Tuesday, November 26, 2024

భగవంతుడికి సహాయం చెయ్యడము (ఆడియోతో…)

భగవంతుడికి మనం సహాయం చేసేవారిగా ఉండాలంటే అందుకు ఉత్తమ మార్గం ఏమిటంటే వారి నుండి అతి ఎక్కువ సహాయాన్ని పొందడమే.

సహాయం చెయ్యడమంటే వారి వైపుకు తిరిగి, భగవంతుడా, ఫలానా వారికి సహాయం చెయ్యండి అని మనం వారికి సహాయం చెయ్యండి అని మనం వారికి చెప్పనవసరం లేదు. ఎవరికి సహాయం చెయ్యాలో భగవంతుడికి తెలుసు. మనం అడగక ముందే వారు ఇస్తారు!

మనం సహాయం చెయ్యడమంటే భగవంతుడి ప్రేమను అందుకుని దానిని ఇతరులతో పంచుకుని మనకున్న ఫిర్యాదులన్నిటినీ సమాప్తం చేసుకోవడమే. ఇతరులలోని బలహీనతలను చూడటం వలన ప్రమాదం కూడా ఉంది. మనసు దానినే చూడటం అలవాటు చేసుకుంటుంది. అలా చేస్తూ, ఎందుకూ పనికిరాని అలసటను మనసు కొని తెచ్చుకుం టుంది.

ఆధ్యాత్మిక ప్రేమ మనసును సక్రమంగా పని చేయనిస్తుంది. ఇతరులు కూడా సత్యాన్నే చూసే విధంగా మనం సహాయపడాలి. శుభ భావనలు మరియు ప్రేమ పరిష్కార మార్గానికి ఎల్లప్పుడూ మొదటి మెట్టు. మన తోటి సోదర సోదరీలను ప్రేమించడమే పరిష్కారము.

-బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement