భగవంతుడి జ్ఞానాని కి, సుగుణాలకు ఎంతో సంబంధం ఉంది. జ్ఞానము అను బీజము ద్వారా దివ్య గుణాలు వస్తాయి. గుణాలు కనిపించడం లేదు అంటే వారిలో జ్ఞాన బీజము పడలేదు అని, లేదా సక్రమంగా బీజమును నాటలేదు అని లేక నాటిన విత్తుకు సరైన పాలన అంది ఉండదు అని అర్థం చేసుకోవాలి. సద్గుణ ధారణ కోసం జ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. జ్ఞాన బీజం ఎంత లోతుగా, గట్టిగా నాటుకుంటుందో అంతగా గుణాల నిర్మాణము ఉంటుంది. ఏదైనా ఒక గుణం మనలో పూర్తిగా లేదు అంటే జ్ఞానంలోని ఏదో ఒక విషయాన్ని మనం ఆకళింపు చేసుకోలేదనో లేక మన అవగాహన పరిపక్వంగా లేదనో లేక ఆ జ్ఞాన విషయాన్ని కార్యంలో వినియోగించే యోగ్యత మనలో కొరవడిందనో అర్థం. విచక్షణతో జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకోనంత వరకు, మనకు అందే జ్ఞానంపై పూర్తి విశ్వాసం లేనంతవరకు మన పురుషార్థం సంపూర్ణంగా, సక్రమంగా, స్థిరంగా ఉండదు. అందుకేపరిస్థితి వచ్చేవరకు అశ్రద్ధగా ఉండటం జరుగుతుంది.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి