అనేక ధర్మాలు భగవంతుడిని ఒక ప్రకాశముగా విశ్వసిస్తాయి. భగవంతుని జ్ఞానము కూడా ప్రకాశమే. దానిని అధ్యయించిన వారు కూడా ప్రకాశవంతంగా, తేలికగా అవుతారు!
ఈ ప్రకాశాన్ని ఎవరు తయారు చేసారు? భగవంతుడు, తన స్వ అవినాశి దివ్యత్వంతో భగవంతుడు, ప్రకాశ స్వరూపుడు అయిన కారణంగా అతని చుట్టుప్రక్కల ప్రపంచం కూడా ప్రకాశంతో నిండి ఉండి అంధకారాన్ని పారద్రోలుతూ ఉంటుంది. భగవంతుని ప్రకాశము అతని సాధకులైన పిల్లల ద్వారా పయనించి విశ్వమంతటిలో వ్యాపిస్తుంది. సాధకులైన తన పిల్లల జీవితాలలో ప్రత్యక్ష ఋజువును ఈ ప్రపంచం చూసినప్పుడు వారు కూడా ఈ ప్రకాశాన్ని అందుకోగలరు.
ఈ సేవ కోసం భగవంతుడు తన ప్రకాశాన్ని పైనుండి ఇస్తారు. దానిని అందుకుని, పంచినవారు సంతోషంగా ఉంటారు. వారు మానవమాత్రుల నుండి ఎంత కొద్దిగా లభించినా కానీ చింతించరు.
–బ్రహ్మాకుమారీస్.
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి