Saturday, November 23, 2024

బ్రహ్మాకుమారీస్‌ – శక్తి (ఆడియోతో…)

శక్తి లేక పవిత్రత కిరీటం ధరించి తేజస్విమూర్తులైన అనుశాసనకర్త వలె తెల్లని టోపీలలో కప్పబడిన ఉన్నతమైన మంచు పర్వత పంక్తులను వీక్షించండి. అవి పైకి లేస్తే కిరీటాన్నీ ధరించి ముందుకు సాగిపోతూ ఉంటాయి. అవి తమ మార్గంలో వ చ్చే చిన్న పెద్ద విఘ్నాలతో ప్రభావితం కాకుండా నిరంతరం సాగిపోతూనే ఉంటాయి. అలసటలేని వారికి బాధయనే శబ్ధాన్ని గురించి తెలియదు.

శక్తి అంటే కొంచెం యుద్ధంలో ఓడిపోవచ్చుగాక కానీ చివరికి మహాయజ్ఞ ంలో విజయం మనకు తప్పక సిద్ధిస్తుందనే విశ్వాసం కలిగియుండుట, దృఢ సంకల్పం గురించి ఒకవేళ మన లక్ష్యం అపుడప్పుడు చాలా దూరంగా అందరానంతగా అనిపించినప్పటికీ లక్ష్యసిద్ధి వరకూ గమ్యం చేరుకొనేంతవరకూ దృఢనిశ్చయం చేసికొని దేనికీ ఆకర్షితులు కాకుండా, నిర్భయంగా వుండే దృఢనిశ ్చయం కలవారు సంశయం యొక్క ఏ బలహీన సంకల్పం లేకుండా నిర్భయంగా వుండాలి. అంతర్గతంగా మరియు బాహ్యంగా కూడా అపవిత్రతను ఎదుర్కొనే శక్తిని ధరించి అపవిత్రతను నశింపజేసే మహావీరులు మహాయోధులు. నేను సర్వశక్తివంతుడైన పరమాత్ముని సంతానమును మరియు ఆజ్ఞాకారిని అగుట వలన ఆ శక్తిపై అధికారము కలిగిన అధికారిని అని సదా నిశ్చయం పెట్టుకొనే వారు శ క్తిపరులు.

-బ్ర హ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement