Friday, November 22, 2024

భగవంతుడి ఆజ్ఞతో ఖాళీ చేయాల్సిన ఇల్లు… శరీరం

మనం అద్దె ఇళ్ళలో ఉంటాము. ఒకానొకప్పుడు ఆ ఇంటి యజమా ని, ఇల్లు ఖాళీ చేయమని ఆదేశిస్తే, వెంటనే సామాను అంతా సర్దుకుని వేరు ఇల్లు వెతుక్కుంటాము. ఎక్కడకు వెళ్ళినా పోగు చేసుకున్న సామాను అంతా తీసుకువెళతాము.
అలాగే ఈ శరీరం కూడా ఓ అద్దె ఇల్లు. ఇందులో మనం ఎన్నా ళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే, అన్నేళ్ళు ఉంటాము. ఋణం తీరిన తర్వాత, ఈ శరీరం నుంచి ఆత్మ బయటకు గెంటి వేయబడుతుంది. దానికి ఆ తర్వాత దేహం మీద ఏ హక్కు ఉండదు. అలా దేహాన్ని విడిచిన ఆత్మ తాను గత జన్మలో చేసుకున్న పాపపు ణ్యాలు, అంతకు ముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకుని, వెళుతుంది అవే సంచిత కర్మలు.
ప్రారబ్ద కర్మలు- అనేక సంచిత కర్మలతో కలిసి జీవుడు ప్రయా ణిస్తుంటాడు. ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచిత కర్మల నుంచి, ఏ కర్మలు అయితే పక్వానికి వస్తాయో, లేదా పండుతాయో, ఆ కర్మలను అను సరించి, జీవుడికి తదుపరి దేహం ఇవ్వబడుతుంది. అంటే జన్మల పరంపరలో జీవుడు చేసిన కర్మలలో అనుభవించడానికి సిద్ధంగా ఉన్న కర్మ ప్రారబ్ద కర్మ.
ఈ దే#హం ప్రారబ్ద కర్మ ఆధారంగా ఏర్పడింది. ప్రారబ్దం ఉన్నంతవరకు దే#హం ఉంటుంది. అంతవరకు ఆ ఫలాలను అనుభ వించవలసిందే. ప్రారబ్దం తీరిన క్షణమే, మరుక్షణం కూడా కాదు, ఆ క్షణమే ఆత్మ, దేహాన్ని విడిచిపెట్టేసి, మళ్ళీ ఇంకో శరీరం యొక్క అన్వేషణలో పడుతుంది.
ప్రారబ్దం ఉన్నంతవరకు దేహం ఉంటుంది. ఈ జన్మలో మన కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహతులు, ఆప్తులు, బంధువులు మొదలైనవారంతా ఒక జన్మలో మన కర్మల ఆధారంగా మనమే ఎంచుకున్నాము. ఆయా వ్యక్తులతో మనకున్న ఋణం కారణంగా, వారి నుంచి సేవ పొందడమో, లేదా సేవ అందించడమో చేస్తాము. ఆ ఋణమే బంధము.
ఈ శరీరం ఏర్పడడానికి కారణమైన ప్రారబ్ద కర్మలన్నీ ఈ జీవితం ముగిసేనాటికి ఖర్చయి పోగా, జన్మజన్మల నుంచి వస్తున్న సంచిత కర్మలకు, ఈ జన్మలో చేసిన సంచిత కర్మలు కలుస్తాయి.
ఈ మొత్తం కర్మల్లో ఏ కర్మలైతే పక్వానికి సిద్ధంగా ఉంటాయో, అంటే అనుభవించడా నికి సిద్ధమవుతాయో, అవి ప్రారబ్దాలుగా మారి జీవుడి తదుపరి దేహం ఉంటుంది.
ఈ చక్రం ఇలానే కొనసాగుతుంది .
అందుకే ఆదిశంకరులు భజగోవింద స్తోత్రంలో

పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం

అని అన్నారు.
మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పిండంగా ఎదగడం… అంటూ అందులో స్పష్టం చేశారు. ఎప్పుడై నా కష్టం వచ్చినప్పుడు, అంతా నా ప్రారబ్దం అంటాము. అంటే ఇదే.

మనం ఒకనాడు తెలిసో, తెలియకో చేసిన పాపపుణ్య కర్మల ఫ లం ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్నాము. విత్తనం చిన్నదే కానీ, దానినుంచి వచ్చే చెట్టు పెద్దదే కావచ్చు. అలానే చేసిన పని కూడా. కాబట్టి సాధ్యమైనంత వరకు సత్కర్మలే చేయ మని శాస్త్రం చెబుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement