సహజ స్వభావాన్ని మరచి పర స్వభావాన్ని అవలం బించడం వలననే బాధ కలుగుతుంది. ఉన్న ప్రదేశాలకు తగ్గట్టుగా రంగులు మార్చే ఊసరవల్లిగా కాక అన్ని పరిస్థితులలోనూ వాస్తవిక సహజ గుణమైన సమ భావంతో మసలుకోవాలి. ఎందుకంటే నిత్య సంతోషాన్ని పొందాలంటే మనపై మనకు నింయంత్రణ ఉండటం ఎంతైనా అవసరం. స్వయంపై నియంత్రణ కలిగి ఉండటం వలన మనిషికి శక్తి లభిస్తుంది. స్వయానికి సరైన మార్గాన్ని నిర్దేశించుకుని, ఆలోచనలను భగవంతునితో జోడిం చే ప్రక్రియలో పరిశీలనా శక్తి పెరిగి సంకట సమయంలో సరైన మార్గదర్శన చేస్తుంది.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి