ఆలోచనలలో కృతనిశ్చయం ఉం-టే ప్రతికూల పరిస్థితులనే మేఘాలు తొలగిపోతాయి. మన మార్గంలో అనేక ప్రతికూల పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫలితంగా మనకు దు:ఖము, బాధ మరియు నిరాశ కలుగుతుంది, ఆ సమయంలో, అటు-వంటి ఇబ్బందులు అధిగమించలేని అసక్తత, మనసులో అవి ఎల్లప్పటికి నిలిచి ఉంటాయనే భావనలలో ఉంటాము. నేను ఎదుర్కొనే ఇబ్బందులు ప్రయాణిస్తున్న మేఘాలు వంటివి అని గుర్తించడం అవసరం. నా చుట్టూ ముసురుకున్న ఈ మేఘాలు తాత్కాలికమైనవే, ఇప్పుడైనా లేక తరువాత అయినా అవి తొలగిపోవలసినదే. ఏ సమస్య ఎప్పటికీ ఉండిపోదని గ్రహించినప్పుడు నాలో నిశ్చయము అభివృద్ధి చెందుతుంది, నా సమస్యలు పరిష్కరించుకుంటాను, ఏ పరిస్థితిని అయినా సులభంగా ఎదుర్కొన గలుగుతాను.
– బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి