరశర్మ
మహాలయ పక్షాలు ఎందుకు పెట్టాలి
Advertisement
తాజా వార్తలు
Advertisement