విశాఖ శారదాపీఠంలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు
విశాఖపట్నం, ప్రభన్యూస్ బ్యూరో: విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. బుధవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. స్వర్ణ కలశం, పద్మాలు చేతపట్టిన శ్రీ మహాలక్ష్మి అవతారం భక్తులను విశేషంగా ఆకట్టు-కుంది. అమ్మవారి అవతారానికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి పూజలు చేసారు. భక్తజనంలో భీతిని తొలగించి ధైర్యాన్ని నింపేందుకు వనదుర్గ హోమం చేపట్టారు. 8 వందల మూల మంత్రాలతో హవనం చేసారు. అలాగే విశా ఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన శత చండీయాగం, శ్రీమత్ దేవీ భాగవత పారాయణ, వేద పారాయణ, నవావరణ అర్చన శాస్తక్తంగా కొనసాగుతున్నాయి. క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు, చైతన్య విద్యాసంస్థల అధినేత చైతన్య రాజు, ఒడిశా మంత్రి నభా కిషోర్ దాస్ తనయుడు విశాల్, ద్రోణంరాజు శ్రీనివాస్ తన యుడు శ్రీ వత్సవ తదితరులు పీఠాన్ని సందర్శించి శరన్నవరాత్రి మహొ త్సవాలలో పాల్గొన్నారు.
మహాలక్ష్మి అవతారంలో రాజశ్యామల
Advertisement
తాజా వార్తలు
Advertisement