”జపిస్తున్న కొద్దీ ఏ నామం అమృతమై, అమృతమయమై, అతిశయమై అలరారుతుందో, ఏది ఉత్తమమైన ధర్మ మార్గమో, అదే భగవంతుని నామ సంకీ ర్తన” అంటారు శ్రీ మద్భాగవతంలో బమ్మెర పోతన. కృత యుగంలో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞాలు, ద్వాపరంలో అర్చనలు భగవం తుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మార్గాలు. కలి యుగంలో భగవంతుడి అనుగ్రహం పొంద డానికి సులువైన నామస్మరణ మార్గాన్ని మన మహర్షులు నిర్దేశించారు.
రామనామ స్మరణ మహిమ వలన బల హనమైన వానరులు సైతం సేతువుని నిర్మించ గలిగేరు. నామస్మరణ మహిమ చేతనే సేతువు నిర్మాణ సమయంలో కొండలు పర్వతాలు తేలి కగా పెకిలించ బడ్డాయి. పెద్ద బండలు కూడా నీటి మీద తేలియాడేయి. సేతువు నిర్మిస్తున్న ప్పుడు ”శ్రీ రామ” అని రాసిన బండలను వాన రులతోపాటు రాముడూ సముద్రంలో వేస్తు న్నాడు. ఓ వానరుడు మీరు కూడా ”శ్రీరామ” అని రాసిన బండలనే ఎందుకు వేస్తున్నారు? అని రాముడ్ని అడిగేడు. ”శ్రీరామ” అనే నామమే శక్తివంతమైనది కాబట్టి అని శ్రీరాముడు జవాబిస్తాడు. మరో సందర్భంలో #హనుమంతుని తల్లి, అగస్త్యుని తల్లి, శ్రీరాముని తల్లి కౌసల్య ముగ్గురూ నా కొడుకు గొప్పవాడంటే, నా కొడుకు గొప్పవా డంటూ వాదులాడుకుంటున్నారు. చివరికి ముగ్గురూ శ్రీరాముని దగ్గరకు వచ్చి ముగ్గురిలో ఎవరు గొప్పవారో తేల్చమన్నారు. అప్పుడు ”శ్రీరామ” అనే నామం ఈ శరీరానికి ఆపాదింప బడిన కారణంగానే, నేనింతటి గొప్పవాడిగా పరిగణింప బడుతున్నాను. ఇందులో నా ప్రత్యేకత ఏమీలేదు అని శ్రీరాముడు చెబు తాడు. నామ విశిష్టతను తెలియ జేసేందుకు జనపదాలలో చెప్పుకునే జానపద రామాయణ విశేషాలివి. నిజానికి భగవంతుడు భగవన్నామం వేరు కాదు. శ్రీకృష్ణ తులాభారం సమ యంలో, కృష్ణుని బరువుకు సరిపోయే టం తటి బంగారం, మణిమాణిక్యాలకు కూడా సరితూ గని త్రాసు, కృష్ణుణ్ణి స్మరించుకుని, ఓ తులసి దళంపై కృష్ణ నామాన్ని రాసి, రుక్మిణి త్రాసులో వేసినంతనే, త్రాసు సరితూగడమే యిందుకు నిదర్శనం. రామ నామాన్ని స్మరించిన కారణంగానే, రత్నాకరుడు శ్లోకదాతగా మారేడు. వాల్మీకి మహర్షియై రామాయణ మహా కావ్యాన్ని మానవాళికి అందించేడు. ఓ పర్యాయం ఓ మహనీయుని ఆశ్రమం లో, గాయత్రీ మంత్ర పారాయణం భక్తి శ్రద్ధ లతో జరుగుతోంది. పారాయణంలో వారం రోజులుగా పాల్గొన్న ఓ విద్యార్థి, ఆఖరి రోజు ఏదో పనుండి, ఆశ్రమంలోని మరో భవనానికి వెళ్తున్నాడు. పని తొందరలో చూసుకోకుండా ఆ కుర్రాడు క్రిందన గాలికి పడిఉన్న, హ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ వైరుల మీద కాలు వేసేడు. చూస్తున్నవారంతా భయంతో కెవ్వున అరిచేరు. ఆ కుర్రాడు మాత్రం సునాయాసంగా ఆ విద్యు త్ వైరుల మీంచి నడుచుకుంటూ వెళ్ళి పోయే డు. జరిగిందేమిటో అర్ధం కాలేదు ఎవరికీ. ఏమీ కానందుకు అంతా సంతోషించే రు. ఆ మర్నాడు అందరూ ఆశ్రమ మహనీయుని దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పేరు. అంతా విన్న ఆ మహనీయుడు, మీరందరూ చూసింది నిజమే. నిజానికి ఆ విద్యుత్ వైరులు #హ పవర్ ఓల్టేజి వైరులే. అయితే గత వారం రోజులుగా గాయత్రీ నామ పారాయణం వలన ఆ కుర్రాడు సంపాదించుకున్న డివైన్ ఓల్టేజి, ఆ వైరుల ఓల్టేజి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువైనది. కాబట్టే ఆ విద్యుత్ ఓల్టేజ్, ఆ కుర్రాడిని ఏమీ చేయలేక పోయింది అని అందరి సందేహం పటాపంచ లు చేసేరు. కాబట్టి ఐహక భావనలు వదలి నామ మాధుర్యాన్ని ఆర్తితో గ్రోలాలి. నామాన్ని మనోభావంగా ఉచ్చరించాలి. పెదవుల నుండి కాక హృదయం లోంచి నామం రావాలి. అచం చలమైన విశ్వాసంతో నామాన్ని ఉచ్చ రించాలి. అనుభవించాలి. నామాన్ని అనుభవం లోనికి తెచ్చుకోవాలి. అటువంటి నామ స్మరణ భగ వంతుడిని కదిలిస్తుంది. అనంతమైన ఆయన అనుగ్రహాన్ని అందిస్తుంది. మన బ్రతుకులను పండిస్తుంది .
– రమాప్రసాద్ ఆదిభట్ల,
93480 06669