Tuesday, November 26, 2024

బ్రహ్మాకుమారీస్‌.. శరణు అనగా నేమి? (ఆడియోతో…)

శరణు అనగా తనదంతా సమర్పణం చేసి ఎవరి రక్షణలోనైనా వెళ్ళిపోవుట. పరమాత్మ శరణాగతి పొందాలనే దాని అభిప్రాయం తన మనసు – తనువు- ధనములను అతనికి సమర్పించి అతని ఆజ్ఞనుసారమే వాటిని ప్రయోగించుట. ప్రపంచంలో తనువు, మనసు, ధనంతో సబంధం లేని పనులుండవు. పాపకర్మలు జరిగేది కూడా వీటితోనే. సత్కర్మలు జరిగేది కూడా వీటి ప్రయోగంతోనే ఇపుడు వీటి దవ్‌రా పాపకర్మలే జరుగకుండా శుభైన కర్మలే జరగాలంటే మన జాతక చక్రం గురించి తెలిసిన వాడు కర్మల గుహ్యరహస్యం తెలిసినవాడున గు ఆ పరమాత్మ సలహా ప్రకారం నడిచినపుడే సంభవిస్తుంది. నేను ఎవరితో ఏ విధమైన ఇచ్చిపుచ్చుకొనుట చేయాలి. ముందు ముందు పాప కర్మల ఖాతా తయారు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది ఒక్కపరమపిత పరమాత్మ తప్ప నాకెవరు చెప్పగలరు? దేహ సంబంధీకులతో నాకిపుడు ఏ ఇచ్చిపుచ్చుకునే కర్మబంధనాలున్నాయి? నా జీవిత నిర్వహణా ధనంతో ఎంత హద్దు వరకు ఏ విధంగా చేయాలి? అనే ప్రతి పైసపైన యొక్క సూక్ష్మ లెక్క ఖాతాలు పరమాత్మకు తప్ప ఇంకెవరికి తెలుసు? నేను ఎవరి వద్ద ఎంత వరకు సేవ తీసికొనవచ్చు? ఇచ్చిపుచ్చుకునే అధికారం వున్నదా? ఇది ఏ మానవునకు తెలుసు? ఈ సర్వకర్మ బంధనాల నుండి విముక్తులగుటకు స్వయంగా కర్మ బంధనాలలో చొక్కుకొని యున్న మానవుల అభిప్రాయం పప నడిచినట్లైతే సఫలత లభిస్తుందా? ఏనాటికీ కాదని సమాధానం లభిస్తుంది.

ఒక్క పరమాత్ముని శరణులోనికి వెళ్లుటవలననే అతని శ్రీమతానుసారం అడుగడుగు ప్రవర్తించుట వలననే మానవులు కర్మ బంధనాల నుండి ముక్తులు కాగలరు. మరియు పాపకర్మల లెక్క ఖాతాలు సమాప్తి కాగలవు. దీనికి మించి ముక్తి – జీవన్ముక్తి కర్మాతీత స్థితిని పొందే ఉపాయం మరేది లేదు. ఈ కోట్ల విలువైన మాటలను బుద్ధిలో చక్కగా ధారణ చేసికొనాలి.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement