ఇతరుల గురించి ఆలోచించడం వలన పొందేది ఏదీ లేదని ఒక జ్ఞానికి తెలుసు. శుద్ధమైన ఆలోచనలు మరియు భావాలే అంతా చేస్తాయి. ఇంతకుమించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
నీ సంకల్పాల నాణ్యత నీ ఆధ్యాత్మిక సాధనపై ప్రభావాన్ని చూపుతాయి. కావున నీ సంకల్పాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండు. లేకపోతే, ఒక సమయానికి నీ ఆలోచనా విధానము ఆధ్యాత్మికంగా కాక సాధారణంగా మిగిలిపోతుంది. ఇందుకు గుర్తు ఏమిటంటే నీ మనసు పోటీపడుతూ ప్రతి చిన్న విషయానికీ సున్నిత మనస్సుతో స్పందించడం మొదలవుతుంది. చివరకు నీవు ఇతరుల అభిప్రాయాలకే కాక నీలోని అవగాహనా లోపమునకు కూడా బలి అయిపోతావు.
సంకల్పాలు నీకు మంచి మిత్రునిగానూ ఉండగలవు, లేక బద్ధ శత్రువులా కూడా ఉండగలవు. అది నీ చేతుల్లో ఉంది.
–బ్రహ్మాకుమారీస్.
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి