Wednesday, November 20, 2024

భస్మధారణ

స్వల్పభస్మధారణ, మహాభస్మధారణ అనే రెండు రకాలైన పద్ధతులున్నాయి. ఈ పద్ధతులలో ముప్ఫయి రెండు స్థానాలలో గానీ, పదహారు చోట్లకానీ భస్మధారణ చేయాలి. లేదా కనీసం అయిదు తావులందైనా భస్మమును ధరించాలి. ఇవి ఏవీ కుదరనప్పుడు త్రిపుండ్రాలనైనా ధరించాలి. దీనిని సద్యోజాతాది పంచమంత్రాల పూర్వకంగా ధరించడం మరింత విశేషం. ఆయా మంత్రాలు తెలియని వారు కనీసం ‘ఓం నమ: శివాయ’ అని స్మరిస్తూనైనా భస్మధారణ చేయాలి. ఆవుపేడతో చేసిన భస్మము అత్యంత శ్రేష్ఠమైనది. త్రివేణి స్నాన ఫలం సంప్రాప్తమౌతుంది. భస్మధారణ చేయడం వల్ల అనేక రకాల పాపాలు నశించి పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. నొసటన విభూతి, కంఠాన రుద్రాక్ష, నోట వివనామం లేని వాడు అధము డౌతాడనేది ఆర్యోక్తి. భస్మం ధరించేముందు భస్మాన్ని ఎడమచేతిలోకి తీసుకుని ఉదయం పూట కాసిని నీరుతో, సాయంత్రం వేళ నీరు కలపని దాని మీద మధ్యవేలుతో ఓంకారాన్ని రాసి, తర్వాత ఓం త్రయ్యంబకం. .. అనే మంత్రాన్ని మూడుసార్లు చెప్పి భస్మాన్ని రంగరించి ముందు నుదుటన ఆ తర్వాతే మిగతాచోట్ల పుండరీకాలు పెట్టుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement