Tuesday, November 26, 2024

మరో 19 ఆలయాలకు ప్రాణప్రతిష్ఠ

హైదరాబాద్‌, ప్రభ న్యూస్ : వేద మంత్రాలు, అష్టాక్షరీ మంత్ర‌ పఠనాలు, శ్రీమన్నారాయణ స్తోత్రాలతో శ్రీరామనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. 108 దివ్యదేశాలలోని మరో 19 ఆలయాలకు గురువారంనాడు త్రిదండి శ్రీమన్నా రాయణ చినజీయర్‌ ప్రాణప్రతిష్ఠ చేశారు ఉదయం 5 వేల మంది రుత్విజులతో యాగశాల నుంచి దివ్యదేశాలకు చేరుకున్న ఆయన నక్షత్రం, రాశి ఆధారంగా దివ్యదేశ ఆలయాలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ, కుం భాభిషేకాలు నిర్వహించారు. ఈనెల 7న 32 ఆలయాలకు ప్రాణ ప్రతిష్ఠ జరగగా ఇవాళ మరో 19 ఆలయాలకు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. యాగశాలలో ఉదయం భక్తిశ్రద్ధల మధ్య అష్టాక్షరీ మం త్రాన్ని పఠించారు. హనుమత్సమేత సీతారామలక్ష్మణ స్వామి వార్లకు ప్రాత:కాల ఆరాధన చేశారు. ఇవాళ్టి యాగంలో భాగంగా 5వేల మంది రుత్విజులు.. శ్రీలక్ష్మీనారాయణమహా క్రతవును 114 యాగశాలల్లోని 1035 హూమకుండాల్లో శాస్త్రోత్తంగా నిర్వహించారు. సస్యవృద్ధికై వైయూహక ఇష్టి, దుష్టగ్రహబాధా నివారణకై నారాసింహ ఇష్టి నిర్వహించారు.
రామానుజ అష్టోత్తర పూజ
ప్రవచన మండపంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వా మీజీ భక్తులతో శ్రీరామానుజ అష్టోత్తర శతనామావళి పూ జను చేయించారు. భక్తులు శ్రద్ధగా రామానుజాచార్యులను పూజించారు. ఈ పూజలో మైహూంగ్రూప్‌ అధినేత డాక్టర్‌ జూ పల్లి రామేశ్వర్‌రావు, ఆయన కుటుంబసభ్యులు పాల్గొన్నారు. నేపాల్‌ శ్రీవైష్ణవ పరిషత్‌ అధ్యక్షులు శ్రీమాన్‌ దేవరాజాచార్య స్వామీజీ మహరాజ్‌ వైష్ణవ సంప్రదాయంపై అనుగ్రహభాష ణం చేశారు. ముంబైలోని వనమాలి మఠ ఆస్తాన విద్వాన్‌ డా.టి.డి. మురళీధరన్‌జీ వైష్ణవ సంప్రదాయం, సమతా మూర్తిపై ప్రవచనాన్ని అందించారు. వర్దన్‌ స్వామీ, నెల్లూరు హయగ్రీవ ఆలయానికి చెందిన భక్తవత్సలం స్వామి, వరంగల్‌కు చెందిన కల్వకుంట్ల వైష్ణవ సంప్రదాయం, రామానుజ వైభవంపై విశిష్ట ప్రవచనాలను అందించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీమతి ఎన్‌.ఎల్‌. శారద రామానుజ కీర్తనలు ఆకట్టుకున్నాయి. కుమారి యతి బృంద నాట్యం, ప్రతిమ బృంద గానం, సంజయ్‌ కుమార్‌ జోషి కథక్‌ నృత్యం , జమున నృత్యం, శ్రీరాజ్యలక్ష్మీ సమేత భక్త బృందం వారిచే శ్రీరామానుజ బుర్రకథ, యుగంధర్‌ స్వామి గానం అలరించాయి. నేత్ర విద్యాలయకు చెందిన అంధ వి ద్యార్థుల పాటలు అందరినీ కదిలించాయి. సాయంత్రం వి ష్ణు సహస్ర పారాయణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మ రోవైపు శ్రీరామానుజాచార్యుల 216 అడుగుల మూర్తిని ద ర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. జై శ్రీమ న్నారాయణ శరణుఘోషతో ముచ్చింతల్‌ మార్మోగుతోంది.
ప్రాణప్రతిష్ఠ జరిగిన ఆలయాలు ఇవీ…
తిరుచ్చేరై, తలైచ్చంగణ్మాదీయం, తిరువాలి తిరునగరి, కాంచీరామవిణ్ణగరం, కపిస్థలం, వైకుంఠ విన్నిగరం, సిం పాయిన్‌ సెల్‌కోయిల్‌, తిరుమణిక్కూడమ్‌, తిరుతైత్తి వరిక్బు లమ్‌, పార్తన్‌ పళ్లి, తిరుమెయ్యమ్‌, తిరుత్తణ్కాల్‌, తిరుము ళిక్కాళం, తిరుక్కడిత్తానం, తిరుక్కాట్కరై, తిరువనంతపు రం, తిరువేళుక్కై, తిరువిదువ్డన, తిరుక్కడలమళై.
నేటి కార్యక్రమాలు
ఉదయం సామూహక ఉపనయనాలు
విద్యాప్రాప్తికై హయగ్రీవ ఇష్టి
దివ్యదేశాలలోని మరికొన్ని ఆలయాలకు ప్రాణ ప్రతిష్ఠ
ప్రవచన మండపంలో శ్రీలక్ష్మీనారాయణ పూజ
కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు
వీఐపీల పర్యటన : అవధూత దత్త పీఠాధిపతి పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబా, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి రానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement