Saturday, November 23, 2024

మమ దేహి కరావలంబమ్‌

లోక పాలకుడైన శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ- శిష్టరక్షణ నిమి త్తం, తన భక్తులను రక్షించడానికి అవతారాలు ఎత్తిన విష యం మనకు అవగతమే. తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించిన సంగతి మనకందరికీ తెలుసున్న విషయమే. ప్రతీ అవతారానికీ ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. శ్రీమన్నా రాయణడు ఎత్తిన అవతారాల లో నాల్గవ అవతారమే ఈ” నరసింహావతారం.” ఈ రోజు నర సింహావతార జయంతి. ఈ నరసింహ జయంతి ప్రతీ సంవత్సరం వైశాఖమాస శుక్ల పక్ష చతుర్థశి నాడు వస్తుంటుంది.
భగవంతుడు సర్వాంతర్యామి అని తెలుపుటకు, పరమాత్మ తత్త్వం మానవులలోనే కాదు, జంతువులు, పక్షులలో కూడా ఉం టుందని తెలియచేయడం, శివ- విష్ణువులకు తేడా లేదని శరభా వతారం ద్వారా తెలియచేయడం విశిదమవుతోంది.
ప్రహ్లాదుడు నారాయణతత్త్వం తెలిసినవాడు. చిన్నతనం నుంచి విష్ణు భక్తుడు. హిరణ్యకశిపుడు తన పుత్రుడు ప్రహ్లాదుని చండామార్కుల వద్ద విద్యకు పంపినా అక్కడి విద్యార్థులకు భక్తి తత్త్వము, సజ్జనసాంగత్యము, సద్గురు సేవ, శ్రీహరి కథాశ్రవణం, నారాయణ సంకీర్తనలే ముక్తికి సాధనాలని బోధించాడు ప్రహ్లాదు డు. దాంతో పిల్లలంతా హరిభక్తులుగా మారిపోయారు. ఈ విష యాన్ని తెలుసుకున్న హిరణ్య కశిపుడు, క్రోధంతో కొడుకును పిలచి ”నువ్వు విష్ణుభక్తి మానవా? ఏడిరా? నీ హరి? ఎక్కడరా నీ నారాయ ణుడు?” అంటూ ప్రహ్లాదుని జబ్బ పట్టుకుని ఊపుతూంటే, ప్రహ్లాదుడు —
”ఇందు గలడందు లేడని
సందే#హము వలదు చక్రి సర్వోపగతుండు
ఎందెందు వెదికిచూసిన
అందందే గలడు దానవాగ్రణి వింటే!!” అని చెప్పగానే, మదోన్మత్తుడైన హిరణ్యకశిపుడు క్రోధంతో తన గదతో దగ్గర ఉన్న స్థంభాన్ని కొట్టగా ఆ దెబ్బకు పెళ పెళమంటూ స్థంభం బ్రద్దలై, దాం ట్లో నుండి, దేదీప్యమానమైన దివ్యతేజస్సుతో నరసింహ స్వామి ఆవిర్భవించాడు. నర శరీరంతో సింహం ముఖంతో ప్రకాశిస్తున్న స్వామి, ఉగ్రరూపంతో, వజ్రాయుధాల్లాంటి వాడైన గోర్లతో, కాళ్ళతో సర్పాలను బంధిస్తున్న గరుత్మంతునిలా, హిరణ్యకశిపుని పట్టుకొని, తన మోకాళ్ళపై పడుకోబెట్టి గుండెను, ఉదరాన్ని చీల్చి సంహరించాడు. సంధ్యవేళ, పడిన స్థంభం పై కూర్చొని, నరసిం హుడు సంహరించాడు. ఆ ఉగ్ర రూపం చూసిన ప్రహ్లాదుడు విష్ణు వును స్తుతించాడు. దేవతలు, లక్ష్మీదేవితో సహా విచ్చేసి స్వామిని శాంతపరచ ప్రయత్నం చేసారు. అయినా, నరసింహ స్వామి శరీ రం నుండి క్రోధాగ్ని జ్వాలలు వస్తుండడంతో, దేవతలు పరమశివు ని వద్దకు వెళ్ళి విషయం చెప్పగా, శివుడు ”శరభావతారం”లో స్వామి వద్దకు వెళ్ళాడు. శరభావతారం మానవ ఆకారంతో, జం తు, పక్షి రూపాలలో పెద్ద పెద్ద రెక్కలతో, వాడైన దంతాలతో తోకతో, పటిష్టమైన పంజాలతో అనేక చేతులు, కాళ్ళతో ఒప్పారుతోంది. నరసిహస్వామి ఉగ్ర స్వరూపం చూసి పంజాలతో మీదకు వచ్చాడు శరభుడు. శరభుడు రాక శివుని ప్రభావమేనని గ్రహంచిన స్వామి శాంతించాడు. ఆ శరభుడే నరసిం#హుడును ”నర” రూపంలోకి, ”సింహం” రూపంలోకి విడదీయగా,నర రూపమే నరుడుగా, సిం#హం శ్రీ#హరి రూపంలో మారాయి. వాళ్ళే తరువాత కాలంలో ”నర-నారాయణులుగా” పేరు పొందారని పురాణాలు విశదీకరిస్తున్నాయి.
నరసిం#హ మంత్ర మ#హమ
ఆదిశంకరాచార్యులు శిష్యులలో ముఖ్యుడు పద్మ పాదాచార్యులు, తన చిన్నతనంలోనే నరసింహస్వామి గురించి తెలుసుకొన్నాడు. తర్వా త కాలంలో శంకరాచార్య శిష్యు డుగా చేరి, ఆయన అభిమానా నికి పాత్రుడయ్యాడు. శంక రాచార్యులు తన శిష్యులతో దేశ సంచారం చేస్తూ, శ్రీశై లం వచ్చి విడిది చేసారు. అది తెలుసుకొన్న ఒక కపా లి కాళికాదేవికి బలి ఇవ్వ డానికి శంకరులును నిర్ణ యించి, శిష్యులు ఎవ్వరూ లేని సమయంలో సం#హరిం చబోయాడు. కొద్ది దూరం లో పాతాళ గంగలో స్నానం చేస్తున్న పద్మపాదుడుకి అంత ర్ముఖంగా, గురువుగారికి అపచా రం జరుగుతోందని గ్రహంచి, అక్కడ నుండే, నరసింహ మంత్ర పఠనం చేస్తూం డగానే, ఒక సిం#హం, చంపబోతున్న కపాలు డుని సంహరించి అదృశ్యమైపోయింది. పరుగు పరుగున వచ్చిన పద్మపాదాచార్యులు, గురువు సురక్షి తంగా ఉండడం చూసి, ఆనందించాడు. శంకరులు విష యాన్ని అడిగి తెలుసుకొని, ఇదంతా నరసింహ మంత్రమహిమ అని తెలిపారు.
తర్వాత శ్రీ శంకరాచార్యులు ”నృసింహ కరావలంబ స్తోత్రం, ఇంకా మరికొన్ని స్తోత్రాలు రాసి లోకానికి అందించారు. నరసింహ కరావలంబ స్తోత్రం ఎంతో మహిమ కలది. ఆ కరావలంబ స్తోత్రం లోని రెండు శ్లోకాలు అవగాహనకు పరిశీలిద్దాం.
”మమ దేహ కరావలంబమ్‌” అంటే భావం ”నీ చేతులను నాకు ఆలంబనగా ఇయ్యి. ఈ సంసార సాగరంలో చేయూతను ఇవ్వమని.” నరసింహస్వామి కరావలంబ స్తోత్రంలో స్తుతిస్తాము.
”సంసార సాగర నిమజ్జన ముహ్యమానం
దీనం విలోకయ విభో కరుణానిధే ,మామ్‌
ప్రహ్లాద ఖేద పరిహార పరావతార!
లక్ష్మీ నృసింహ! మమ దేహ కరావలంబమ్‌!!
అంటే ”సంసారమనే సముద్ర మందు మోహంతో మునిగి పోయిన నన్ను, ప్రహ్లాదుని దు:ఖాన్ని పరి#హరించిన విధంగా, కరుణానిధివైన నువ్వు లక్ష్మీ దేవితో కూడి చేయూత నియ్యవా?” అని భావం.
”సంసార యోగి సకలేప్సిత నిత్యకర్మ
సంప్రాప్య దు:ఖ సకలేంద్రియ మృత్యునాశ సంకల్ప! సిన్దుతనయా కుచకుంకుమాంక
లక్ష్మీ నృసింహ! మమ దేహ కరావలంబమ్‌!! అంటే సంసార యోగం చేత కలిగిన అన్ని కోరికలను నిత్య కర్మల వల్ల సంప్రాప్తిం చిన ఇంద్రియ దు:ఖాలను, మృత్యువును, నశింపచేయ సమర్థత గలవాడా! సముద్రుని కూతురైన లక్ష్మీదేవితో కూడిననృసింహా నాకు చేయూత నిమ్ము. ఇలా మనం ప్రతీరోజూ చేసే అనుష్టాన కార్యక్రమంలో నృసింహ కరావలంబ స్తోత్రం పఠిస్తే, మృత్యు భయం, అనారోగ్యం, మన:క్లేశాలు వంటివి ఏమీ ఉండవు.
ఆ స్వామి శరణాగతి పొందితే, మనకు మృత్యుభయం పోయి సకలైశ్వర్యాలు సిద్ధిస్తా యి. ఇది చదివిన వారికి ఆ నరసింహుడు కృప కలుగుతుంది.

  • అనంతాత్మకుల రంగారావు
    7989462679
Advertisement

తాజా వార్తలు

Advertisement