సాయంత్రం రిసెప్షన్‌కు వెళ్ళాలంటే మనసు బాగోలేదని చెప్పిన ఇల్లాలు, అమ్మాయి వివాహం ఎలా చేయాలో అనే భయంతో మనస్సు కుదురు లేదంటున్న పిన్నిగారు, పరీక్షా ఫలితాలు వెలువడతాయంటే, విద్యార్థిలో ఉండే మాన సిక ఆందోళన వంటి విషయాలను సర్వ సాధారణంగా వింటుం టాం కదా! అసలు మనస్సు అంటే ఏమిటి?
అదెక్కడ ఉంటుంది? అని అనుకొంటే-
మనస్సుకు రూపం లేదు. శరీరంలో స్థానం ఎక్కడాలేదు. కాని మనకు కలిగే సుఖదు:ఖాలు మనస్సు ద్వారానే ప్రేరేపింపబడు తున్నాయి. మనస్సు నిలకడలేనిది. చంచల స్వభావంతో పరుగు లెడుతూ ఉంటుంది. పంటపొలంలో మొక్క చుట్టూ కలుపు పెరిగి నట్లుగా, కామ, క్రోధ, లోభములనబడే అరిషడ్వర్గాలు ఆరు మన స్సు చుట్టూ తిరుగుతూ, దేహంద్రియాల సుఖాన్ని అన్వేషిస్తూ, క్షోభ పెడుతూ ఉంటాయి. మనిషి అ చట్రంలో చిక్కుకొని, అదే సర్వ సౌఖ్యాలకు హితువనే భ్రమలో ఉంటున్నాడు.
”యతో యతో నిశ్చరతి మనశ్చంచల మస్థిరమ్
తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్!!”
అని భగవద్గ³ీతలో శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశిస్తూ అన్నారు. అంటే ”చంచల స్వభావం, నిలకడలేనిదైన మనస్సు ఎక్క డెక్కడ తిరుగుతుందో, అక్కడ నుండి తీసుకువచ్చి, ”ఆత్మ”యందే స్థిరం చేయాలి. అని వివరించారు.
చిన్నపిల్లవాడు స్థిరంగా ఉండక అటు- ఇటూ తిరిగి అల్లరి చేస్తూంటే పట్టుకు తీసుకొచ్చి బంధించినట్లుగా, మనం మనస్సును స్థిరంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇది కొంచెం కష్టమైన పనే అయినా, అసాధ్యం మాత్రం కాదు. దానికి అభ్యసనం ముఖ్యం. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం, భయం అన్నీ మెదడును ఆశ్ర యించే ఉంటాయి. అందుకే వీటినన్నింటిని ”అంతరేంద్రియము లు” అంటారు. మనస్సుకు కోపం, ఊహలు, దు:ఖం, ఆనందం వంటి అనేక హావభావాలు ఏర్పడతాయి. వస్తువులపైన, పదార్థాలపైన, జీవుల పైనా, మమకారం (మోహం) ఏర్పడటానికి మనస్సే కారణం ఆశ- నిరాశలకు రెండింటికి కేంద్రం మనస్సే. ఆశించిన ప్రయోజనాలు సఫలమైతే ఒక రకంగాను, విఫలమైతే మరొక రకంగాను మనస్సు స్పందిస్తుందనడంలో ఏమీ సందేహంలేదు
కదా!
మన జీవిత గమనాన్ని ప్రభావితం చేసేది మనస్సు. శ్రీ కృష్ణ పరమాత్మ మనస్సును నియంత్రించడానికి, ”అభ్యాసనము- వైరాగ్యం” అనే రెండు మార్గాలను సూచించారు. వైరాగ్యం అంటే మనలో వస్తువులపైన, పదార్థాలపైన, వ్యక్తులపైన ఉన్నటువంటి మమకారాన్ని వదిలి, రాగద్వేషాలకు అతీతంగా ఉండమని, ఈ విధానం అభ్యసనా ప్రక్రియ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పారు. ఎలాగంటే, పుస్తకంలోని పేజీలు మెల్లమెల్లగా రోజూ కొన్ని పేజీలు చదివి పూర్తిచేసినట్లు. అలా చేయడంవల్ల, దానిలోని సారం అర్థమైనట్లు. అలాగే ఒక పెద్ద బిల్డింగు కట్టడానికి కొన్ని నెలలు పట్టినట్లుగా, అప్పుడే ఆ నిర్మాణంలో భధ్రత ఉంటుంది. ఇలాగే మనస్సును ఒకచోట ఏకీకృతం చేయడానికి అభ్యసనా ప్రక్రియ కొంతకాలం పడుతుంది. దీనికి ఏకాగ్రత కావాలి. ఎలాగంటే పరీక్ష రాసే విద్యార్థి తన దృష్టిని, మనస్సును, బుద్ధిని, ఏకీకృతం చేసి రాస్తుంటాడు. అదేవిధంగా మన స్సును, బుద్ధిని కట్టడి చేస్తూ, ఆత్మతో మిళితం చేస్తుంటే, మనస్సు నియంత్రణ సులభతరమవుతుంది. అయినా మనస్సు పరిపరివిధా ల ఆలోచిస్తూ, ఐహక బంధాల నుండి, బయటపడలేక, పరిగెడు తూ ఉంటుంది. భావాలు, ఆలోచనలు మనస్సును నిలబడనీ యవు. అప్పుడే మనిషిలో నిరాశ, నిస్పృహ, కలుగుతాయి. కాని మరలమరల సాధన చేయాలి. దీన్నే అభ్యసనా ప్రక్రియ అంటారు.
మనస్సును నియంత్రించడానికి శ్రీ కృష్ణ పరమాత్మ గీతలో ఐదు మార్గాలను సూచించారు.
1) ఏకాగ్రతతో ధ్యానం చేయడం.
2) సాత్వికాహారాన్నే, మితంగానే భుజించాలి.
3) భక్తి- వైరాగ్య విషయాలను పదిమందితో చర్చించాలి.
ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి.
4) చూసిన వాటిని పొందాలనే కోరికలను త్యజించాలి.
5) క్రమక్రమంగా ఇంద్రియ నిగ్రహం సాధించాలి.
మనస్సును స్వాధీనం చేసుకొనే శక్తి బుద్ధికి ఉంటుంది. ”మన సస్తు పరాబుద్ధి” అన్నట్లు, అజ్ఞానులకు మనస్సు చెప్పినట్లు బుద్ధి ఆడుతుంది. జ్ఞానులకు బుద్ధి చెప్పినట్లు మనస్సు నడుస్తుంది. ఇంతకు ముందు కృత, త్రేత, ద్వాపర యుగాలలో మ#హర్షులు భగవతత్త్వాన్ని తెలుసుకోవడానికి మనస్సును, నియంత్రణకు ధ్యాన, సమాధి యోగాలను అవలబిస్తూ తపస్సు ఆచరించడం వల్లనే మోక్షాన్ని పొంది ఎంతోమందికి మార్గదర్శకులయ్యారు. కాబట్టే అభ్యసన ముఖ్యం. నీతిలేని జీవితాన్ని గడుపుతున్నా, ఐశ్వ ర్యాన్ని పొందాలనే కాంక్ష ఉన్నా, అధర్మంగా ప్రవర్తిస్తున్నా, మన స్సును నియంత్రించలేము. అందుకే త్యాగరాజు ”శాంతమూ లేక సౌఖ్యమూ లేదు” అంటూ కీర్తనను ఆలాపన చేసారు.
భజగోవింద శ్లోకం-
”కామం, క్రోధం, లోభం, మోహం
త్యక్త్వా ఆత్మానం భావయ కో అహు
ఆత్మ జ్ఞాన విహనా మూఢా:
తే పచ్యంతే నరకని గూఢా:!”లో శంకరాచార్యుల వారు ”కామ ము, క్రోధము, లోభము, మోహములను విడచినచో అనగా మన స్సులోని వికారములను త్యజించినప్పుడే నిశ్చలమైన మనస్సు తో ఆత్మను చూడగలరు అని చెప్పారు.
శ్రీ కృష్ణుని లీలలు చూసి, ఆయన గాథలు విని, గోపికలు తమ తమ మనస్సులను శ్రీ కృష్ణ పరమాత్మయందే లగ్నం చేయడానికి అభ్యసన ద్వారానే చేసి, ముక్తిని పొందారు. తెల్లవారితే పట్టాభిషే కం జరిగే తరుణంలో శ్రీరాముడు అడవుల బాట పట్టినా, మనస్సు స్థిరచిత్తమై ఉంది. కాబట్టి మనం శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పిన ఐదు మార్గాలు అనుసరిస్తూ మనస్సు నియంత్రణకు ప్రయత్నిస్తూ, సన్మా ర్గంలో నడుస్తూ, ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటే మనస్సు ను నియంత్రించవచ్చు. మనం ఆ దిశగా నడుస్తూ సుఖశాంతులు పొందుదాం! మనస్సు కవిగా ప్రసిద్ధి పొంది న కీ.శే.ఆత్రేయగారికి ఈ వ్యాసాన్ని అంకితం చేస్తూ, నివాళులు అర్పిస్తూ
– అనంతాత్మకుల రంగారావు
7989462679
మనస్సును నియంత్రించడం ఎలా
Advertisement
తాజా వార్తలు
Advertisement