ఇప్పుడు ప్రపంచానికి అతిగా కావలసింది ‘ నైతిక మరియు ఆధ్యాత్మిక విప్లవం.’ ఈ రోజు మనిషి నల్లధనం, నల్ల బజారు, ఆధ్యాత్మిక వెలుగు లేని చీకటిలో బ్రతుకుతున్నాడు. మనష్యులు తమ మనసును చీకటిమయం చేసుకుని, బుద్ధిని మబ్బులతో కప్పేసుకుని, అంధకార విధానాలను ఆచరిస్తున్నారు. మనిషి తన మార్గాన్ని గమనించుకుంటూ గమ్యాన్ని చూసుకునే ఆధ్యాత్మిక వెలుతురు కావాలి. ఇతర విప్లవాలన్నీ మనిషి భౌతిక పరమైన సుఖ సాధనాలను ఇచ్చే విషయంపైనే శ్రద్ధపెట్టి అతడి ఆధ్యాత్మిక ఉన్నతిని పూర్తిగా ప్రక్కనపెట్టేశాయి. పర్యవసానంగా, ధైర్యహీనత, నైతిక బలహీనత, నైతిక పతనము చోటుచేసుకున్నాయి. ఈ రోజు ప్రపంచం కష్టాల కడలిలో ఉంది.
విజ్ఞానానికి ఆశా కిరణమైన విప్లవం ఇప్పటికే ప్రారంభమయింది. అని మేము ఈ పుస్తకం ద్వారా మీకు చెప్పదలిచాము. నైతిక పునర్నిర్మాణాన్ని ఆశించే ప్రతి ఒక్కరు ఇందుకు నడుం బిగించి ఈ విప్లవానికి శక్తని, వేగాన్ని అందించాలని మనవి! భారతదేశ కన్యలు, స్త్రీలు, మాతలు, సోదరీలు దీనిని నడిపిస్తున్నారు. నాయకత్వం వహించేది , ఉత్తేజితం చేసేది వీరే. భగవంతుని సూచనలు, ఆజ్ఞల మేర వీరు ఈ గొప్ప కార్యాన్ని చేపట్టారు. ఇప్పటికే ఎంతోమంది ఆత్మిక సోదర సోదరీలు ఇందులో పాల్గొని మానవాళికి తమవంతు సేవను అందిస్తున్నారు.
ఇక్కడ ఒక హెచ్చరిక ఇవ్వవలసి ఉంది. శీలమును, విశ్వాసమును కోల్పోయి ప్రస్తుత ప్రపంచం ఒక పెద్ద విపత్తు వైపుకు పయనిస్తుంది. మనుష్యులు చేసిన చెడు కర్మల కారణంగానే ఇది సంభవిస్తుంది. ఎవరైతే స్వ ఉన్నతిని, విశ్వ పునరుద్ధ రణను ఆశిస్తారో వారు సమయాన్ని వ్యర్థంగా పోనివ్వకుండా సఫలం చేసుకుంటారు.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి