Saturday, November 23, 2024

బ్రహ్మాకుమారీస్‌.. వంశపరంపర గురించిన ఆలోచన (ఆడియోతో..)

ఒకవేళ మనిషి తన వంశపరంపర గురించి ఆలోచిస్తే పవిత్రతను కాపాడే తన వంశపరంపరను అతడు నిలబెట్టినవాడవుతాడు. తన కుటుంబం గురించి ఆలోచించినప్పుడు అతడు ఈ విధంగా ఆలోచించాలి. ” నేను ముందుగా ఆత్మల పరివారానికిచెందిన వాడను. ఇక ఈ దైహికమైన స్థూల వంశము గురించి ఆలోచిస్తే నేను బ్రహ్మ సరస్వతులు(ఆదమ్‌, బీబీ), శ్రీ లక్ష్మీ నారాయణులు, సీతా రాములు మొదలైన ఇతర దేవతల మార్గంలోనే నడుస్తున్నాను అని భావించాలి. కనుక, నేను కూడా దేవతల వలె పవిత్రంగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలోను నేను దైవీ వంశానికి మచ్చ తీసుకురాకూడదు.” అంతే కాక అతడు పవిత్రమైన బిందు సమానమై బిందు సమానమైన ఆత్మీయని, ఆత్మల లోకమైన పరంధామము అతని నివాస స్థానము అని నిరంతరం స్మృతిలో ఉండాలి. అంతే కాక అతను ఇలా ఆలోచించాలి. ” నేను నా విశ్వాసాన్ని పోగొట్టుకోను, కామమును నా మనసులోకి రానివ్వను.” ఒక యోగి ఈ మాటపై నిలబడినంత కాలం అతడు పవిత్ర జీవితాన్ని గడుపుతాడు.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement