Monday, December 23, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

సమాధానము
మీరు మీ దినచర్యను పాటిస్తూ కూడా స్వయాన్ని ఒక బిందు స్వరూపమైన ఆత్మగా భావించండి. అంటే భృకుటి మధ్యలో ఉన్న నక్షత్రంగా అన్నమాట. ఇతరులతో కలసి పని చేసేటప్పుడు వారిని కూడా ఆత్మలుగా గుర్తించండి. ఆత్మనే చూడండి. అందరూ నిరాకార శివ పరమాత్ముని పిల్లలు. సోదర ఆత్మలు అనే భావనను
పెంపొందించుకోండి. ఈ భావనలో దృఢంగా నిలిచి ఆ తరువాత ఇతరులతో కలిసి పనిచేయండి. ఈ దృష్టికోణం, జ్ఞాపకశక్తి విశ్వాసం ఈ విధంగా ఏర్పడినప్పుడు మీ నిర్ణయశక్తి అద్భుతంగా పని చేస్తుంది. మీరు వారిని ఆధ్యాత్మికంగా అంటే మామూలు మనుష్యులకు భిన్నంగా, భౌతిక ప్రపంచంలో ఉంటూ, మాట్లాడుతూ, చూస్తూ కూడా మీరు వాటి మాయలో కొట్టుకుపోకుండా ఉంటారు. మీరు బాహ్యప్రపంచానికి బానిసగా కాకుండా ఉండటానికి ” నేను జ్యోతిర్బిందు స్వరూపాన్ని ” అనే స్తృతిలో ఉన్నప్పుడు అన్ని బంధాలు తొలగిపోయి ఒక్క పరమాత్ముని స్పృతిలోనే ఉండగలరు.
జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్ముని స్పృతి ఆఫీసులో, షాపులో, ఇంట్లో లేక మార్కెట్లో ఎక్కడైనా నిలవడం సంభవమేనా అని మీరు అడుగవచ్చు.
దానికి జవాబు – సంభవమే. మనిషి తన జ్ఞాన నేత్రాన్ని తెరచి ఉంచుకున్నపప్పుడు ఆత్మ పరిశీలన సంభవమవుతుంది. కానీ ఈ మూడవ నేత్రాన్ని మూసుకుని ఉన్నట్లయితే, తన శరీరంలోని రెండు కళ్ళు తెరుచుకుని ఉన్నా గుణాన్ని పొందడం సాధ్యం కాదు.

…బహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీల క్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement