బాజాభజంత్రీలతో ఊరేగింపు
లావేరు(శ్రీకాకుళం), ప్రభ న్యూస్: మహాశివరాత్రి పర్వ దినాన నిర్వహించే శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణం కోసం వి నియోగించేందుకు తలపాగా సిద్ధమ య్యింది. లావేరు గ్రామానికి చెందిన కాశిన వెంకటరమణ, సవరరాజు బ్రదర్స్ పుష్కరకాలంగా ఆనవాయితీగా స్వామి వారికి తలపాగా సమర్పిస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో నిత్యము శివ స్మరణతో తలపాగాను సిద్ధం చేశారు. సోమవారం శ్రీ శ్రీనివాస నంద స్వామివారు, రామా లయ అర్చకులు బంకుపల్లి శంకర్ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం పురవీధుల్లో బాజాభజంత్రీలతో ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె.వెంకటరమణ పద్మ, సవర రాజు లక్ష్మి, ప్రకాశం రమణమ్మ దంపతులు, ఓం నమశ్శివాయ భక్తులు మహిళలు పాల్గొన్నారు.
మల్లికార్జునస్వామికి సిద్ధమైన తలపాగా
Advertisement
తాజా వార్తలు
Advertisement