Tuesday, November 26, 2024

భగవత్‌ స్వరూపం ఉసిరి

హిందూదేశంలో జరుపుకునే పండగలలో ఒక్కొక్క నాడు ఒక్కో వృక్ష పూజ ఆచరణలో ఉంది. బిల్వపత్రం, శమీ వృక్షం, ధాత్రి (ఉసిరి), ఆమ్ర పుష్పం, అలాగే అమలక ఫల వినియోగం చేయడం సాంప్రదాయ సిద్ధంగా వస్తున్నది. కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి, ధాత్రిని కలిపి పూజిస్తారు. శ్రీమహావిష్ణువు స్వరూపంగా ఉసిరిని కొలుస్తారు. తులసి లక్ష్మీ స్వరూపం. పాల సముద్రంపై నుండి ద్వాదశిరోజున లక్ష్మీసహిత శ్రీమన్నారాయ ణుడు బృందావనానికి వస్తాడు. ఆ రోజు సూర్యాస్తమయం అయిన తర్వాత తులసి కోటలో తులసి, ఉసిరి కొమ్మలను పాతి ఉసిరికాయపై ఆవునేతి ఒత్తితో దీపాలు వెలి గించి తులసీధాత్రి సహిత శ్రీమన్నారాయణుని పూజించి, సకల శుభాలు, సకల పాపాలు నశిస్తాయి. రెండింటిని కలిపి కార్తీకం నుండి చైత్రం వరకు ఆరు మాసా లలో అమలకిని పచ్చిదానిని ఏదోవిధంగా వాడాలని పెద్దల నిర్దేశం. ఏడాదిలో వచ్చే ఏకాదశులు విష్ణువు చర్యలను బట్టి శయనైకాదశి, పరివర్తనైకాదశి, ప్రబోధిన్యే కాదశి, వ్రత నియమాలను బట్టి నిర్జలైకాదశి, ఫలైకాదశి, వీర పూజనాన్ని బట్టి భీష్మైకాదశి, ఇంద్రికాదశి ఏర్పడగా, ఒక ”పండు” (ఉసిరిక)తో సంబంధించి ఏర్పడింది ఒక్క అమలకి ఏకాదశి మాత్రమే. స్మృతి కౌస్తుభం, కృత్యసార సము చ్చయం, తిధితత్వం మున్నగు గ్రంథాలు కార్తీక మాసంలో అమలకి వృక్ష మూలా న ఉసిరిక కాయలతో, ఉసిరిక పత్రితో దైవారాధన చేయాలని, తులసితో పాటు కాయతో ఉసిరిక కొమ్మను పూజించాలని, ఉసిరిక చెట్టు నీడన అన్నం వండాలని, ఉసిరిక పండ్లు కలిపిన నీటితో స్నానం చేయాలని, పూర్ణిమ నాడు ఉసిరిక ఫల దానం చేయాలని, శిరస్సు, ముఖం, హస్తం, దేహమందు ఉసిరిక పండు ధరించాలని వివ రిస్తున్నాయి.
ఉసిరిక చెట్టు నీడ సోకే కొలనులో స్నానం చేయాలని, ఉసిరిక మాని కింద అరుగు మీద ఆవాసం, పూజ, భోజనం చేయాలని పెద్దల ఉవాచ. అలాగే ఫాల్గుణ మాసంలో మళ్ళీ ఉసిరిక వినియోగం ఉంది. ”అమలకే వృక్షే జనార్ధన: అని అమ దేర్‌ జ్యోతిషి మున్నగు గ్రంథాలు పేర్కొంటున్నాయి. అమలక వృక్షం జనార్ధన స్వరూపమని, దాని కింద ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని ఫాల్గుణ శుక్ల ద్వాదశి నాడు అమలకీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి తెలుపుతున్నది. సంస్కృ తంలో అమలకానికి గల పర్యాయ అమలకం గుణమును ధరించునది- పదాలు… రాత్రి దాది వంటిది- వయస్థ- వయస్సున నిలుపునది, ఫలరవ సారవంతమైనది. అమృతం వంటిది. శీతఫలి- శీతవీర్యము కలది. ప్రాణమును నిలుపునది కనుక ఉసిరికాయ అనునది సార్ధక నామమని కొందరి భావన.
ఒక నిరు పేద ఇల్లాలు ఉసిరి కాయ భిక్ష పెట్టగా, ఆదిశంకరులు కనకధారాస్తవం చెప్పి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించారని చెపుతారు. ఇక వైద్యోప యాగానికి వస్తే.. షడ్రసాల్లో ఉప్పు తప్ప మిగతా అన్ని రసాలు దీనిలో ఉన్నాయి. ఇది మహత్తర ఓషధీ గుణం కలది. అమృతా ఫలమనే గ్రంథంలో దాని ఔషధీ గుణాలు, ఫల జాతులు గ్రంథంలో సర్వాంగాల యొక్క వైద్య, పారిశ్రామిక ఉప యోగాలు, దీని రసాయనిక, కాయకల్పాది చికిత్స ఉపయోగాలు విపులీకృతమై ఉన్నాయి.”కరతలామల కము” అనే సామెత తెలియని వారుండరు. అనగా అరచేతిలోని ఉసిరికాయ. ప్రాచీన ఆర్యజ్యోతిర్విద్వాంసులు ఉసిరికాయను భూగోళమునకు ఉపముగ చూపించారు. అంటే అరచేతి అమలకము వలె గోళ సర్వస్వమును తెలుసుకున్న వారైనట్లు చెప్పారు. విషయ పరిజ్ఞానం సంపూర్ణంగా ఉంటే కరతలా మలకమనే సామెతను ఉపయోగిస్తారు. సర్వ ప్రపంచ సదృశమై,భగవత్‌ స్వరూపమై ఉన్నందునే ఆమల కము దానమున కు ముఖ్యముగా వ్యవహ రించబడుతున్నది.
– రామకిష్టయ్య సంగనభట్ల
9440595494

Advertisement

తాజా వార్తలు

Advertisement