బ్రహ్మ మానస పుత్రులలో నారదుడు ఒకడని ”మనుస్మృతి” తెలియజేస్తు న్నది ఋగ్వేదంలో నారదుని పేరు వుంది.
నారద శబ్దానికి పరమాత్మ విషయక జ్ఞానము ను ఇచ్చేవాడు అని అర్థము. అలాగే నారద శబ్దము నకు ”కలహ భోజి” అనే అర్థము కూడా వున్నట్లు కొన్ని పురాణ కథల ద్వారా తెలుస్తుంది. నారద మహర్షి జితేంద్రియుడు. సమదర్శ నము, త్రికాలజ్ఞుడు. ఆ మహర్షి లోక కళ్యాణ తత్ప రుడై సంచరిస్తుంటుంటాడు. అలా సంచరిస్తూ దీనాదులకు రానున్న ముప్పు గురించి ముందుగా చెబుతుంటాడు. ఆ ముప్పు నుండి వారు తప్పించు కునే మార్గాన్ని కూడా తెలియజేస్తుంటాడు. అలా కష్టాల్లో వున్నవారిని ఎందరినో నారద మహర్షి ఉద్ధరించారు. ఆ మహాత్ముని ఉపదేశాలను గ్రహిం చిన వారు కృతార్థులయ్యారు. ధృవుడు, ప్రహ్లాదు డు, వాల్మీకి వంటి వారికి నారాయణోపదేశం చేసి వారిని కృతార్థులుగా చేసాడు. ఈవిధంగా నారదో పదేశాలు వివిధ పురా ణాలలో వున్నాయి.
నారదుడు పూర్వ జన్మలో దాసి పుత్రుడు. బాల్యంలోనే మహాత్ముల సేవా భాగ్యాన్ని పొందా డు. ఒకసారి మహాత్ములైన ఋషులు తిన్న వంట పాత్రలు కడిగి శుద్ది చేస్తున్నప్పుడు, ఒక పాత్రలో ఋషులు తినగా మిగిలిన అన్నము భుజించాడు. ఆ వెంటనే బాలుని మనస్సు పరిశుద్ధమైంది. తన లోని పాపమంతా పటాపంచలైంది.
చాతుర్మాస్య వ్రతము పూర్తి చేసుకొని వచ్చిన ఋషులు తిరిగి వెళ్ళడానికి సన్నద్ధులయ్యారు. ఆ బాలుని కనుల వెంటకారే కన్నీటిని చూసారు. వారు ఆ బాలుడు ఒక ఆదర్శ పురుషుడని భావించి, భగ వంతుని సత్యాన్ని తెలియజేసే రహస్యాలను ఇలా బోధించారు. ”సమస్త కర్మలను బ్రహ్మార్పణం చేసి, ఆధ్యాత్మిక, ఆధి దైవిక, ఆధి భౌతికమనే తాపత్ర యాల నుండి రక్షణ పొందడం వారు బోధించారు. ఈ లోకంలో ఫలితాన్ని ఆశించి చేసే కర్మలు మాన వులను మాయాజాలంలో తోసేస్తాయి. ఇవే కర్మ లను ఎలాంటి ఫలాపేక్ష లేక, చిత్తశుద్ధితో చేస్తే తొంద రలోనే ఈ మాయను ఛేధించి బయటపడవచ్చు. బ్రహ్మ జ్ఞానం పొంది భక్తి మార్గం అవలంబిస్తే సమస్త కర్మలను భగవదర్పభావంతో చేయడానికి సులభమవుతుంది. అప్పుడు ఆత్మ ఉపాధుల నుం డి విముక్తి పొంది అనంతాత్మలో లీనమవుతుం ది.” ఇలా ఆ ఋషులు ఆ బాలునికి బోధించారు.
బాల్యంలోనే తల్లిని పోగొట్టుకొన్న ఆ బాలుడు అరణ్యానికి వెళ్ళి ఋషుల నేర్చుకున్న విధంగా పద్మాసనంలో కూర్చుని భగవంతునిపై మనస్సు లగ్నం చేసి, ఆ రీతిగా ధ్యానంలో నిమగ్నుడయ్యా డు. చివరకు తన మనో నేత్రంతో నారాయణ స్వరూ పాన్ని చూడగలిగాడు. నారాయణ దర్శనంతో ఆ బాలుని శరీరం పులకరించిపోయింది. రోజులు… నెలలు… సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంత లో మృత్యువు సమీపించింది. అది ఒక మెరుపువలె వెలుగు తోరణంగా వుంది. పంచభూతాలతో కూడి న శరీరం భూమి పై వ్రాలిపోయింది. పాలసముద్రంలో శ్రీ మన్నారాయణుడు పవ ళించిన దిక్కుగా ప్రయాణించాడు. తర్వాత బ్రహ్మ శ్వాసతోబాటు బ్రహ్మయందు ప్రవేశించాడు. నాలుగు యుగాలు గడిచాయి. బ్రహ్మ తిరిగి సృష్టి ప్రారంభించాడు. సప్త ఋషులు, మరీచి మొదలైనవారితో నారదుడు బ్రహ్మ పుత్రుడుగా జన్మించాడు. నారాయణానుగ్రహం చేత భగవం తుని విభూతులను కీర్తిస్తూ భగవంతుని ప్రేమను ప్రపంచమంతటా ప్రచారం చేస్తున్నాడు.
భాగవతములో అయిదు అక్షరాలు వున్నా యి. మొదటి అక్షరము ‘భా’ భక్తికి, రెండో అక్షరము ‘గ’ జ్ఞానమునకు, మూడు అక్షరము ‘త’ తపస్సు కు , ఐదో అక్షరము ‘ము’ ముక్తికి సంకేతములు. అనగా భక్తి జ్ఞాన, వైరాగ్యాలు పెంచుకుని తపస్సు చేసి ముక్తి పొందినవాడు నారద మహర్షి.
శ్రీ వ్యాస మహర్షి వేదాలు చెప్పిన ధర్మాలను మహాభారత కథలో జొప్పించి రచించాడు. అయి నా కూడా మనశ్శాంతి లేక విచారంగా వున్నాడు. అప్పుడు నారద మహర్షి వ్యాసునితో ”నారాయ ణుని వివిధ అవతార విశేషాలను ప్రతి ఒక్కరికి తెలి యజేయుము. అంతేకాక భగవంతుడు అవతరిం చుటకు గల కారణాలను విశదపరుచుము. పదేపదే నారాయణుని కీర్తింపుము, ఆవిధంగా చేస్తే నీ లక్ష్యా న్ని అనగా శాంతిని సాధించగలవు. అలా భాగవత రచనకు నాంది పలికించాడు నారదుడు. తర్వాత వ్యాసుడు మహా భాగవత పురాణాన్ని రచించాడు. దీనిని తన కుమారుడైన శుకునకు బోధించగా శుకు డు మానవ ప్రపంచంలో ప్రచారం చేసాడు.
– కోసూరు హయగ్రీవరావు
9949514583
భాగవత రచనకు నాంది నారద మహర్షి
Advertisement
తాజా వార్తలు
Advertisement