స్వయంగా భగవంతుడే మంచి చెడులకు మధ్య గీతను గీసారు. యుగాలనుండి వస్తున్న బాధలకు కారణం మానవుడి దేహ అభిమానము. ఇప్పుడు భగవంతుడు మనకు ఒక మంత్రాన్ని ఇచ్చారు. దు:ఖాలకు కారణమైన దేహాన్ని మర్చిపోయి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ దాని నిజ గుణాలైన శాంతి, ఆనందము, ప్రేమ, శక్తుల స్మృతితో కర్మలు చెయ్యాలి. ఇదే సర్వ రోగాలను నయం చేసే దివ్య ఔషధము. రోగాలతో ఉన్న ఈ ప్రపంచమే స్వర్గంగా మారిపోతుంది. ఈ మంత్రాన్ని తమ జీవితాలలో ఉపయోగించిన వేలాదిమంది సోదరసోదరీల అనుభవం ఇది.
అన్ని రకాల పరిష్కారాలను ప్రయత్నించి చూడటం జరిగింది. కానీ ఇంకా సరైన మందు కోసం వెతుకుతూనే ఉన్నారు. స్వయంగా భగవంతుడు ఇచ్చిన ఈ మంత్రాన్ని మన జీవితాలలో ఉపయోగిద్దాం, లాభాన్ని పొందుదాం!
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి