Tuesday, November 26, 2024

బ్రహ్మాకుమారీస్‌.. సహజ స్వభావము (ఆడియోతో..)

ముఖ్యమైన వి షయము మరొకటి కూడా ఉంది. ఆత్మకు కావలసిన ఆవశ్యక సుగుణాలు – పవిత్రత, శాంతి. ఈ రోజుల్లో ఆచార వ్యవహారాలను ఆచరించడం మాత్రమే ధర్మంగా పరిగణిస్తున్నారు. ఉన్నత విలువలు, సత్ప్రవర్తన కేవలం పుస్తకాల వరకే పరిమితమయ్యాయి. కానీ శాంతి పవిత్రతలు వంటి ఆధ్యాత్మిక విలువలను కోల్పోయిన కారణంగా ఈనాడు మానవుడు దు:ఖాలలో మునిగి ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో స్వయాన్ని ఆత్మగా, పరమాత్ముని సంతానంగా గుర్తించి, ఆత్మ స్వధర్మము పవిత్రత మరియు శాంతి అని తెలుసుకుని ఈ నిరంతర స్మృతిలో ఉండటం ఎంతో అవసరం. కోపము మనకు అవసరమైనదీ కాదు, మన స్వధర్మమూ కాదు. తన కోపం వల్ల ఇతరులు బాధపడటంతో పాటు తనకూ ఈ కోపము దుఖమును ఇవ్వట్లేదా? అలాగే శాంతముతో నిండిన మనసు ఇతరులకూ ప్రశాంతతను చేకూర్చదా? కనుక శాంతిని పెంపొందించే కార్యాన్ని మాత్రమే చేసే అలవాటు మనకు రావాలి. ప్రశాంతమైన మనసు నుండే విజయము ఉద్భవిస్తుంది. అందుకే అంటారు ఎక్కడ ధర్మము ఉంటుందో అక్కడ విజయము తప్పక ఉంటుంది అని. వేడి ఇనుమును కోసేది, వంచేది చల్లని ఇనుమే, కనుక, ఉద్రేకముతో ఉన్న వ్యక్తితో ప్రశాంతంగా వ్యవహరిస్తే విజయం మనల్ని వరిస్తుంది. మీ ధర్మము శాంతి అని గుర్తించండి. మన మాటలు ఆరంభమైనా, ముగిసినా ఓం శాంతి(అనగా శాంతి నా స్వధర్మము లేక నీకు శాంతి కలుగుగాక అని అర్థం) అను మధుర పలుకులతో కావాలి.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement