భక్తి భావాలు పవిత్రమైనవి. అందులో మాధుర్యం, అమాయకత్వము ఉన్నాయి. అవి భగవంతుని పట్ల ఉన్న విశ్వాస భావాలు. కానీ అవి చలింపదగ్గవి.విజ్ఞానము లేని విశ్వాసము నిన్ను ఎప్పుడో ఒకసారి ముంచేస్తుంది. రెండూ అవసరమే. బహుకాలపు ఆధ్యాత్మిక ప్రాప్తికి కావలసినవి – భగవంతునితో మరియు ఇతరులతో నిశ్చలమైన
ప్రేమ. ఏది ఏమైనా శుద్ధమైన భావాలు కలిగి ఉండాలి. ఒకవేళ విశ్వాసము కానీ విజ్ఞానము కానీ లోపిస్తే నీ జీవితం సక్రమంగా పని చెయ్యదు. అది ఎలా అంటే నీ డాక్టరు ఇచ్చిన మందు చీటిని నువ్వు అర్థం చేసుకున్నావు కానీ నమ్మకపోవడం వంటిది. అది నీ జీవితంలో ఖచ్చితత్వాన్ని తీసుకురాదు. కనుక, ఎల్లప్పుడూ నీ భావాలకు, నీ అవగాహనకు మధ్య సంభాషణ జరుగుతూ ఉండాలి. అవి ఒకదాని గురించి మరొకటి తెలుసుకోవడం అవసరం, అవి కలిసి చక్కగా పని చెయ్యాలి!
-బ్రహ్మాకుమారీస్.
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి