భాద్రపద మాస కర్తవ్యాల గురించి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
భాద్రపద శుక్ల పంచమిని ఋషి పంచమిగా కూడా వ్యవహరిస్తారు. మధ్యాహ్నం వరకు పంచమి ఉన్నప్పుడే ఋషి పంచమిని ఆచరించాలి. ఒకవేళ రెండు
రోజులు పంచమి ఉంటే రెండవ రోజు ఉన్న పంచమిని గ్రహించాలి. షష్ఠితో కూడిన ఉన్న ఋషి పంచమిని ఆచరించడం శ్రేష్ఠమని దివోదాసు అను ఋషి చెప్పిఉన్నారు. ఆరోజున సప్త ఋషుల ప్రతిమలను సిద్ధం చేసి యథావిధిగా షోడశోపచార పూజ చేసి విత్తులు నాటకుండానే భూమి నుండి వచ్చిన శాకాన్ని భుజించాలి. ఈ విధంగా 7 సంవత్సరాలు చేసి ఏడు కుండలలో సప్త ఋషుల ప్రతిమలును పెట్టి ఆ తరువాత రోజు ఆ యా ఋషుల మంత్రాలతో 108 సార్లు నువ్వులతో హోమం చేసి ఏడుగురు బ్రహ్మాణులకు భోజనం పెట్టాలి. ఈ విధంగా చేసినచో విద్యావంతులు, గుణవంతులు, బుద్ధిమంతులైన పుత్రులను పొందుతారని వరాహ పురాణంలోని నిర్ణయామృతంలో చెప్పియున్నారు.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి