Monday, December 23, 2024

మంజులా సూర్య సమర్పణలో శ్రీనివాస్ శివశ్శివమ్ ను ఆవిష్కరించిన రమణాచారి

హైదరాబాద్, (ఆంధ్ర ప్రభ) : మహా రుద్ర శబ్దాల కారుణ్యం పొంగులెత్తేలా ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ కార్తీక శోభల మధ్య అద్భుతంగా రచించి సంకలనీకరించిన శివశ్శివమ్ ప్రత్యేక గ్రంథాన్ని కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సమర్పణలో ప్రఖ్యాత కవయిత్రి, రచయిత్రి మంజులా సూర్య దైవీయ స్పృహతో ప్రచురించి జంట నగరాల్లో అనేక ఆలయాలకు ఉచితంగా అందించడం వారి పూర్వ జన్మసుకృతమని పూర్వ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కేవీ.రమణాచారి అభినందించారు.

- Advertisement -

ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ… ఈ మహాగ్రంథం దివ్యమైన మంత్రగుణాలతో ప్రకాశిస్తోందని, అత్యుత్తమ క్రియాశీలత, సృజనాత్మకత ఉన్న పురాణపండ శ్రీనివాస్ ఈ గ్రంథాన్ని వేదం ప్రామాణ్యంతో, శృతి గౌరవంతో తీర్చిదిద్దడం అభినందనీయమని కొనియాడారు. ఆవిష్కృతమైన శివశ్శివమ్ తొలిప్రతిని రాజమౌళి దర్శకత్వపు ప్రతిభ ఆర్ఆర్ఆర్ చలనచిత్ర మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ కి అందజేశారు.

శివశ్శివమ్ పదహారవ ముద్రణా భాగ్యాన్ని పంచుకోవడం తమ అదృష్టమని గ్రంథ ప్రచురణకర్త మంజుల సూర్య హృదయ సంస్కారాన్ని ఆవిష్కరిస్తోందని ప్రముఖ సినీనటులు సుబ్బరాయశర్మ పేర్కొనడం విశేషం. రసరంజని ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఏర్పాటైన నాటకోత్సవానికి విచ్చేసిన ప్రముఖులకు, రసజ్ఞులకు శివశ్శివమ్ గ్రంథాన్ని ఉచితంగా అందజేశారు. ఇటీవల త్యాగరాయ గానసభ, రవీంద్ర భారతిల్లో జరిగిన పలు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుత గ్రంథాలు వందలమంది మనస్సులను హత్తుకోవడం ఒక సంచలనాత్మక విషయంగా నిలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement