Saturday, November 23, 2024

భక్తికి.. పవిత్రతకు.. ప్రతీక రంజాన్‌

ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ సంపూర్ణంగా అవతరించిన మాసం రంజాన్‌. నెల వంకతో ప్రారంభమై… మళ్లిd నెలవంక రాకతోనే ముగిసే ఈ రంజాన్‌ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. రంజాన్‌ ముగింపులో భాగంగా ‘ఈద్‌ ఉల్‌ ఫితర్‌’ పండుగ ను నిర్వహిస్తారు. రంజాన్‌ నెలలో 29 లేదా 30వ రోజు ఆకాశంలో చంద్ర దర్శనం చేసుకుంటారు. మరుసటి రోజు ఈద్‌ జరుపుకుంటారు. నిజానికి ఈ రోజు 10 నెల షవ్వా ల్‌కు మొదటి రోజు. షవ్వాల్‌ నెలలో మొదటి రోజైన ఈద్‌ -ఉల్‌ – ఫితర్‌ నాడు ముస్లింలు ఉప వాసం చేయ కూడదనేది ఆచారం. ఇస్లామీయ దేశాలలో, ముస్లింల సముదా యాలలో అవలంబింపబడుతున్న కేలండర్‌ చంద్ర మాసాలపై ఆధారంగా గలది. దీన్ని ‘తఖ్వీమ్‌-హజ్రి-ఖమరి’ అంటారు. ఈ కేలండర్‌ లో 12 చంద్ర మాసాలు, దాదాపు 354 దినాలు గలవు.
హజ్రీ శకానికి మూలం ముహమ్మద్‌ ప్రవక్త సంబంధిత హజ్రా, హజ్రాహ్‌ లేదా హజ్రత్‌. మహమ్మదు ప్రవక్త, ఆయన అను యాయులు మక్కా నుండి మదీనాకు క్రీ.శ. 622లో వలస వెళ్ళా రు. ఈ వలస వెళ్ళడాన్నే హజ్రత్‌ అని అంటారు.
క్రీ. శ. 622. సెప్టెంబరులో మహమ్మదు ప్రవక్త అనుయాయులతో కలసి హజ్రత్‌ (వల స) ‘యస్రిబ్‌’ నగరాన్ని చేరుకొన్నట్లు చెపు తారు. యస్రిబ్‌ నగరానికి మదీనా లేదా ”మదీనతు న్‌- నబీ” లేదా నబీ (ప్రవక్త) నగరంగా పేరు స్థిరపడింది. అలా ముస్లిం ల శకం హజ్రీ ప్రారంభమయినట్లు, ఉమర్‌ కాలంలో 638లో ఇస్లామీయ కేలండర్‌ ప్రా రంభమయినట్లు చెపుతారు.
మహమ్మదు ప్రవక్త వలస. క్రీ. శ. 622 సెప్టెంబ రు 9 నాడు మక్కానగరంలోని తమ ఇంటిని వదిలి, మక్కా కు దగ్గరలోని తూర్‌గుహలో మూడు రోజులు గడిపి, 622న సెప్టెం బరు 23న మక్కా పొలిమేరలు దాటి, యస్రిబ్‌ ప్రాంతానికి పయన మైనారు. సెప్టెంబరు 20న మదీనా దగ్గరలోని ”ఖుబా” ప్రాంతానికి చేరుకున్నారు. 24 సెప్టెంబరు 34న ఖుబా నుండి మదీనా ప్రయా ణం సాగించి, శుక్రవారపు ప్రార్థనలు జరిపారు. 622 అక్టోబరు 4న మదీనా మొదటి దర్శనం జరిగినట్లు తెలుస్తోంది.
హజ్రీ ప్రారంభం మొహర్రం నెలలో కాకుండా, ఇస్లామీయ కేలండరులోని మూడవనెల అయిన రబీఉల్‌ అవ్వల్‌ నెలలో హజ్రత్‌ జరిగింది. ఇస్లాం క్యాలెండర్‌లోని హజ్రీ నెల స్థానిక చంద్రోద యంపై ఆధారపడి వుండడంతో మత పెద్దలు నెలవంక కనిపించ గానే ఈద్‌-ఉల్‌-ఫితర్‌ ప్రకటిస్తారు.
మానవునిలో గల ప్రాకృతిక ధర్మం ప్రాతిపదికగా తనతోపా టు ఇతరులకూ సంతోషాన్నివ్వ డం. ఈ ధర్మం ప్రకారం ఈ పండు గ సందర్భంగా, పేదలకు, అభాగ్యులకు ఇచ్చే దానం ప్రతి ముస్లిం ఇవ్వవలసిన కనీస దానం. ఈ దానం, రంజాన్‌ పండుగకు మూడు రోజుల ముందునుండి ఇవ్వవచ్చు. గోధుమలు, ఆహార ధాన్యాలు, ధనం పంచిపెడతారు. ఈ దానాలను ‘జకాత్‌’ అంటారు.
రంజాన్‌ భక్తి శ్రద్ధలకు, పవిత్రతకు, నియమాలకు ప్రతీక. ఏకా గ్రతతో ఆత్మసాక్షాత్కారార్ధమై, పాపములు తొలుగుటకు, లౌకిక విషయాలను పక్కనపెట్టి, పారమార్థిక విషయాలపై దృష్టి సాధిం చేందుకు కఠోర నియమాలను పాటించాల్సి ఉంటుంది. రంజాన్‌ సందర్భంగా నెలరోజుల పాటు ఉపవాస దీక్షతోపాటు, నియమిత వేళలో భుజిస్తూ దీక్షను స్వీకరించేవారు దైవభక్తి, ఆత్మ సంయమ నంతోపాటు, ఆరోగ్యవంతులుగా ఉండగలరు.

  • రామకిష్టయ్య సంగనభట్ల,
    9449595494
Advertisement

తాజా వార్తలు

Advertisement