గొడుగు తెరిచి ఉన్నప్పుడే అది మనకు ఉత్తమంగా పనిచేస్తుంది. అలాగే మనసు తెరిచి ఉంటేనే మన ఆలోచనలు, ప్రణాళికలు ఉన్నవి ఉన్నట్లుగా తర్కించి తదనుగుణంగా సృజనాత్మకంగా మనకు లభించిన అవకాశాల ను ఉపయోగించవచ్చు. నా దినచర్య సృజనాత్మకత లోపించి అలవాటుగా పునరావృతము అవుతుంది అనిపించవచ్చు అయితే మనసు చిత్రాలకు ఉపయోగించే వస్త్రం లాంటిది. దానిపై మన జీవన చిత్రాన్ని సుందరంగా చైతన్యంగా సృష్టించుకోవచ్చు మన అంతర్ మనస్సులో నుంచి తరచుగా వచ్చే ఆలోచనలు ప్రణాళికలు, అవగాహనే మన సృజనాత ్మకతకు ముడి పదార్థాలు. ఈరోజు నా మనసును సృజనాత్మకతకు తెరిచి ఉంటాను.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి